S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/05/2017 - 06:48

గాంధీజీని హత్య చేసేందుకు తనను ప్రేరేపించిన కారణాలను ప్రపంచానికి చెప్పలేదని నాథూరామ్ గాడ్సే అలనాడు మీడియాపై అసహనం చెందాడు. తాజాగా ‘శే్వత సౌధాధిపతి’ ట్రంపుసారుదీ అదే బాట.

02/04/2017 - 00:34

తొలిసారిగా ‘మట్టిలోని మాణిక్యాల’కు మన్నన లభించింది. త్యాగధనులు, తపోశీలురు, సమాజ శ్రేయస్సు కోసం కఠోర సాధనా మార్గానే్న జీవితంగా మలుచుకున్న పలువురికి ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ అవార్డులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేసింది. కీర్తి కాంక్షకు దూరంగా ‘మానవ సేవే మాధవసేవ’గా భావించి సమర్పణాభావంతో పనిచేస్తున్న వారి సేవల్ని గుర్తించి ఈ ఉన్నత పురస్కారాలను అందచేశారు.

02/03/2017 - 20:45

భారతీయ రైల్వే ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్ ఫారంలో స్ర్తిలు, పురుషులకు తోడుగా ‘మూడవ తరగతికి చెందినవారు’ (హిజ్రాలు) కూడా వారి వివరాలను నమోదు చేయాలన్నది ఆ నిర్ణయం. తమ లైంగిక వర్గానికి కూడా గుర్తింపు దక్కాలని ఎంతో కాలంగా పోరాడుతున్న ‘హిజ్రా’లకు ఇది ఆనందదాయకమైన విషయమే. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిజ్రాల సంఖ్య 4.5 లక్షలు.

02/02/2017 - 08:48

డొనాల్డ్ ట్రంప్ రెండు ‘బైబిల్’ గ్రంథ ప్రతులపై ఎడమచేయి పెట్టి, కుడి చేయి అభివాదముద్రతో పైకెత్తి అమెరికా అధ్యక్షుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేశాడు. ఒక బైబిల్ ప్రతి క్రీస్తుశకం 1860లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్రహాం లింకన్ మహాశయునిదట. రెండవది ట్రంప్‌కు ఆయన తల్లి ప్రదానం చేసింది! అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం 1789 మార్చి నాలుగవ తేదీన అమలులోకి వచ్చింది.

02/01/2017 - 00:30

కొన్ని అంశాలుంటాయి. వాటి గురించి అత్యధికుల మనసులలో భావాలు ఒక విధంగా ఉంటాయి. కొద్దిమంది ఆలోచనలు మరొక విధంగా ఉంటాయి. ఆ విషయమై ఆ కొద్దిమంది స్వేచ్ఛగా మాట్లాడుతుంటారు. అత్యధిక సంఖ్యలోగల వారు అలా మాట్లాడలేరు. అటువంటి వాటిలో ‘స్ర్తిల వస్తధ్రారణ’ అంశం ఒకటి. దీనిపై చర్చలు, వివాదాలు తరచూ జరగటం తెలిసిందే.

01/31/2017 - 01:16

భారతదేశంలో కులం ‘అప్రకటిత రాజ్యాంగం’ అన్నాడొక విశే్లషకుడు. అందుకే రాజ్యాంగం కన్నా మన దేశంలో కులమే సమాజాన్ని నియంత్రిస్తోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘కులాల కురుక్షేత్రం’ కనిపిస్తోంది. అత్యంత కీలకం కావడంతో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను ‘మినీ సార్వత్రికం’గా అభివర్ణిస్తున్నారు. ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి.

01/30/2017 - 01:02

అగ్ర దేశాలు, భారత్ లాంటి పెద్ద దేశాలు ముందుగా మాట్లాడేది ఉగ్రవాదం, తీవ్రవాదం గూర్చే! ఈ దేశాల నేతలందరు వేదికలకు అతీతంగా వీటిని పదే పదే ప్రస్తావిస్తూ ఆయా దేశాల ప్రజలకు ఆందోళనతోపాటు ఆవేశాన్ని కూడా కల్గిస్తారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య సంబంధ సమస్యలు ఆయా దేశాల నాయకులకు పట్టవు.

01/29/2017 - 02:32

‘తెలుగు కుంభకర్ణులు’ మళ్లీ నిద్రలేచారు. సుష్ఠుగా తిన్నది అరిగాక, మళ్లీ ఆకలితో రోడ్డెక్కారు. ఈ మ హానేతలను చూసి ఆ కుంభకర్ణుడు కూడా ఈర్ష్యపడతాడేమో! అలనాడు తెల్లదొరల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ విదేశీగడ్డ నుంచి బ్రిటీషర్లపై ‘ప్రవాస ఉద్యమం’ నడిపారు. అది దేశం కోసం కాబట్టి, నేతాజీకి ఎలాంటి స్వార్థం లేదు కాబట్టి, ఆయన ఉద్యమంలోని నిజాయితీని ఎవరూ తప్పుపట్టలేదు.

01/28/2017 - 03:43

‘‘సమాజంలో విభిన్నత్వం సహజం. ఎన్నో మతాలు కలిసి జీవిస్తూ వుంటాయి. దేని ప్రత్యేకత దానిది. మనం ఒక మతంలో పుట్టి దానిని అనుసరిస్తూ జీవిస్తాం. అలాగే ఇతరులు వారి మతాన్ని విశ్వసిస్తారు. విశ్వాసానికి తర్కాలు అక్కరలేదు. ఎవరి విశ్వాసం వారిది. మన ధర్మాన్ని మనం పాటిస్తూ, ఇతరుల్ని గౌరవించడం సంస్కారం. అంతేకానీ వారిని ఎత్తిపొడవడం, దోషాలను ఎంచి చూపడం, విమర్శించడం తగదు, ద్వేషం కూడదు.

01/27/2017 - 02:43

విద్యాబోధనలో విలువల గురించి ఆలోచించేటప్పుడు అమెరికా అధ్యక్షుడిగా, మానవతావాదిగా వినుతికెక్కిన అబ్రహాం లింకన్ తన కుమారుడిని బడిలో చేర్పించినపుడు హెడ్ మాస్టర్‌కు రాసిన లేఖ గుర్తుకొస్తుంది. ఆ లేఖలో లింకన్- ‘మనుషులందరూ మంచివారు కాకపోవచ్చును గాని, ప్రపంచంలో దుర్మార్గులున్నట్టే మంచివారు కూడా వుంటారు. పుస్తక పరిజ్ఞానంతో పెంపొందించుకున్న మేధస్సును ఎక్కువ ధరకు విక్రయించుకోవడంలో తప్పులేదు.

Pages