S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

06/14/2017 - 02:23

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్ బ్రాహ్మణ పండిట్ల కు టుంబంలో పుట్టినా ఏ ఛాందసాలనూ తన దరికి చేరనీయలేదు. ‘పండిట్’ అంటే వేద పండితుడు కాదు, లోకం పోకడను, ప్రపంచ పరిణామాలను ఎరిగిన పండితుడు. తన దేశానికేం కావాలో, తన ప్రజల మనోభావాలేంటో నెహ్రూ అర్థం చేసుకున్నంతగా- ఒక్క అంబేద్కర్ తప్ప మరే నేతలూ అర్థం చేసుకోలేదు. దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్ని ధారబోసింది నెహ్రూ కుటుంబం.

06/13/2017 - 04:07

నాటికీ నేటికీ యువతకు ఆహ్లాద పతాక, నవ్య కవితాపుతీక, సాహితీ రంగ అంతరంగాలను ఎదపొరలను ఆవిష్కరించినట్లు ఆవిష్కరించగలిగే విజ్ఞులు, రసజ్ఞులు, అసమాన గేయకవితా ధురీణుడు, వచన కవితా వికాస లహరి డాక్టర్. సి.నారాయణరెడ్డి. ‘సింగిరెడ్డి’ ఇంటిపేరే గానీ కవిత్వపుసింగడి సినారె. తెలుగు సాహిత్య మేరు నగం.

06/12/2017 - 01:09

ఎక్కడా లేనన్ని బాలల హక్కుల సంఘాలు మన దేశంలోనే వున్నా, బడి బయట బాలల హక్కుల ఉల్లంఘనలు తప్ప, బోధన పేరిట బడిలో జరుగుతున్న ఉల్లంఘనలు ఏ ఒక్క హక్కుల సంఘానికీ పట్టడం లేదు. పాఠశాలకు పోవల్సిన వయస్సెంతో, ఏ వయస్సుకు ఎంత చదవాలో, ఎన్ని పుస్తకాలు చదవాలో, ఎన్ని భాషల్ని నేర్చుకోవాలో, ఉన్నత చదువులనే ఊహాజనిత ఆలోచనలతో ఎనె్నన్ని పోటీ పరీక్షలు రాయాలో ఈ సంఘాల వారెవ్వరికీ పట్టదు.

06/11/2017 - 01:10

ఎలాంటి పొరపాటు, తడబాటు లేకుండా మనం స్పష్టంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే- ఈ దేశంలో కొన్ని శక్తులు తమ నైపుణ్యాలన్నింటినీ వెచ్చిస్తూ మన సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దారుణంగా వి చ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, దానికి సంబంధించిన సర్వ సంస్థలను పలుచన చేసే క్రమంలో ఎన్నికల ప్రక్రియను ‘చట్టబద్ధం కాని వ్యవహారం’గా ఆ శక్తులు పరిహాసం చేస్తున్నాయి.

06/10/2017 - 00:27

విశ్వ వేదికపై భారతదేశం తన నాయకత్వాన్ని నెమ్మది నెమ్మదిగా బలపరుచుకుంటోంది. ఏ రంగమైనా, ఏ అంశమైనా భారత్ పాత్ర లేకుండా, భారత్ అభిప్రాయం తెలుసుకోకుండా, భారత్ ప్రమేయం లేకుండా ప్రపంచంలో కీలక నిర్ణయాలు జరగడం లేదు. అయితే, ఈ ముఖ్య అంశాన్ని గుర్తించడంలో మనం వీలైనంత ఎక్కువ జాప్యం చేస్తున్నామేమో అని అనిపిస్తున్నది.

06/08/2017 - 23:52

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై- ఏ అంశం దొరికినా వదలకుండా విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ప్రధాని పదవిని చేపట్టి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో పశువధను నిషేధిస్తూ తీసుకున్న కీలక నిర్ణయాన్ని మీడియాలోని ఒక వర్గం, కొన్ని రాజకీయ పార్టీలు, సం స్థలు కావాలని వివాదాస్పదం చేస్తున్నాయి.

06/08/2017 - 21:08

రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో వ్లాదిమిర్ పుతిన్ జపాన్‌కు వెళ్లాడు.. క్రీస్తుశకం 2000వ సంవత్సరం నాటి ‘కథ’ ఇది.. జపాన్ రాజధాని టోకియో నగరంలోని ఒక మైదానంలో ‘జూడో’ సమర క్రీడా ప్రదర్శనలు జరిగాయి! ఆ ప్రదర్శనను తిలకించడానికి రష్యా అధ్యక్షుడు వెళ్లాడు! పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ‘జూడో’ క్రీడా విన్యాసాలను ప్రదర్శించారు! వారిని చూసి పుతిన్‌కు కూడ ఉత్సాహం వచ్చేసింది!

06/06/2017 - 23:59

‘తల్లీకొడుకుల’ రాజ్యం అంతరించిపోయి, ఓ పేద మహిళ కుమారుడైన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడిచాయి. మోదీ మూడేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా ఓ ఆశావహ వాతావరణం నెలకొంది. యుపిఎ నేతల పదేళ్ల నిర్వాకం ఫలితంగా ఖాళీ అయిన ప్రభుత్వ ఖజనా మోదీ వచ్చాక క్రమంగా నిండడం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడడంతో అనేక ప్రజోపకరమైన పథకాలు రూపుదిద్దుకున్నాయి.

06/06/2017 - 00:12

సామాజిక మీడియాపై కొందరు నేతలకు, ప్రభుత్వ వర్గాలకు ఎందుకంత అక్కసు! స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నట్టే స్వే చ్ఛగా ఆలోచించే హక్కు కూడా ప్రజలకు ఉంది. అది అనాదిగాను ఉంది, దాన్ని రాజ్యాంగమూ ఇచ్చింది. కానీ, ప్రజలకున్న ఆ ప్రాథమిక హక్కుకు కత్తెర వేసేవారు ఇటీవల ఎక్కువైపోతున్నారు. అలా కత్తెర వేయడమేమిటని ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు.

06/05/2017 - 00:29

మన రాజకీయ నాయకులు ప్రజలకన్నా, వ్యక్తిగతానే్న నమ్ముకున్నారు కాబట్టి- ఒకరు ‘మన్‌కీ బాత్’ అంటే, మరొకరు ‘సర్వేలే సర్వాంతర్యామి’ అంటారు. ఇంకొకరు రాజధాని నిర్మాణమే ‘సర్వరోగ నివారిణి’ అంటారు. ఈ నేతలు అయిదేళ్ల పాలన అప్పుడే ముగిసినట్లు, ఇక మిగిలింది ఎన్నికల సీజన్ అని ప్రజలను భ్రమింపచేస్తున్నారు. మూడేళ్ల పాలనను మూడు దశాబ్దాల పాలనలా మురిపిస్తున్నారు.

Pages