S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

05/15/2017 - 00:19

న్యాయస్థానాల్లో ‘యువర్ మెజెస్టీ.. యువరానర్.., మిలార్డ్..’ లాంటి బానిస పదజాలాన్ని గుర్తించడానికి దశాబ్దాలు పట్టింది. వలసవాదుల కాలంలో రూపొందిన ఈ అతి విధేయ పదజాల నిబంధనలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఇంపైన పదజాలం న్యాయవ్యవస్థకు నిత్యం ముసుగు వేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ గొప్పదా? న్యాయవ్యవస్థ గొప్పదా? అనే చర్చకు పార్లమెంటే అత్యున్నతమనే సమాధానం వస్తుంది.

05/14/2017 - 01:24

అనారోగ్యం పాలైనప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ( ఏ వ్యాధితో ఆమె తరచూ అమెరికన్ ఆస్పత్రులకు విహారయాత్రలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు) విపక్ష పార్టీలతో ‘లౌకిక కూ టమి’ ఏర్పాటు చేసి రాష్టప్రతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆస్పత్రిలోనే ఉంటూ ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ)కి ఫోన్ చేసి- రాష్టప్రతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం గురించి మాట్లాడారు.

05/12/2017 - 01:31

ముల్లా నసీరుద్దీన్ అనే సూఫీ ఫకీరు కొన్నాళ్లు ఓ నవాబు దగ్గర వజీరుగా పనిచేశాడు. నవాబు ‘నంది’ అంటే ఇతడు ‘నంది’ అని, కాదు ‘పంది’ అంటే ‘పంది’ అనేవాడు. ఓ రోజు నవాబుతో కలిసి అతను భోజనం చేస్తున్నాడు. ఆ రోజు భోజనంలో వంటవాడు వంకాయ కూర వడ్డించాడు. ‘ఆహా..! ఎంత రుచిగా ఉంది ఈ వంకాయ’ అన్నాడు నవాబు. వెంటనే పక్కనున్న ముల్లా అందుకుని- ‘మహాప్రభూ..! ఈ ప్రపంచంలో వంకాయను మించిన కూర లేదు..

05/11/2017 - 02:37

ఐరోపా దేశాలలో ‘సంకుచిత జాతీయ తత్త్వం’ పెరుగుతోందన్నది రెండు దశాబ్దులుగా జరుగుతున్న ప్రచారం. ఇది ‘సంకుచిత జాతీయ తత్త్వం’- అల్‌ట్రా నేషనలిజమ్- కాదని, ‘స్వజాతీయతా నిష్ఠ’- నేషనలిస్ట్ కమిట్‌మెంట్- అని సమాంతర ప్రచారం కూడా జరుగుతోంది.

05/10/2017 - 01:54

ఈమధ్యకాలంలో విద్యా వ్యవహారాలపై మునుపెన్నడూ లేనంతగా విస్తృతంగా చర్చ, విమర్శల పరంపర కొనసాగటం హర్షణీయం. తెలంగాణ సిఎం కె.సి.ఆర్ గత ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోలో ‘కెజి టూ పిజి’ అందరికీ ఉచిత విద్య అందిస్తామని వాగ్దానం చేసిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది.

05/09/2017 - 08:59

మార్క్సిజానికి, అంబేద్కర్ ఆలోచనా ధోరణికి సామీప్యం వుందని ఇటీవల ఒక ప్రముఖ మాజీ ఐఎఎస్ అధికారి అన్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కావచ్చు. అలాగే- సాహిత్యానికి, మానవత్వానికి, మార్క్సిజానికి, రామాయణానికి, ఛాందసత్వానికి, కమ్యూనిజానికి, కర్మ సిద్ధాంతానికీ కూడా సామీప్యం వుందేమో అనిపిస్తుంటుంది. కార్ల్ మార్క్స్ కలలుగన్న సోషలిజం నిర్మాణం కోసం దశాబ్దాల క్రితం రష్యా ప్రయత్నించింది.

05/07/2017 - 08:40

కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిఐపిల కార్లపై బుగ్గలైట్లను తొలగించాలని ప్రధాని మోదీ ఆదేశించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తవౌతోంది. ‘బుగ్గలు’ తీసేయడమే కాదు, ఆ వాహనాల్లో ప్ర యాణించేవారెవరో అందరికీ తెలిసేలా ఉండాలన్న డిమాండ్ ఇపుడు వినిపిస్తోంది. రోడ్డు నిబంధనలు అందరికీ ఒకటే కదా అని అంటున్నారు. వాహనాల్లో ప్రయాణించేవారెవరో తెలిసేందుకు సిసి కెమెరాలు ఉండాలంటున్నారు.

05/07/2017 - 08:29

భారతీయులకు ఏకైక గుర్తింపు సాధనమైన ‘ఆధార్’ తమ ఆలోచన కాకపోవడంతో కేంద్రంలో ప్ర స్తుత పాలకులు- యుపిఎ హయాంలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తి భి న్నంగా మారింది. కాంగ్రెస్ వారు తమ ‘మానస పుత్రిక’ అయిన ‘ఆధార్’పై ఇపుడు నిరాధార ఫిర్యాదులు చేస్తూ నిరసన గళం విప్పడం విడ్డూరం.

05/06/2017 - 08:18

‘ఇస్లామిక్ రాజ్యం’గా ఏర్పడ్డ పాకిస్తాన్ అదే మతధర్మ సూత్రాలకు, మానవతా విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ప్రపంచానికే మాయనిమచ్చగా మిగిలిపోతోంది. ‘షరియా’ (ఇస్లామిక్ న్యాయ వ్యవస్థ) ఆధారంగా ఆ మత సంప్రదాయాలు, విధి విధానాలు జరుగుతాయి. ‘ఉలేమా’ (ఇస్లాం మత పెద్దలు) ప్రవచించిన ‘్ఫఖ్’ (ఇస్లామిక్ న్యాయ మీమాంస) ఆధారంగా షరియా కొనసాగుతున్నది.

05/05/2017 - 08:20

రోజురోజుకూ రంగులు మారుతున్న రాజకీయం- ఏదో ఒక దానిని ఊతంగా చేసుకొని ముందుకు సాగడమే పనిగా పెట్టుకొంది. కులం, ప్రాంతం, మతం, భాష.. ఇవన్నీ ఈ రోజు రాజకీయాలకు నిచ్చెనమెట్లు. ‘జనసేన’ అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ ఇటీవల ‘ఉత్తర-దక్షిణ భాగాలు’గా విభజించి దేశాన్ని అభివర్ణిస్తున్నారు. ‘ఉత్తరాది పెత్తనం’ అంటూ ఉరిమి చూస్తున్నారు. ఆయన ఓ సభలో మాట్లాడుతూ- ‘దక్షిణాది రాష్ట్రాలు బానిసలుగా ఉండాలి.

Pages