S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/05/2017 - 01:02

రచ్చ గెలిచినా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా ఇంట గెలవలేదు. ఈ విషయాన్ని సాకుగా తీసుకునే సందీప్ దీక్షిత్, ములాయం సింగ్, మణిశంకర్ అయ్యర్, అజం ఖాన్ బృందం- మోదీకి బదులుగా భారత సైన్యం మనోబలాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో వీరంతా ‘పాక్-చైనాల నుంచి జీతభత్యాలు పొందేవారి జాబితా’లో ఉన్నారా? అనే అనుమానాలు కలగడం సహజం.

07/04/2017 - 01:04

మొట్టమొదటిసారిగా మావోయిస్టుల కంచుకోట లాంటి వారి ప్రాబల్య అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి దాడులు చేసి, వారి స్థావరాలను ధ్వంసం చేసామని చత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారి, మావోయిస్టు వ్యతిరేకదాడుల ఇన్‌చార్జి డి.ఎం.అవస్తి ఇటీవల ప్రకటించారు.

07/03/2017 - 00:52

అడిగిన జీతంబియ్యని
మిడిమేలుపు దొరను గొలిచి మిడుకుట కంటెన్
వడిగల ఎద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతి!

07/02/2017 - 00:09

గోసంరక్షణ పేరిట హింసకు పాల్పడితే సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే గట్టి హెచ్చరిక చేశారు. అయినప్పటికీ ‘సంశయవాదులు’ మాత్రం మోదీ ‘మాట మీద నిలబడాల’ని మొండిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి విషయాన్నీ వివాదాస్పదం చేయాలనుకుంటున్న వీరు గోసంరక్షణ అంశంపైనా అగ్నిజ్వాలలు రాజేస్తున్నారు.

07/01/2017 - 00:54

ఇంతవరకు మన దేశానికి సంబంధించి మరే ప్రధాన మంత్రి జరపనన్ని విదేశీ పర్యటనలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరుపుతున్నారు. దౌత్యపరంగా భారత్ ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పలు చిన్న చిన్న దేశాల్లో కూడా ఆయన పర్యటిస్తున్నారు. పలు సంపన్న దేశాల అధినేతలతో వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

06/30/2017 - 00:25

‘రిషికేశ్‌లోని ఓ స్వామీజీ తపస్సు చేసుకుంటుంటే ఆయన వద్దకు ఇద్దరు అన్యమతస్థులు వచ్చారు. ‘స్వామీజీ.. మీ మ తం గొప్పదా? మా మతం గొప్పదా?’ అని ప్రశ్నించారు. ఏం చెప్పినా బాగుండదని తర్కించిన స్వామీజీ ‘మీ మతం మీకు గొప్ప! మా మతం మాకు గొప్ప’ అన్నారు. ‘లేదు లేదు.. మా మతమే గొప్పది.. మేం చెప్పేది నిజం’ అంటూ వారు కుతర్కం మొదలుపెట్టారు.

06/29/2017 - 00:28

రాష్టప్రతి భవనంలో రాష్టప్రతి వ్యక్తిగత ఉపయోగం కోసం కేటాయించిన విభాగంలో అనేక మార్పులు జరిగాయి. ఆర్భాటం తొలగిపోయి నిరాడంబర సౌందర్యం నెలకొనడం ఈ మార్పులలోని ప్రధాన అంశం. రాష్టప్రతి శయన మందిరం నుంచి భారీ వెలల అలంకరణ సామగ్రిని, విలాసవంతమైన వ్యవస్థను తొలగించారు. ఖరీదైన తెరలను, విభాగినుల-పార్టిషన్స్, ‘కుషన్’ పరుపులను, పట్టుదుప్పట్లను తీసివేసారట.

06/28/2017 - 02:04

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను, ఇజ్రాయిల్ అధినేతను కలియటంలో ఉద్దేశం ఏమిటి? వివిధ దేశాధినేతలు పరస్పర సహకార సూచకంగా ఇలా కలిసి సంప్రదింపులు జరుపుకోవడం, ద్వైపాక్షిక ఒప్పందాలు ఉభయతారకంగా చేసుకోవడం మామూలే. ఐతే, ప్రస్తుత తరుణంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందుగా ఇజ్రాయిల్ గురించి ఆలోచిస్తే అదొక శక్తిమంతమైన దేశం.

06/27/2017 - 00:13

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంతమేరకు నష్టపోయిందో ఆ నష్టాన్ని గత మూడు సంవత్సరాల కాలంలో రూపుమాపి, పది రెట్ల వేగంతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రభాగాన నిలిచేలా ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రజల పక్షపాతిగా నిలుస్తూ రాజకీయ అవినీతికి అంతం పలికేందుకు కంకణం కట్టుకునే ప్రభుత్వానికే ఎప్పుడూ జనం జేజేలు పలుకుతారు.

06/26/2017 - 01:01

శ్రీకాకుళంలో పేరుమోసిన కథా రచయిత ఎవరు?...త్రిపురనేని రామస్వామి చౌదరి, చేకూరి రామారావు...చారా! ‘కారా’ అనే పేరు విన్నారా..?...ఆ! అ అ...(కాళీపట్నం) ఆ! రామారావు. కాళీపట్నం రామారావు! ఆయన ప్రసిద్ధి రచనలు తెలుసా? నక్షత్రాల గూర్చి, రుతు పవనాలు వస్తున్నాయి నవలు రాశాడు..! (ఆయనో పేరుమోసిన కథా రచయిత...

Pages