S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/04/2016 - 00:18

అన్ని వ్యవస్థలు భ్రష్ఠుపట్టిన నేపథ్యంలో మిగిలిన న్యాయవ్యవస్థకూ మకిలి అంటిం చే ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కేసులో ఒక న్యాయమూర్తి ప్రలోభానికి గురయి జైలుపాలయ్యారు. అలాగని మొత్తం న్యాయవ్యవస్థను కించపరచలేం. ఎక్కడి లోపాలు అక్కడ ఉన్నాయి. కాకపోతే న్యా య వ్యవస్థ కదా? లోతుల గురించి మాట్లాడటం ఆరోగ్యానికి అంత మంచిదికాదు!

09/03/2016 - 07:13

ఇతర దేశాలతో మొండివైఖరితో వ్యవహరిస్తున్న దుందుడుకు చైనాను నియంత్రించడానికి భారత్‌ను సాధనంగా అమెరికా గుర్తించింది. దాదాపు దశాబ్దకాలంగా కొనసాగిన చర్చోపచర్చల అనంతంరం ఎట్టకేలకు ఇటీవల లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (లెమోవా)పై వాషింగ్టన్ డిసిలో ఇరుదేశాలు సంతకాలు చేశాయి. రెండు దేశాలు పరస్పరం తమ సైనిక, వైమానిక, నౌకా స్థావరాలను వినియోగించుకోవడాని ఈ ఒప్పం దం వీలు కల్పిస్తున్నది.

09/01/2016 - 23:38

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మూడు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలపై 2016 ఆగస్టు 23న సంతకాలు చేయడంతో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది. పెన్‌గంగా, ప్రాణహిత, గోదావరి నదులపై, చనాఖా కోరటా, తుమ్మిడి హట్టి, మేడిగడ్డ ప్రాజెక్టుల వద్ద బ్యారేజీల ని ర్మాణానికి మార్గం సుగమమైంది.

09/01/2016 - 00:20

కరం కరం కలసి
కాంతి వలయవౌతున్నది
కణం కణం కలసి విశ్వ
గణం విస్తరిస్తున్నది..
చినుకుచినుకు చేరిచేరి
సరిత పరుగు తీస్తున్నది,
చేయిచేయి చెలిమి చేసి
శక్తి అవతరిస్తున్నది..

08/31/2016 - 00:13

అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ న్యూఢిల్లీకి వచ్చి, మంగళవారం భారత రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో చర్చలు జరిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ధూర్తదేశంగా ఇరువురూ గుర్తించారు. అఫ్గానిస్థాన్, బలూచిస్తాన్, గిల్గిట్, ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను వారు తీవ్రంగా పరిగణించారు.

08/30/2016 - 00:01

తన ప్రభుత్వ పనితీరు, సాధించిన విజయాలు, ముందున్న లక్ష్యాల గురించి ప్రజలకు ‘ప్రగతి నివేదిక’ అందజేసే అవకాశాన్ని ప్రతి ప్రధానమంత్రికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటనుండి చేసే ప్రసంగం అవకాశం ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడవసారి ఆవిధం గా ప్రసంగించారు. ఈ సందర్భంగా 90 నిముషాలకు పైగా ప్రసంగించి గత సంవత్సరం తాను సృష్టించిన రికార్డును అధిగమించారు.

08/29/2016 - 00:41

మహారాష్టత్రో ఒప్పందాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 24న బేగంపేట విమానాశ్రయం వద్ద చేసిన సవాలు, అందుకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అదేరోజు మీడియా సమావేశంలో చెప్పిన మాటలు, మరునాటి ఉదయం టివి చానళ్లలో జరిగిన చర్చల తర్వాత ఒక విషయం సందేహాలకు అతీతంగా స్పష్టమైంది.

08/28/2016 - 01:15

కృష్ణా పుష్కరాల ముగింపు, సింధు సాధించిన విజయాల ప్రచారహోరు ముగిసింది. 12 రోజుల పాటు పుష్కరుడిని స్వయం గా తీసుకువచ్చిన తెలుగు ప్రభుత్వాలు, దగ్గరుండి మరీ సాగనంపాయి. ఈ విషయంలో ఏపి సర్కారు చేసిన ప్రచారంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రచారం తక్కువే. పుష్కరుడిని బెజవాడకు తీసుకువచ్చిన బాబు రోజూ హారతికి హాజరయి, పంపేంతవరకూ అంతా తానుగా వ్యవహరించారు.

08/27/2016 - 07:26

పండ్లు తినాలన్నప్పుడే చెట్లు పెట్టం. భవిష్యత్ అవసరాలకై చెట్లు నాట డం ప్రకృతి రీతి. తలెత్తుకోవడం తెలిస్తేనే తలదించుకోవడం అబ్బుతుంది. జ్ఞాన దంతాల్నే తెలివితేటలకు చిహ్నంగా భా వించే రాజకీయాలు అన్ని రంగాలతోపాటు క్రీడరంగాన్ని భ్రష్టు పట్టిస్తూనే ఉన్నాయి.

08/25/2016 - 23:54

కళాకారులను క్రీడాకారులను గౌరవించుకోవడం సంస్కారవంతమైన జాతి లక్షణం. అవకాశం ఇస్తే ఆకాశం ఎత్తు ఎదిగే ధనుర్విద్యాపారంగతులు నేటికీ అడవుల్లో ఎందరో ఉన్నారు. గురువులకు ద్రోణాచార్య సత్కారాలు, క్రీడాయోధులకు అర్జున, ఖేల్ రత్న వంటి బిరుదులు ప్రసాదించడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే. భారత్ పేరు చెప్పగానే హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చం ద్ జ్ఞాపకానికి వస్తాడు.

Pages