S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

05/20/2016 - 00:46

అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి హిమాలయ పాదసానువుల్లో ఉంటే, మరొకటి కన్యాకుమారి తీరంలో ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత వెలువడిన అతిపెద్ద ప్రజాభిప్రాయం (జనాదేశ్)ఇది. ఈ ఎన్నికలు మోదీ పాలనపై తీర్పు అంటూ ప్రతిపక్షాల వారు ఈ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు. నిజానికి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీల్లో భాజపాకు లోగడ అస్తిత్వం నామమాత్రమే.

05/19/2016 - 07:24

ఏది మితిమీరిన న్యాయ ప్రమే యం-జ్యూడిషియల్ ఓవర్ రీచ్-? ఏది న్యాయ క్రియాశీలత-జ్యుడిషియల్ యాక్టివిజమ్-? అన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వాల విధాన నిర్ణయాలలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని, అలా చేసుకొనడం మితిమీరిన న్యాయప్రమేయం అని ప్రధాన మంత్రులు వ్యాఖ్యానించడం చరిత్ర. కానీ ఈ విషయంలో కూడ రాజకీయవేత్తల మధ్య, రాజకీయ పేషీల మధ్య ఏకాభిప్రాయం లేదు.

05/17/2016 - 23:46

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయ వ్యవహారశైలి కారణంగా ఐదుకోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాడు ‘రెండు కళ్లు’, ‘సమన్యాయం’ అంటూ...23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుకుంటూ లేఖల మీద లేఖలు పంపారే కానీ, విభజన ముసాయిదా రూపకల్పనకోసం నాటి యుపీఏ సర్కారు నిర్వహించిన ఏ సమావేశంలోను ఆయన పాల్గొనలేదు.

05/17/2016 - 06:49

భారతీయులు స్ర్తిల పేర్లకు ముందు గౌరవసూచికంగా కుమారి-శ్రీమతి వంటి మాటలు వాడుతుంటారు. అలాగా ఇటాలియన్ భాషలో ‘‘మదామ్’’, ‘‘సింగ్నోరా’’ వంటి మాటలు ఉపయోగిస్తారు. సింగ్నోరా గాంధీ అంటే ‘శ్రీమతి గాంధీ’ అని అర్థం. ఈ పదాన్ని ఇటలీలోని మిలన్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ఉదహరించింది.

05/16/2016 - 06:28

తమ గత వైఫల్యాలు ఇప్పటికీ వెన్నాడుతూ ముందుకు పోలేకుండా కుంగదీస్తుంటే ఆ పరిస్థితిని ఇంగ్లీషులో ‘బ్యాగేజీ’ అంటారని మనకు తెలుసు. ఆ వైఫల్యాలు వర్తమానంలో గుదిబండలుగా మారటమన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రయత్నించినా ముందుకు వెళ్లలేకపోవటానికి గల పలు కారణాల్లో అటువంటి బ్యాగేజీ ఒకటి. మామూలుగానైతే ఈ మాట టిడిపికి కూడా వర్తించాలి.

05/14/2016 - 23:46

కల్తీసారా తాగి జనాలు చస్తున్నారని భావించిన ఎన్టీఆర్ గాంధీ జయంతినాడే సారాని నిషేధించాడు. దీనికి నాటి పీపుల్స్‌వార్ ఉద్యమం కారణం కాగా, దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేక నినాదం ఊతాన్నిచ్చింది.

05/14/2016 - 00:27

తమిళనాట చిదంబరం గొప్ప పుణ్యక్షేత్రం. భక్తనందనార్ ‘చిదంబరమే నా జీవితం గమ్యం, చిదంబరమే రమ్యం’ అని పరవశించిపోయేవాడు. అంతమంచి పేరు పెట్టుకొని ‘రహస్య’ అజెండా అమరలు చేసిన యుపిఎ ఏలికలో గృహమంత్రి చిదంబంరం గురించి ఎంత రాసినా తక్కువే. గుజరాత్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కరే తోయిబా తీవ్రవాది ఇషరత్ జహాన్ విషయంలో ఈయన వేసినవన్నీ పిల్లిమొగ్గలే, కుప్పిగంతులే.

05/12/2016 - 23:36

స్వతంత్ర భారతదేశంలో విలక్షణమైన రాజకీయ, ఆర్థిక సైద్ధాంతిక భూమిక ఏర్పడటం కోసం విశేషంగా పోరాడిన, కోట్లాది మంది యువతను దేశభక్తి భావనతో ఉర్రూతలూగించిన, నేడు ఢిల్లీలో అధికారంలో ఉండిన భారతీయ జనతాపార్టీకి సైద్ధాంతిక పునాది ఏర్పరచిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు ఆచార్య బలరాజ్ మధోక్ మే 2న ఢిల్లీలో మృతి చెందారు.

05/12/2016 - 08:17

అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థవారి గగనశకటాల-హెలికాప్టర్స్-కొనుకోళ్ల అవినీతిని గురించి సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నది కాంగ్రెస్ పార్టీవారి కోరిక. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే వెలిబుచ్చిన ఈ మహదాకాంక్ష దృశ్యమాధ్యమాలలో ప్రముఖంగా ఆవిష్కృతమైంది.

05/11/2016 - 02:43

అపర మేధావిగా, సంస్కర్తగా, హైదరాబాద్ రాజ్యాన్ని సుస్థిర పరచిన వాడిగా, చరిత్రపుటల్లోకి ఎక్కిన సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో, 1865లో ‘‘జిల్లా బందీ’’ విధానా న్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి హైదరాబా ద్ రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల వ్యవస్థ, రెవెన్యూ పాలనా వ్యవస్థకు సాలార్జంగ్ అలా పునాదులు వేసి, ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చి శాశ్వతంగా వుండిపోయేలా చేశాడు.

Pages