S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/21/2018 - 00:08

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏ చర్చా లేకుండా ప్రతిరోజూ తుడిచిపెట్టుకుపోతుండడం బాధాకరం. 2009 నుండి జరుగుతున్న సెషన్స్‌లో అత్యల్ప పనితీరు ప్రదర్శించిన సమావేశాలుగా ఈసారి సమావేశాలు రికార్డు సృష్టించడం అధికార, ప్రతిపక్షాలు ఉమ్మడి నిర్వాకం. పార్లమెంటులో వివిధ పక్షాల్ని సమన్వయం చేసి చర్చలు జరగడానికి బాటలు పర్చాల్సిన అధికార పక్షానికి ఈ పాపంలో పెద్ద వాటా దక్కుతుంది సహజంగానే.

03/20/2018 - 00:14

ముప్పు అని తెలిసినా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. ప్రతి అవసరానికీ ప్లాస్టిక్‌పైనే ఆధారపడుతున్నాం. ప్లాస్టిక్ క్యారీబ్యాగుల తయారీకి అడ్డూఅదుపూ లేదు. వీటిపై నిషేధం విధించినా దుకాణదారులు అతిక్రమిస్తున్నారు. ప్లాస్టిక్ క్యారీబ్యాగులలో వేసిన ఆహార పదార్థాలను భుజించడంవల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. అటువంటిది క్యారీ బ్యాగులలో వేడి వేడి ఆహార పదార్థాలు వేసి అమ్ముతున్నారు.

03/17/2018 - 02:30

కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి- ‘విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదు. అయినా జోన్ ఏర్పాటుతో మీకేం లాభం? ఒక జనరల్ మేనేజర్ పోస్టు రావడం తప్ప’ అని వ్యాఖ్యానించినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. అయితే ఇంకెందుకు ఆలస్యం? కేంద్రం పెద్ద ఖర్చేమీ లేని జోన్ ఏర్పాటు చేసి, తద్వారా విభజన చట్టం హామీని, ఉత్తరాంధ్ర ఆకాంక్ష సులువుగానే నెరవేర్చేయొచ్చని భావించొచ్చు కదా!

03/15/2018 - 23:36

వయసు మీదపడుతున్నా
ఎగసిన ఆలోచనల మహాజ్ఞాని
వెల్లువలా మాటలు రాకున్నా
విరబూసిన విజ్ఞాన ముని
ప్రపంచంలో ఒక మూల తానున్నా,
పరిమళించిన మేధా గని
పలువురు ఇక బ్రతకరన్న
ఆలోచనలను చనిపోనీయని
అవిశ్రాంత అమరజీవి

03/13/2018 - 23:31

ప్రతి జిల్లాలో దాదాపు ఒకటి లేదా రెండు మెడికల్ కాలేజీలున్నాయి. ఏటా వందలాది మంది డాక్టర్లు బయటకు వస్తారు. జిల్లాకు 40 నుంచి 50 మండలాలున్నాయి. మండలంలో 40 నుంచి 50 వేల జనాభా వుంటుంది. మండల కేంద్రంలో ఒకటి, మరొక ప్రధాన గ్రామంలో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. గ్రామాల్లోనే నేటికీ 65 శాతం ప్రజలు నివసిస్తున్నారు. ఒకటి, రెండు ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చలేవు.

03/13/2018 - 00:08

అదే కథ.. కథనమే వేరు. గత ఎన్నికలకు ముందు కథాంశం సమైక్యాంధ్ర సాధన, విభజన నిరోధం. ఇప్పటి కథ- ‘హోదా’ సాధన, హామీల అమలు. గెలుపుకనిపించని యుద్ధాలకు సన్నద్ధమవ్వక తప్పని స్థితి ప్రజలది. ఫలితం సంగతి చూచాయగా అర్థవౌతున్నా, రాజకీయ లబ్ధిని చేజార్చుకోకూడదన్న బింకం రాజకీయ పక్షాలది. వెరసి- అసలు ప్రయోజనాలు వెనక్కిపోతున్నాయి. జాతీయ పక్షాలు కూడబలుక్కొన్నపుడు రాష్ట్ర విభజన ఆగదని తెలిసీ సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది.

03/10/2018 - 23:42

కొద్దిరోజులుగా ఏ దినపత్రిక తిరగేసినా బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలు జరిగాయన్న వార్తలే వస్తున్నాయి. సామాన్య ప్రజలు బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొద్దిగా రుణం కావాలన్నా సంబంధిత అధికారులు సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. ఏటీఎంల నుంచి డబ్బు తీసినా, మినిమం బ్యాలెన్స్ లేకున్నా భారీగా చార్జీలు వడ్డిస్తున్నారు. రుణాలకు సంబంధించి చెల్లింపులు ఆలస్యమైతే బ్యాంకు అధికారులు నానా హంగామా చేస్తారు.

03/08/2018 - 22:48

తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక తెలివైన రాజకీయ వ్యూహం రచించారు. కాంగ్రెస్, బిజెపి రహిత ‘మూడో సమాఖ్య’ను జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేస్తానన్నారు. ప్రధాని మోదీని, కాంగ్రెస్ పార్టీని ఒకే వ్యాఖ్యలతో తెగనాడడం ద్వారా తన తాజా వ్యూహానికి నాంది పలికారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని దేవతగా కేసీఆర్ పొగిడారు.

03/07/2018 - 07:43

మన పూర్వ సిద్ధాంతాలు భూమి బల్లపరుపుగా ఉందన్నాయి. ఆ తర్వాత భూమి గుండ్రంగా ఉందని నిర్థారించారు. మన పురాణాల్లో ఎక్కడా కోతి మనిషిగా మారాడని చెప్పలేదు. సిద్ధాంతాలు ఏవో ఆధారాలను బట్టి ఏర్పడతాయి. కాలక్రమేణా అవి తప్పని మరికొన్ని ఆధారాలను బట్టి చెప్పవచ్చు. రామాయణంలోని హనుమంతుడు వానర సంతతికి చెందిన వాడు.

03/02/2018 - 22:48

కేరళలో గుప్పెడు మెతుకులు దొంగిలించాడన్న నెపంతో ఓ యువకుడిని చెట్టుకి కట్టి గ్రామస్థులు హత్య చెయ్యడం అత్యంత బాధాకరం. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, పేదరికం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధోరణి ప్రమాదకర భవిష్యత్తుని సూచించే ఘంటికల్ని వినిపిస్తున్నాయి.

Pages