S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

07/02/2019 - 02:58

బ్రిటీష్ పాలన నుండి దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు ఊపిరి పోసుకున్న కాంగ్రెస్ తన లక్ష్యాన్ని సాధించింది కాబట్టి మూసివేయాలన్న జాతిపిత మహత్మా గాంధీ కలలను రాహుల్ గాంధీ ఇప్పుడు సార్థకం చేస్తున్నాడా? మహాత్మా గాంధీ తన హత్యకు మూడు రోజుల ముందు అంటే 1948 జనవరి 27 తేదీనాడు ఒక నోట్ రాశాడు.

06/25/2019 - 02:20

రాజ్యసభలో ఆధిక్యత సంపాదించేందుకు, తా ము అధికారంలో లేని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు భాజపా తహతహలాడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులనే అప్రజాస్వామిక వ్యూహంతో భాజపా అగ్రనాయకత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. ఈ దురాలోచన వెనక ‘దూరాలోచన’ ఉన్నట్లు కనిపిస్తోది.

06/18/2019 - 02:00

తాజాగా కొలువుదీరిన పదిహేడవ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు బాధ్యతతో వ్యవహరించకపోతే ప్రజల విశ్వాసాన్ని వారు మరింత కోల్పోవటంతోపాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచిన వారవుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కారు భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు సొంతంగా 303 సీట్లు వచ్చాయి.

06/11/2019 - 01:48

పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో మెజారిటీ సాధించిన భాజపా ఇక పాలనలో ఒదిగి పని చేయాల్సి ఉంది. మెజారిటీని అడ్డం పెట్టుకుని విర్రవీగితే ముందు ముందు అనర్థాలు ఎదురవుతాయి. ఎన్నికల్లో ఏకపక్ష విజయం ప్రధాని నరేంద్ర మోదీని అహంభావిగా మార్చిన దాఖలాలు కనిపించటం లేదు. కానీ, ఒకరిద్దరు మంత్రులు అపుడే తమకిక ఎదురు లేదనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.

06/04/2019 - 22:12

దాదాపు 133 ఏళ్ల క్రితం స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇపుడు ప్రశ్నార్థకమైంది. వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘో రంగా ఓడిపోవటం, తాజా ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యం, ఆశించిన స్థాయిలో ప్రియాంకా గాంధీ ప్రభావం చూపలేక పోవడం వంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ భవితవ్యం గందరగోళంలో పడింది.

05/21/2019 - 02:51

పదిహేడవ లోకసభ ఎన్నికల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఎల్ల్లుండి అంటే 23వ తేదీ ఏం జరగబోతోంది? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా, ఎగ్జిట్ పోల్స్ ఎంతో విశ్వాసంతో చెబుతున్నట్లు బి.జె.పికి మరోసారి భారీ మెజారిటీ లభించి ఎన్.డి.ఏ ఆధికారంలోకి రాబోతోందా? నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారా?

05/14/2019 - 01:57

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే విపక్ష శిబిరంలో ప్రధాని అభ్యర్థి ఎవరన్న అంశంపై రాజకీయం ఊపందుకుంది. ఆఖరి విడత పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని అభ్యర్థిత్వంపై విపక్ష పార్టీల్లో తెరవెనక చర్చలు ప్రారంభమయ్యాయి. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకి లోక్‌సభలో మెజారిటీ రాదన్న నమ్మకంతో ప్రతిపక్షాలు ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పటికే దృష్టి సారించాయి.

05/07/2019 - 01:25

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకునేందుకు ఇస్తున్నంత ప్రాధాన్యం తమ విధానాలను వివరిస్తూ ప్రజల విశ్వాసం పొందేందుకు ఇవ్వడం లేదు. దాదాపుఅన్ని రాజకీయ పార్టీలకు చెందిన చిన్నాపెద్దా నాయకులంతా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. ప్రత్యర్థులను అవహేళనకు గురిచేస్తూ, ఓట్లు దండుకునేందుకు ఎంతకైనా దిజగారుతున్నారు.

04/30/2019 - 01:25

ప్రస్తుత సార్వత్రిక సమరంలో విపక్షం వెనుకబడిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు గట్టి పోటీ ఇవ్వడంలో ప్రతిపక్షం విఫలమవుతున్న తీరు గోచరిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టేందుకు వీలులేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ప్రకటన ప్రతిపక్షంలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది.

04/23/2019 - 02:17

ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోతే తప్ప ఈ దేశం బాగుపడదంటూ కొందరు విపక్ష నేతలు చేస్తున్న వాదనలో ఎలాంటి పస లేదు. మోదీ రెండోసారి ప్రధాని పదవి చేపడితే దేశం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్న వాదనలు లేకపోలేదు. రాజకీయపరమైన స్థిరత్వం ఆయనతోనే సాధ్యమన్న పరిస్థితి కనిపిస్తోంది. కలగూరగంప లాంటి విపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజకీయ అస్థిరత్వం నెలకొంటుంది.

Pages