S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

07/18/2017 - 00:02

దేశ సార్వభౌమాధికార పరిరక్షణలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించిన ప్రతిపక్షం దేశాభివృద్ధి విషయంలో కూడా కలసి రావాలి తప్ప- అడుగడుగునా అడ్డుపడటం మంచి విధానం కాదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏడాదికి మూడు సార్లు జరిగే పార్లమెంటు సమావేశాల్లో రెండో విడత జరిగేవి వర్షాకాల సమావేశాలు. బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఇవి కేవలం నెల రోజుల పాటే జరిగినా వీటికి ప్రాధాన్యత ఉంటుంది.

07/11/2017 - 00:06

అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అక్రమాలకు భరతవాక్యం పలికితే తప్ప దేశంలో విలయ తాం డవం చేస్తున్న అవినీతిని అదుపు చేయటం సాధ్యం కాదు. రాజకీయ నాయకులకు అధికారులు తోడు కావటంతో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. నేటి పాలనావ్యవస్థలో ‘కంచే చేను మేస్తున్న దృశ్యాలు’ అడుగడుగునా కనిపిస్తున్నాయి.

07/04/2017 - 01:06

కమ్యూనిస్టు చైనా సామ్రాజ్యవాదం పొరుగు దేశాలకు ముఖ్యంగా భారత దేశానికి తలనొప్పిగా తయారైంది. 1962 యుద్ధంలో నేర్పిన గుణ పాఠాన్ని ఎలా మరిచిపోతారంటూ దాదాగిరి చేస్తోంది. అవసరమైతే మరోసారి బుద్ది చెబుతామంటూ దౌర్యన్యానికి దిగుతోంది. మితిమీరిన ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తున్న చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.

06/27/2017 - 00:14

బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా తప్పు చేశారని అనలేము కానీ అద్వానీ లాంటి సీనియర్ నాయకుడి గురించి ఆలోచించకుండా తప్పు చేశారని చెప్పకతప్పదు. భాజపా కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం విజతతో కూడిన నిర్ణయం అయ్యేది.

06/20/2017 - 01:02

దేశంలో ప్రజాస్వామ్యం స్థిరంగా ఉండాలంటే జా తీయ, రాష్ట్రాల స్థాయిలో అధికార పక్షానికి దీటైన ప్ర తిపక్షం ఉండటం ఎంతో అవసరం. బలమైన విపక్షం లేకపోతే అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలు, సిద్ధాంతాలను కాలరాస్తుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను కట్టడి చేసేందుకు అవసరమైన ప్రతిపక్షం క్రమంగా కనుమరుగైపోతోంది.

06/13/2017 - 00:42

నూతన రాష్టప్రతి ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య సమరానికి దారి తీయడం మంచిది కాదు. దేశ ప్రథమ పౌరుడిని నిర్ణయించడంలో అధికార, విపక్ష పార్టీలు పరస్పర సహకారంతో పని చేస్తే బాగుండేది. కానీ ఇపుడు అలా జరగటం లేదు. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24వ తేదీతో ముగుస్తుంది. జూలై 20న కొత్త రాష్టప్రతి ఎవరనేది తేలిపోతుంది.

06/06/2017 - 00:14

ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మోదీ ప్ర భుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? పాకిస్తాన్‌తోపాటు మరికొన్ని దేశాలు అవలంబిస్తున్న మతపరమైన రాజకీయాలతో కాశ్మీర్ సమస్య అంత్యంత జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో దీన్ని పరిష్కరించటం అనుకున్నంత సులభం కాదు.

05/30/2017 - 04:22

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పరితపించే వాడే నిజమైన నాయకుడు. ప్రధాన మం త్రి నరేంద్ర మోదీ ఈ తరహాలో పనిచేస్తూ విజయపథంలో దూసుకుపోతున్నారు. భారత దేశానికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ దానికి కార్యరూపం ఇచ్చేందుకు మోదీ దీక్ష వహించడం హర్షణీయం.

05/23/2017 - 08:29

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యా దవ్, కాంగ్రెస్ నాయకుడు కార్తి చిదంబరం నివాసాలపై ఇటీవల సిబిఐ జరిపిన దాడులు మరోసారి రాజకీయ నాయకుల అవినీతిపై చర్చకు తెరలేపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకోసమే తమపై దాడులు చేయిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, లాలూ ప్రసాద్ ఆరోపించి అందరినీ విస్మయపరిచారు.

05/16/2017 - 00:54

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఇవిఎం)ను అనుమానిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యం పరువుప్రతిష్టలను మంటగలిపాయి. ఎన్నికల్లో తాము గెలిచినపుడు ఇవిఎంలు ఎంతో మంచివనడం, ఓటమి చెందితే వాటిని ‘టాంపరింగ్’ చేశారని ఆరోపించడంతో ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి.

Pages