S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/15/2017 - 00:38

జీవితం ఎప్పుడూ ఒకేరకంగా ‘నల్లేరు మీది బండి నడకలా’ సాఫీగా సాగిపోతే- అది జీవితం ఎందుకవుతుంది..? ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు జీవన యానంలో ఎవరికైనా తప్పవు. మనిషిలో ఉండే మంచి చెడులు, బలాలు బలహీనతలు, స్వయంకృత దోషాలు ఇవే చాలా వరకు బతుకు బండి దశ, దిశను నిర్దేశిస్తూ వుంటాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగానో, విధివశానో సంభవించే కష్టనష్టాలకు మనం బాధ్యులం కాము.

07/14/2017 - 00:45

భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, లడఖ్, పాకిస్తాన్, బర్మా, నే పాల్ ఇవన్నీ కలసి ఒకే దేశంగా ఉన్నది కేవలం అశోకుడి కాలంలోనే. అంత విశాల భూభాగం మన దేశానికి ఆనాడు ఉండేది. అంతకు ముందెన్నడూ ఇండియాకు అంత పెద్ద మ్యాప్ లేదని చరిత్రకారులు అంటారు. ఇంత పెద్ద దేశంలో కళింగదేశం మాత్రం అశోకుడిని ధిక్కరించింది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, సైనిక బలగం అంతగా లేని దేశమది. వాళ్లకున్నది కేవలం సాహసం.

07/13/2017 - 01:46

సిక్కింలోని నాథులా కనుమ మార్గం గుండా ‘సీమాంతర’ వా ణిజ్యాన్ని పునరుద్ధరించడం వల్ల చైనా ‘చొరబాటు’ మరింత విస్తరించిందన్నది ధ్రువపడిన సత్యం! ఈ ‘చొరబాటు’ వా ణిజ్య దురాక్రమణ, వ్యూహాత్మాక దురాక్రమణ. ఇప్పుడు ‘సిక్కిం- భూటాన్’లలో విస్తరించి ఉన్న డోక్‌లా-డోక్‌లామ్-పచ్చిక మైదానంపై చైనా దళాలు జరిపిన భౌతిక దురాక్రమణకు ఈ వాణిజ్య దురాక్రమణ పూర్వ రంగం.

07/12/2017 - 01:06

‘విప్లవాల పురిటిగడ్డ’గా ప్రఖ్యాతి పొందిన లాటిన్ అమెరికాలోని వెనిజులాలో- ‘21వ శతాబ్దపు ఆధునిక సోషలిజం’ స్థాపిస్తానని 1999లో అధికారంలోకి వచ్చిన హ్యోగోఛావెజ్ ‘ప్రయోగం’ ఇపుడు ఆ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. అక్కడి ఆర్థిక వ్యవస్థను దివాలా తీసేలా చేసింది. ఫలితంగా అక్కడి ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

07/11/2017 - 00:04

తాజాగా జర్మనీలో జరిగిన జి-20 సదస్సులో చైనా-్భరత్ అధినేతల ద్వైపాక్షిక చర్చలను చైనా ఏకపక్షంగా తిరస్కరించటం ద్వారా తన యుద్ధకాంక్షను, విస్తరణ వాంఛను బహిర్గతం చేసింది. ‘డొక్లామ్’ ప్రాంతం నుండి వైదొలిగేది లేదని మొండిగా ప్రకటించి భూటాన్, సిక్కింలను కబళించాలనే తన దుర్బుద్ధిని మరోసారి చైనా నిరూపించుకుంది. నిజానికి ‘చైనా సరిహద్దు’ అనేది చారిత్రకంగా ఎక్కడ ఉంది?

07/10/2017 - 00:40

మనిషి కోసం టెక్నాలజీయా? టెక్నాలజీ కోసం మనిషా? అంటే నేడు జరుగుతున్న అభివృద్ధి అంతా టెక్నాలజీ కోసమే అనే అర్థంతో కొనసాగుతోంది. ఒకప్పుడు మనుషులకు పని కల్పిస్తే ఇప్పుడంతా యంత్రాలకు పని కల్పంచడమే! మేధో ఆవిష్కరణలన్నీ అవసరం మేరకే వినియోగించబడితే, ఆరోగ్యకరమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. కొనసాగుతుంది.

07/09/2017 - 00:38

‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే ఏమిటో ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థి పర్యటనలో తెలుగు రాష్ట్ధ్రానేతలు చేసిన హడావుడి చూస్తే అర్థమవుతుంది. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ‘ఓటు అభ్యర్థన’ కోసం వచ్చినప్పుడు ఆయనను స్వాగతిస్తూ ‘ఇద్దరు చంద్రులు’ చేసిన సందడి విస్మయం కలిగించేదే. కోవింద్ ఇప్పుడు రాష్టప్రతి కాదు. కేవలం అభ్యర్థి మాత్రమే.

07/08/2017 - 00:51

‘స్వచ్ఛ భారత్’కు, ‘స్వస్థ భారత్’కు బోలెడంత అవినాభావ సంబంధం ఉంది. పనికిరాని చెత్తాచెదారం, ఇతర వ్యర్థ ప దార్థాలు, మురుగు కాల్వలు, నీటి కుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలై మానవ సమాజానికి అనారోగ్య పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నందున ఏటా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభిస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

07/07/2017 - 00:35

ఇంత విస్తృతంగా ప్రసార మాధ్యమాలు లేని కాలంలో ‘దూరదర్శన్’ను మించిన టీవీ చానల్ లేదు. అప్పట్లో అందులో ప్రసారమైన ‘మహాభారత్’ సీరియల్ మన ప్రసార మాధ్యమాల చరిత్రలో ఓ మైలురాయి. బిఆర్ చోప్రా నిర్మాతగా రవి చోప్రా దర్శకత్వంలో ప్రముఖ ఉర్దూ కవి రాహి మాసుమ్ రజా, పండిట్ నరేంద్రశర్మ ‘మహాభారత్’కు మాటలు రాశారు. దీని మొదటి ఎపిసోడ్‌ను లాంఛనంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి చూపించాలని ఆహ్వానించారు.

07/06/2017 - 00:25

ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టడం చారిత్రక అనివార్యం. ఆ ప్రారంభానికి ఇప్పుడు అంకురార్పణ ఎందుకని జరగరాదు? టిబెట్ రెండు వేల ఏళ్లకు పైగా స్వతంత్ర దేశమని, దాన్ని క్రీస్తుశకం 1959లో చైనాలోని కమ్యూనిస్టు నియంతృత్వ ప్రభుత్వం దురాక్రమించిందని మన ప్రభుత్వం ఇప్పుడైనా ఎందుకు ప్రకటించరాదు?

Pages