S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

01/14/2020 - 04:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ పౌర రిజిష్ట్రేషన్ (ఎన్.ఆర్.సి)ని అన్ని ప్రతిపక్షాలతోపాటు ముస్లిం మైనారిటీ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్.ఆర్.సి తమ ప్రయోజనాలు దెబ్బ తీస్తుందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి. అయితే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు తమ పౌరుల వివరాలు రిజిష్టరు చేసి గుర్తింపు కార్డులు ఇస్తుంటే భారతీయ పౌరులకు ఎందుకు ఇవ్వకూడదన్నది ప్రశ్న.

01/08/2020 - 02:46

భారతదేశ లౌకిక తత్వం, రాజ్యాంగ విలువల పరి రక్షణకు ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) వద్దంటూ ప్రారంభమైన ఉద్య మం ఇప్పుడు ఇస్లాం మత ప్రయోజనాల పరిరక్షణ ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్యమం ‘ముస్లింల గుర్తింపుపరిరక్షణ’కు అన్నట్టుగా మారిపోయింది.

12/31/2019 - 00:14

2019సంవత్సరంలో ప్రాంతీయ ప్రార్టీలు అందలం ఎక్కితే జాతీయ పార్టీలు గడ్డుపరిస్థితుల్లో పడిపోయాయి. బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు గత సంవత్సరం తమ, తమ లక్ష్యాలను సాధించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. కేంద్రంలో గత ఆరు సంవత్సరాల నుండి అధికారంలో ఉండటంతోపాటు దేశం దశ, దిశను మార్చివేసే కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న బి.జె.పి. ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది.

12/24/2019 - 02:53

‘ భారత దేశం’ బతికి బట్టకట్టాలంటే పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరసత్వ రిజిష్టరు (ఎన్.ఆర్.సి) ఎంతో అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించటం వెనక పదవీ రాజకీయంతోపాటు మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం కొనసాగుతోంది. అందుకే ముస్లిం మైనారిటీలను రెచ్చగొట్టటం ద్వారా తమ పబ్బం గడుపుకునేందుకు పలు రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి.

12/17/2019 - 02:00

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి దురదృష్టంగా మారారు. ఇవి నేను చెబుతున్న మాటలు కాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్న మాటలు. రాహుల్ గాంధీ చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి తప్ప లాభం కలిగించటం లేదు, రాజకీయంగా మేలు చేయటం లేదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

12/10/2019 - 23:51

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు పౌరసత్వం కల్పంచడం భారత ప్రభుత్వం బాధ్యత. ఈ మూడు దేశాల్లో ముస్లిమేతరులు దశాబ్దాల తరబడి హింస, మతమార్పిడులు, అత్యాచారాలతో అష్టకష్టాల పాలవుతున్నారు. వీరిని అక్కున చేర్చుకోవలసిన బాధ్యత భారత దేశంపైనే ఉంది.

11/26/2019 - 23:34

‘తాడిని తనే్నవాడికి తలదనే్నవాడు’ ఎదురైనప్పుడే రాజకీయం రంజుగా ఉంటుంది. మహారాష్టలో అధికారం కోసం కొనసాగుతున్న రాజకీయ చదరంగంలో ఒకరినొకరు ఓడించుకునేందుకు భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ నేతలు నైతిక విలువలను గాలికొదిలేశారు. పదవులే పరమావధిగా జరుగుతున్న మహారాష్ట్ర పరిణామాలు రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి.

11/19/2019 - 00:37

మహారాష్టలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శివసేన, ఎన్.సి.పి. కాంగ్రెస్ పార్టీలు తమ సిద్ధాంతాలు, విలువలను తుంగలో తొక్కటం సిగ్గుచేటు. లౌకికవాదం తమ నరనరాల్లో జీర్ణించుకుపోయిందని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ పార్టీ హిందు తీవ్రవాద పార్టీ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం చూస్తుంటే అధికారం కోసం ఏ మేరకు దిగజారిపోతారనేది తెలుస్తోంది.

11/12/2019 - 00:03

దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి దేశాన్ని పట్టిపీడిస్తున్న బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదాన్ని ఎట్టకేలకు సుప్రీం కోర్టు అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించడం ముదావహం. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు లౌకికవాదులకు, తీవ్రవాద ముస్లిం నేతలు, సంస్థలకు నచ్చకపోవచ్చు. రాచపుండుగా మారిన సమస్యను సుప్రీం తీర్పు పరిష్కరించిదన్న విషయాన్ని ఎవరూ మరిచిపోరాదు.

11/05/2019 - 03:16

ముఖ్యమంత్రి పీఠం కోసం శివసేన పార్టీ మహారాష్టన్రు రాజకీయ సంక్షోభంలో పడవేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మహారాష్ట్ర శాసనసభ పదవీ కాలం ఈనెల 8వ తేదీతో ముగుస్తుంది. నవంబర్ ఏడో తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్టప్రతి పాలన విధించవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతూ సంకీర్ణ ధర్మాన్ని శివసేన తుంగలో తొక్కుతోంది.

Pages