S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

11/26/2015 - 04:51

అత్యధిక రాజకీయ పక్షాలవారు ఆ సంస్థవద్ద ‘అంతో ఇంతో’ పుచ్చుకొని ఉన్నారన్న సందేహం అతార్కికం కాదు..... బహుళ జాతీయ వాణిజ్య సంస్థల యాజమాన్యాలు ‘ఇచ్చుకొనడం’ రాజకీయవేత్తలు ‘పుచ్చుకొనడం’ ప్రపంచీకరణ వ్యవస్థీకరించిన ‘దోపిడీ’ స్వభావంలో భాగం. ‘సందేహాని’కి ఇది సాధారణ ప్రాతిపదిక! స్విట్జర్లాండ్ వారి నెజల్- నెస్లే- సంస్థవారి ‘మ్యాగీ’ సేమ్యాలు మళ్లీ మన దుకాణాలలో ప్రత్యక్షమయ్యాయి.

11/25/2015 - 04:56

ప్రజలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తమ అభిప్రాయాలు వెల్లడించరు. టీవి చర్చల్లో గట్టిగట్టిగా అరవరు. మేధావుల చర్చల్లోనూ కనిపించరు. కానీ సమ యం వచ్చినప్పుడు దిమ్మతిరిగిపోయేలా తీర్పు చెబుతారు. ఇప్పుడు వరంగల్‌లో ప్రజలు చేసింది అదే. వాళ్ల అంతరంగం మేధావులకు అర్ధం కాదు. కానీ ఈ సామాన్యులను నమ్ముకొని రాజకీయం చేసే వారికి బాగా అర్ధమవుతుంది.

11/24/2015 - 05:37

సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధంనాటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. పెరల్ హార్బర్ మీద జపాను విమానాలు దాడి చేయటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయింది. ఆనాటి యుద్ధం ప్రధానంగా నాజీ సైన్యాల మీద జరిగింది. అంటే హిట్లర్ ముస్సోలినీలకు వ్యతిరేకంగా బ్రిటన్ అమెరికా రష్యా వంటి దేశాలు యుద్ధంలో పా ల్గొన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓటమి తర్వాత ప్రపంచంలో అమెరికా-రష్యా రెండే అగ్ర రాజ్యాలుగా మిగియాయి.

11/23/2015 - 05:02

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆర్యసమాజ్ పరోపకారిణి సభ వార్షిక ఋషి మేళాలో చేసిన ప్రసంగం మలిభాగం
=============

11/23/2015 - 04:59

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆర్యసమాజ్ పరోపకారిణి సభ వార్షిక ఋషి మేళాలో శనివారం (21 నవంబర్, 2015న) చేసిన ప్రసంగం
====================

11/20/2015 - 23:21

ప్రపంచంలో కొన్ని దేశాలకు ‘విశ్వం వొక విపణి, జీవితం వొక వ్యాపారం’. మరికొన్ని దేశాలకు విశ్వం వొక యుద్ధ్భూమి, జీవితం వొక పోరాటం. కాని భారత్‌కు మాత్రం ‘విశ్వం వొక కుటుంబం, జీవితం అనుబంధాలతో ఆత్మను ఆవిష్కరించుకునే పవిత్ర ప్రయత్నం’. ఇంతటి ఉదాత్తమైన సిద్ధాంతం ఆచరణ సాధ్యమై, పోరు, పొక్కులేని జీవనం సాగిస్తున్న మన దేశానికి దశాబ్దాలు గడిచినా ఐరాసలో శాశ్వత సభ్యత్వం లభించలేదు.

06/24/2015 - 11:47

ఇద్దరు ప్రేమికుల మధ్య విషాందాంత ప్రేమ కథ మాదిరిగా రష్యా-పశ్చిమదేశాల వ్యవహారశైలి కొనసాగుతోం ది. వీరికి పరస్పర సంబంధాలు కొనసాగించాలనే ఉంది కానీ ఎక్కడినుంచి, ఏవిధంగా మొదలుపెట్టాలో తెలియకపోవడమే విషాదం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మన్ ఛాన్సలర్ ఆంజెల్లా మార్కెల్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ సరిహద్దు నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు.

06/24/2015 - 11:49

అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ఒక బృందంగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 70 సీట్లలో 67 సీట్లు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పరచినప్పుడు మొత్తం దేశ ప్రజలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుండి ఎన్నో ఆశించారు. ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించగలరని ఎదురుచూశారు.

06/24/2015 - 11:50

‘అబ్బా! ఆ ఏనుగును కొనుక్కుందాం...! 50 శాతం డిస్కౌం ట్ మళ్ళీరాదు...’, ‘నీకెమన్నా పిచ్చా...? మనకెందుకు ఏనుగు...?’ అనే ఈ కార్టూను డైలాగును చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటూ వుంటాం! అయినా మన ఆలోచనల్లో ఏమైనా మార్పువచ్చిందా.... వస్తుందా...? అనేది తేలని ప్రశ్ననే!

06/19/2015 - 11:01

ఆరు వేల పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన యోగకు నేడు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జూన్ 21 అంతర్జాతీయ యోగ దినంగా ఐరాస ప్రకటించింది. ‘యోగఃకర్మశుకౌశలం’ అన్నారు. చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగం. మనిషి నిముషానికి నాల్గు ఆలోచనలు చేస్తాడని మనస్తత్వ శాస్తవ్రేత్తలంటారు. 12 గంటల జాగృతావస్థలో మనిషి రోజూ వందల ఆలోచనలు, ఏడాదిలో ఎన్నో వేల ఆలోచనలు చేస్తాడు.

Pages