S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/10/2018 - 01:01

తెలంగాణలో రోజురోజుకూ ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగం అవసరాల రీత్యా జిల్లాల్లోని వాగులు, నదుల నుంచి పెద్దఎత్తున ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అడ్డుకున్నవారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఇసుక రీచ్ నుంచి ప్రతిరోజూ వేలాది లారీల ఇసుక వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది.

01/09/2018 - 00:02

ఆరుణ్ జైట్లీ పేరును ట్విస్ట్ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేసినందుకుగానూ, రాహుల్‌గాంధీపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌ని కోరడం అనుచితం. నిజానికి రాహుల్ ట్వీట్ ఏ విధంగానూ సభ్యుని హక్కుల్ని భంగపరిచేది కాదు. సభలో సభ్యుడికి తన బాధ్యతల నిర్వహణలో పూర్తి స్వేచ్ఛ కల్పించే దిశగా, అందుకు అవరోధం కల్పించేవారిని శిక్షించేలా ఈ ఏర్పాటు మన రాజ్యాంగంలో ఉంది.

01/06/2018 - 01:32

ఆలయ సిబ్బంది, ఉద్యోగుల వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలన్న జీవో 577లో లొసుగులున్నాయి. దీనివల్ల జీతంలో కొంత నేరుగా చెల్లిస్తూ, కొంత బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు అర్చకుల ఆశీర్వాదం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

01/05/2018 - 01:00

ప్రపంచ ప్రఖ్యాత అందాల తాజ్‌మహల్ పరిరక్షణకు భారత పురావస్తు శాఖ తీసుకున్న నిర్ణయం భేషైనది. రోజుకు 40వేలమంది పర్యాటకులను మాత్రమే సందర్శనకు అనుమతించాలన్నది ఆ నిర్ణయం. ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న తాజ్‌మహల్ చరిత్రకు, భవన నిర్మాణ శైలికి, ప్రేమకు, వివాదాలకు కేంద్రబిందువు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. అలాంటి విశిష్ఠమైన ప్రేమచిహ్నాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఇది జాతీయ సంపద.

01/03/2018 - 21:42

ఒక కోర్టులో నేరం నిరూపించలేకపోయినంత మాత్రాన నిందితులు సచ్చీలురని అర్థం కాదు. 2జి స్పెక్ట్రమ్, బొగ్గు బొరియల కుంభకోణాలలో దర్యాప్తు సంస్థ వైఫల్యం వల్ల నిందితులు బయటపడ్డారు. అసలు నేరమే జరగనట్లు, నిందితులు తప్పేమీ చేయనట్లు ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికల్లో స్పష్టంగా అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

01/03/2018 - 21:42

రాజకీయాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో రూపొందించిన మహిళాబిల్లుకు మోక్షం లభించేది ఎప్పుడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బిల్లును ఆమోదించే ప్రక్రియకు పలు పార్టీలు మోకాలడ్డాయి. మహిళకు ప్రాధాన్యం ఇస్తున్నామని చాలామంది నాయకులు, పార్టీలు బయటకు ప్రకటనలు చేస్తాయి. కానీ హక్కుల వద్దకు వచ్చేసరికి కుత్సితవైఖరిని కనబరుస్తున్నాయి.

01/03/2018 - 21:41

అంధత్వం, దృష్టిదోషంతో ఉన్నవారికి సమాజం, ప్రభుత్వం అండగా నిలవాలి. ప్రభుత్వాలు వారికోసం ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి అవసరం ఉంది. కళ్లు లేకపోయినా ధైర్యంగా నిత్య జీవనయానాన్ని సాగించడానికి మార్గం చూపినవాడు బ్రెయిలీ. అంధుల కోసం లిపిని అభివృద్ధి చేసి మార్గదర్శిగా నిలిచాడు. ఆ లిపికి అతడిపేరే పెట్టారు. జనవరి 4వ తేదీని బ్రెయిలీ జయంతి. ఆ రోజున ‘ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం’గా పాటిస్తారు.

01/03/2018 - 00:33

ఢిల్లీ మెట్రోలో ఆమధ్య ప్రయాణించిన ప్రధాని నరేంద్రమోదీ పెట్రో ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రజలు వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణావైపు మళ్లాలని కోరడం సమంజసమే. అయితే ఆయన మాటలు ఆచరణలోకి రావాలంటే ప్రభుత్వమే ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలి. చార్జీలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండాలి.

12/30/2017 - 00:58

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఫేస్‌బుక్’ కొత్తగా ఖాతాలు తెరిచే వినియోగదారుడి ఆధార్ సంఖ్యను పేర్కొనాలన్న నిబంధన వల్ల నకిలీ అకౌంట్ల గుట్టు రట్టవుతుంది. రక్షణ లభిస్తుంది. అయితే దీనిపై కొంత విమర్శలున్నాయి. వ్యక్తిగత వివరాలకు రక్షణ లభించదన్న ఆందోళన ఉంది. అయితే ఇది అనుసంధానం కాదు. వివరం చెప్పడం మాత్రమేనని, అది కూడా ఐచ్ఛికమేనని పేర్కొంది.

12/29/2017 - 01:49

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ని అపహరించి, గూఢచర్యం కేసు బనాయించి, సైనిక కోర్టులో విచారించినట్టు నటించి, చివరకు మరణశిక్ష ఖరారు చేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్ ఆయన, వారి కుటుంబ సభ్యులతో కలిసే సందర్భాన్ని అతి తెలివితే పాడు చేసింది. అంతర్జాతీయ సమాజం ఏర్పరచుకున్న, ఆయా సందర్భాలలో పాటించాల్సిన కనీస మర్యాదల్ని తన లేకి ప్రవర్తనతో ఉపేక్షించింది. పాకిస్తాన్‌కి ఒకటే ధ్యాస.

Pages