S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/25/2016 - 01:01

మాట్లాడుకుంటే దూరం తగ్గుతుంది. ఇది ఆ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటన. నిజజీవితంలోనూ ఇది వర్తిస్తుంది. ఆరు దశాబ్దాలు కలసి మెలసి ఉన్న తెలుగువాళ్లు ప్రాంతాలుగా విడిపోయి, మనుషులుగా కొనసాగుతూ రెండున్నరేళ్లయినా, పాలకుల మధ్య సఖ్యత ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కొన్ని అంశాల్లో తప్ప మిగిలిన అనేక వ్యవహారాల్లో ఆంధ్ర-తెలంగాణ ప్రభువుల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది.

09/24/2016 - 00:40

‘‘అన్ని ప్రత్యామ్నాయాల తర్వాత ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ దుర్మార్గమైన పరిపాలనే అందిస్తుంది కానీ ప్రజా సమస్యలన్నిటికీ సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపదు...’’ అన్న విన్సిటన్ చర్చిల్ మాటలతో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ, ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాల్ని విశే్లషిస్తే ఈ మాటల్లో నగ్న సత్యం కనపడుతుంది.

09/22/2016 - 22:39

జమ్మూకశ్మీర్‌లోని యూరీ ప్రాంతంలోని భారత సైనిక స్థావరాలపై జేష మహమ్మద్ ఉగ్రవాదులు దాడిచేసి 18 మంది భారత సైనికులను చంపేయడమే కాకుండా మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. పఠాన్‌కోటపై దాడి జరిగినప్పుడే ఇండియా కఠినంగా వ్యవహరించని ఫలితమే యూరీ స్థావరంపై దాడి అని చెప్పాలి. ఒక్క సిపిఎం తప్ప తక్కిన ప్రతిపక్షాలన్నీ నరేంద్రమోదీ ఏ చర్య తీసుకున్నా తాము బలపరుస్తామని ప్రకటించాయి.

09/22/2016 - 06:49

ఒకడు నిశాతటిని చీల్చి
దిశ చూపిన దినకరుడు
ఒకడు, దురాక్రమణ మతిని
మసి చేసిన నిటలాక్షుడు
ఒకడు, దనుజరీతి కూల్చి
ధర్మం నిలిపిన రాముడు,
ఒక్కొక్కడు సరిహద్దుకు
ప్రాణం పోసిన అమరుడు

09/20/2016 - 22:16

కశ్మీర్ లోయలో రెండు నెలలకు పైగా జరుగుతున్న అల్లర్లలో 75 మందికి పైగా మృతిచెందారు. ప్రశాంతత నెలకొల్పడంకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తు న్న ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వడంలేదు. తాజాగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నాయకత్వంలో అఖిలపక్ష ప్రతినిధిబృందం రెండు రోజులపాటు కశ్మీర్‌లో పర్యటించి వచ్చినా చెప్పుకోదగిన మార్పు తీసుకురాలేకపోయారు.

09/20/2016 - 08:06

‘సీజరు భార్య తప్పు చేయదు’ ఈ ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది. భారతదేశం లో కొందరు తప్పు చేయరు అని అంతా విశ్వసించారు. అలాంటివారిలో ఆంటోనీ ఒకరు. షేక్స్‌పియర్ నాటకం ఆంటోనీ క్లియోపాత్రకు ఈ ఆంటోనీకి ఎట్టి సంబంధం లేదు. చరిత్రలో ఆంటోనీ రాజు. విలాసపురుషుడు. కాని భారత మాజీ రక్షణమంత్రి ఎకె ఆంటోనీ మాత్రం సెయింట్ ఆంటోనీ లాంటివాడే.

09/19/2016 - 04:28

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు ప్రత్యేకహో దా పేరిట చేస్తున్నది రాజకీయమే తప్ప వారికి కావలసింది అభివృద్ధి కాదని ఇప్పుడు స్పష్టంగా చెప్పవచ్చు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ ఈనెల ఏడవ తేదీని ప్యాకేజీ ప్రకటించడానికి ముందటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అంతకుముందు ఒక దశ రాజకీయం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించడం వరకు జరిగింది.

09/18/2016 - 03:00

రెండున్నరేళ్లు తెలుగు టివి సీరియల్ జీడిపాకంలా సాగదీసి ఎట్టకేలకు హోదాను హుళక్కి చేసి, ప్యాకేజీకి తెరలేపిన కేంద్ర నిర్ణయంపై జనం ఏమి చేయాలి? ఇచ్చిన ప్యాకేజీని ఆహ్వానించాలా? లేక అసలు అవకాశమే లేని హోదా కావాలని చచ్చు పుచ్చు వాదాలు చేసి ఉద్యమించాలా? అన్నది నవ్యాంధ్ర ప్రజలముందున్న ప్రశ్న.

09/17/2016 - 02:11

తాము అధికారంలో లేనప్పుడు 17 సెప్టెంబర్ విమోచన ఉత్సవాలను ఎందుకు నిర్వహించలేదని కొండెక్కి జబ్బలు చరిచి బొబ్బలు పెట్టి ఆనాటి ప్రభుత్వాన్ని తిట్టిపోసిన కెసిఆర్ బృందం ఇప్పుడు అధికారంలో వుండి కూడా నిర్వహించకపోవడం క్షమించరాని పాపం.

09/16/2016 - 05:52

సిరియాలో వారం పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా- రష్యా లు ఒక అంగీకారానికి రావడం ఇప్ప టి వరకు సిరియాలో కొనసాగుతున్న రక్తచరిత్రకు తాత్కాలిక విరామం. అంతులేని రీతిలో కొనసాగుతున్న పోరాటం తీరును పరిశీలించేవారెవరైనా ఈమాత్రం ఒప్పందమైనా కుదురుతుందని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. అందువల్లనే ఈ ఒప్పందం వర్తమాన సిరియా చీకటి అధ్యాయంలో ఒక కాంతిరేఖ వంటిదని చెప్పవచ్చు.

Pages