S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/16/2016 - 07:44

తమపై చిన్న నింద వినిపించినా, అది పత్రికల్లో కనిపించినా ఆ రోజంతా బయటకొచ్చేవారు కాదు.. జనం తమ గురించి చెడుగా అనుకుంటారేమోనని బాధపడేవారు.. సున్నిత మనస్కులయితే పదవులకు రాజీనామా చేసేవారు.. ఎలాంటి ఆవేశపూరిత సందర్భంలోనైనా ప్రత్యర్థులపై మాట తూలేవారు కాదు.. సభ్యత, సంస్కారం విస్మరించేవారు కాదు.. ఇది ఒకప్పటి రాజకీయ నేతల సంగతి. విలువలు లుప్తమైన నేటి రోజుల్లో అసెంబ్లీలోనే బూతులు తిట్టుకుంటున్నారు.

10/15/2016 - 03:17

క్యాన్సర్, కమ్యూనిస్టులకు సమాన లక్షణాలు ఉంటాయని కొందరంటారు. ఆ వ్యాధి నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అన్ని మూలాలకు వ్యాప్తిచెందుతూ అక్కడున్న జీవకణాలను నాశనం చేస్తూ ఆ దేహాన్ని ప్రాణాంతక దిశగా తీసుకువెడుతుంది. భారతీయ కమ్యూనిస్టులు కూడా అంతేనట!

10/14/2016 - 00:19

ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి వర్జీనియా వుల్ఫ్ తాను రచించిన ఒక సుదీర్ఘ వ్యాసంలో ఇలా అంటుంది...
‘‘్భవనా ప్రపంచంలో స్ర్తి అత్యంత ఉన్నతురాలు. కవిత్వం విషయంలో తొలినుంచి తుది వరకూ ఆమె కనబడుతుంది. కానీ, వాస్తవానికి వచ్చేసరికి మాత్రం తాను పెళ్లాడిన ఏ సామాన్య మగాడికైనా ఆమె బానిస. అతని ఆస్తిలో ఆమె ఒక భాగం-’’

10/13/2016 - 04:48

దీపం పెట్టిన తరువాత దిగనేయడమన్నది ప్రగతి జరిగిన తరువాత సంభవించే వికృతికి చిహ్నం! ఒకదాని తరువాత మరొకటి..! ఇప్పుడు మన దేశంలో ఈ ‘ప్రగతి’ ఈ ‘వికృతి’ సమాంతరంగా ఒకేసారి జరిగిపోతున్నాయి. ఒకదానితో మరొకటి పొసగని వైరుధ్యాలు ఒకేకాలంలో నడిచిపోతుండడం వినూతన విచిత్ర ఆవిష్కృతి.. జాతీయతా భావ రూపాలయిన సైనిక దళాలు ప్రాణాలనొడ్డి మాతృభూమి సరిహద్దులను సంరక్షిస్తున్నారు, పటిష్టం చేస్తున్నారు.

10/11/2016 - 06:36

రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణకు అంతటి ప్రాధాన్యతను తెచ్చిపెట్టిన రోజు ఇది. పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాల నవ తెలంగాణగా ఆవిర్భవిస్తున్న రోజు. నవ శకానికి నాంది పలుకుతున్న రోజు. జిల్లా కేంద్రం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండేదని అని మాత్రమే కాదు. అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది.

10/10/2016 - 00:15

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వెలగపూడి వద్ద ఆ రంభం కావటం అందరికీ కొత్త సంకల్పాలు కలగటానికి దారులు వేస్తున్నట్లు కన్పిస్తున్నది. సచివాలయంలో ఉద్యోగులు పనిచేయటం ఈనెల 3న మొదలుకాగా, అంతకు ఒక రోజు ముందు 2వ తేదీన ఆ ప్రదేశాన్ని చూసి, తర్వాత విజయవాడలో కొందరితో మాట్లాడి, సచివాలయం తెరుచుకున్న మరునాడు మాధ్యమాల్లో వినిపించిన మాటలను బట్టి ఈ రచయితకు కలిగిన అభిప్రాయమిది.

10/09/2016 - 00:52

మనవాళ్లుఠ్ఠి వెధవాయిలోయ్’ అని ‘కన్యాశుల్కం’ లో గిరీశం కామెంట్ చేస్తే- ఏమిటో అనుకున్నాం గానీ, ఇప్పుడు గిరీశం ఉంటే అంతకుమించిన పదప్రయోగమే చేసేవాడేమో? అవును మరి.. ‘మొగుడు ఏదో అంటే ముష్టికి వచ్చిన వాడు అదే అన్నట్లు’ మన నేతాశ్రీల నోటి నుంచి అలాంటి మాటలు వస్తుంటే గిరీశం గుర్తుకురావడం తప్పడం లేదు మరి.

10/08/2016 - 03:12

ప్రపంచ శాంతికి అత్యంత ప్రమాదకరంగా మారిన పాకిస్తాన్ ప్రేరిత జీహాదీ తీవ్రవాదులను నిరోధించడం, హతమార్చడంలో భా రత సైన్యం చూపిన అసామాన్య ధైర్యసాహసాలను కించపరిచే విధంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రవర్తించడం అత్యంత దు రదృష్టకరం. కాశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ ప్రాయోజిత జీహాదీ తీవ్రవాదులు దొంగదాడి జరిపి 19 మంది జవాన్లను హతమార్చిన ఘటనను యావత్తు ప్రపంచం నిర్ద్వంద్వంగా ఖండించింది.

10/07/2016 - 01:09

‘సర్జికల్ దాడి’... ఇపుడు ఏ నోట విన్నా ఇదే మాట. నేడు దేశంలో దీనర్థం అందరికీ తెలిసిపోయింది. చాలామందికి తెలియందల్లా ఏమంటే- అలనాడు వాల్మీకి మహర్షి తన రచనా చాతుర్యంతో ఈ దాడి మూలాలను ‘సుందరకాండ’లో వర్ణించిన వైనం. రామాయణ కాలం నాటి ఆ ‘సర్జికల్ దాడి’లో ఆర్మీ జనరల్, సైనికుడు, వ్యూహకర్త అంతా.. ఒకే ఒక్కడు. రావణ శత్రుసైన్యంలో మూడొంతుల మందిని ఆ ఒక్కడే తుదముట్టించాడు.

10/06/2016 - 02:49

మహిళలు మద్యపానం చేయడం నేరమా? అని గట్టిగా గద్దించి, గర్జించి, గాండ్రించి ప్రశ్నించాడు ‘దృశ్య మాధ్యమ’ తరంగిణీ- టెలివిజన్ చానల్ నిర్వాహకుడు! ఆవైపు నుంచి సమాధానం చెప్పవలసిన పోలీస్ ఉన్నతాధికారి కొన్నిక్షణాలు వౌనం వహించడంతో ‘ప్రసార మాధ్యముడు’ రెట్టించిన తీవ్ర స్వరంతో మళ్లీ అదే ప్రశ్నను సంధించాడు. పోలీస్ ఉన్నతాధికారి సమాధానం చెప్పలేదు!

Pages