S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

09/18/2017 - 23:56

వారసత్వ,కుటుంబ,వ్యక్తి ఆధారిత రాజకీయాలకు చరమగీతం పాడనంత వరకు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లలేదు. ఇప్పుడు దేశంలో వారసత్వ రాజకీయం ప్రజాస్వామ్యానికి సమాంతర వ్యవస్థగా తయారయ్యింది. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాస్వామ్యానికి సమాంతర వ్యవస్థగా మారి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోంది.

09/11/2017 - 23:43

చైనా వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. సిక్కిం సెక్టార్‌లో 72 రోజుల పాటు కొనసాగిన డోక్లామ్ ఉద్రిక్తతతకు యుద్ధ ప్రాతిపదికపై తెర దించటంతోపాటు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషె మహమ్మద్, లష్కరే తయ్యబాలను బ్రిక్స్ తీర్మానంలో ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.

09/04/2017 - 23:31

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా కేంద్ర మంత్రిమండలి విస్తరణ ద్వారా కొం డను తవ్వి ఎలుకను పట్టినట్టు వ్యవహరించారు. మంత్రివర్గాన్ని విస్తృత స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలనుకున్న మోదీ చివరకు విస్తరణతో సరిపెట్టుకున్నారు. ఈ విస్తరణ ద్వారా ఆయన ఏం సాధించాలనుకున్నారనేది రాజకీయ విశే్లషకులకు సైతం అర్థం కావటం లేదు.

08/29/2017 - 00:49

సుప్రీం కోర్టు గత వారం రెండు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కేహార్ తన పదవీ కాలం ముగుస్తున్న వేళ వెలువడిన ఈ రెండు తీర్పులు సమాజంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తాయనేది నిర్వివాదాంశం.

08/22/2017 - 00:36

దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే వ్యవస్థీకృత అవినీతి అంతం కావటం ఎంతో అవసరం. వ్యవస్థీకృత అవినీతికి చరమగీతం పాడుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు వంటి విప్లవాత్మక చర్యల ద్వారా అవినీతిని అంతం చేసే దిశగా ప్రయాణం ప్రారంభించానని ఆయన చెబుతున్నారు.

08/15/2017 - 00:47

మన పార్లమెంటు సమావేశాలు నానాటికీ మొక్కుబడి వ్యవహారంలా మారుతున్నాయనడానికి వర్షాకాల సమావేశాలే ప్రబల నిదర్శనం. అధికార,ప్రతిపక్షాలు ఎప్పటి మాదిరిగానే పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యలను చర్చించడానికి ఏ మాత్రం దృష్టి సారించడం లేదు.

08/07/2017 - 23:37

భారత్ సహా మిగిలిన ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుకోకపోతే చైనాకే నష్టం వాటిల్లుతుంది. ‘డోక్‌లామ్’ గొడవ మూలంగా రెండు పెద్ద దేశాలైన భారత్, చైనాల మధ్య యుద్ధం అనివార్యం అయినపుడు- మన దేశం కంటే చైనాకే అధిక నష్టం కలుగుతుంది. దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల జనాభా ఉన్న భారత్, చైనాలు యుద్ధానికి దిగటం ఏ రకంగా చూసినా మంచిది కాదు.

08/01/2017 - 00:18

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ అధినాయకులు అధికారం కోసం తమ మూల సిద్ధాంతాలను సైతం పక్కన పెడుతున్నారా? జమ్ము-కశ్మీర్, గుజరాత్, బిహార్ వంటి రా ష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే బిజెపి నాయకత్వానికి అధికారం తప్ప మరో అంశం పట్టటం లేదనే భావన కలుగుతోంది.

07/24/2017 - 23:59

ప్రతిపక్షాల రాజకీయాల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నీరు కారిపోతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్షాలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానం ఉభయ సభలను స్తంభింపజేస్తోంది. సమావేశాలను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.

07/18/2017 - 00:02

దేశ సార్వభౌమాధికార పరిరక్షణలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించిన ప్రతిపక్షం దేశాభివృద్ధి విషయంలో కూడా కలసి రావాలి తప్ప- అడుగడుగునా అడ్డుపడటం మంచి విధానం కాదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏడాదికి మూడు సార్లు జరిగే పార్లమెంటు సమావేశాల్లో రెండో విడత జరిగేవి వర్షాకాల సమావేశాలు. బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఇవి కేవలం నెల రోజుల పాటే జరిగినా వీటికి ప్రాధాన్యత ఉంటుంది.

Pages