S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

02/11/2018 - 00:15

తరగతి గదిలో ఉపాధ్యాయుడు హాజరు తీసుకునే సమయంలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ‘జై హింద్’ అంటూ ప్రతిస్పందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆదేశాలు అభినందనీయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలు సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చొరవ చూపాలి.

02/10/2018 - 03:24

సంపన్న వర్గానికి చెందిన విద్యావంతుడు అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న బడ్జెట్ల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాంటి మేలు జరగడం లేదు. బడ్జెట్ ప్రవేశ పెట్టినపుడు ఆయన చెబుతున్న మాటలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించినవే తప్ప అత్యధిక సంఖ్యలో ఉన్న పేదలకు తక్షణ ఉపశమనం దక్కడం లేదు. గొంతెండి పోయిన వాడికి వెంటనే గుక్కెడు నీళ్లిస్తే ప్రాణం నిలుస్తుంది కానీ ఎప్పుడో నోట్లో అమృతం పోస్తానంటే ఎలా?

02/03/2018 - 00:24

కేంద్ర ప్రభుత్వంలోని నేతలు దేశానికి పాలకులా? లేక వారి ప్రాంతాలకే పాలకులా? వార్షిక బడ్జెట్‌లో రైల్వేశాఖ కేటాయింపుల్లో ప్రతిసారీ కొన్ని ప్రాంతాలకే పెద్దపీట వేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చాలా రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నారు. ఈసారి రైల్వేశాఖ పరంగానూ ఇదే జరిగింది.

02/02/2018 - 00:03

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆఖరిదైన పూర్తిస్థాయి బడ్జెట్‌ను మోదీ సర్కారు జనరంజకంగా రూపొందించక పోయినా బోలెడన్ని తీపి కబుర్లతో నింపింది. ఇది ఎన్నికల హామీలకు ముందుగా రిహార్సల్ చేసినట్టు ఉందే తప్ప ఎవరికీ ఎలాంటి ఊరట ఇవ్వలేదు. ఈ ఏడాది 50 శాతం పరోక్ష పన్నుల వృద్ధితో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్నట్లు సర్వే చెప్పినా, అందుకు అనుగుణమైన ఓదార్పు ఈ బడ్జెట్‌లో ప్రజలకు లభించలేదు.

01/31/2018 - 21:55

ఈ యేడు ఆర్థిక సర్వే ఫలితాలు చూస్తే రోగితో వైద్యుడు ‘ఏం ఫర్వాలేదు, అంతా సర్దుకుంటుంది’ అన్న తరహాలో ఉన్నాయి. వైద్యుడి మాటలతో భరోసా కలిగినా, ఇదంతా తనకి ధైర్యం చెప్పడంలో భాగమే కదా అన్న అనుమానమూ అతడికి వదలదు.

01/24/2018 - 22:13

కేంద్రం బడ్జెట్ సమర్పించే సమయం వచ్చేస్తోంది. ఈసారైనా సీనియర్ సిటిజన్లకు ఆదాయపన్ను పరిమితిని పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆశ. కనీసం 75 సంవత్సరాలు దాటినవారికి ఆదాయ పన్ను పరిమితి కాస్తంత ఎక్కువగా ఉండాలి. ఆదాయం సముపార్జించే ఓపిక లేని వృద్ధులకు రోగాలు, వైద్యచికిత్స, ఔషధాల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సాధారణ వస్తువుల ధరలూ బాగా పెరిగాయి.

01/24/2018 - 01:16

కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి సత్యపాల్‌సింగ్ డార్విన్ పరిణామ సిద్ధాంతం తప్పు అని సెలవిచ్చారు. దానికి ఆయన తెచ్చిన ఋజువేమిటంటే ఆ సిద్ధాంతం చెబుతున్నట్టుగా కోతి నుంచి మనిషి పుట్టాడన్నది ఎవరూ చూడలేదు, రాయలేదు కదా అన్నది. వాదన బాగానే ఉంది. కానీ ఒక శాస్ర్తియ సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి వితండ వాదన ఒక్కటే సరిపోదు. ప్రత్యామ్నాయ వైఖరికి మద్దతుగా బలమైన, నిరూపించదగ్గ సాక్ష్యాలు కావాలి.

01/20/2018 - 01:13

నీతి అయోగ్ పేరుని నీతి బోధల అయోగ్‌గా మార్చడం మేలు. దేశాన్ని మేలిమలుపు తిప్పగల ప్రణాళికల్ని రచిస్తారని, ఉన్న ప్రణాళికా సంఘాన్ని పీకేసి మరీ నెలకొల్పబడిన సంస్థ, ఆ పని ఎంతవరకూ చేస్తుందో తెలీదుగానీ అడక్కుండానే సలహాలు మాత్రం ఇచ్చేస్తుంది. తమ ఈతిబాధలకన్నా ఆ అర్థంపర్థంలేని నీతిబోధలే ఎక్కువగా బాధపెడుతున్నాయి.

01/18/2018 - 01:00

తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంలలో చాలాచోట్ల విత్‌డ్రా చేద్దామంటే నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్‌బ్యాంకు ఏటిఎంలకు వెళితే కార్డు స్వైప్ చేసినవెంటనే ఆధార్ లింక్ చేస్తావా, ఇంకేం చేయాలి అన్న వివరాలు వస్తాయి, ట్రాన్‌సాక్షన్ స్లిప్ కావాలా అన్న ప్రశ్న వస్తుంది. అన్నీ అయ్యాక నో క్యాష్, చింతిస్తున్నామంటూ ఓ బొమ్మ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

01/12/2018 - 06:52

విదేశీ పెట్టుబడుల విషయమై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆలోచించాల్సినదే. సాధారణంగా తెలిసీ తెలియని వైద్యులు ఏ రోగానికైనా స్టెరాయిడ్‌లను ఎడాపెడా వాడేస్తారు. జ్వరమో, దగ్గో వచ్చిందనుకోండి, దాని కారకంబట్టే వైద్యం చెయ్యడం ద్వారా తగ్గుతుంది. అలాకాకుండా స్టెరాయిడ్స్ వాడేస్తే లక్షణాలు తగ్గినట్టు కనబడినా, లోపల రోగం ముదురుతూ పోతుంది.

Pages