S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

10/26/2018 - 01:10

ప్రజాస్వామ్య బద్ధంగా చట్టసభలకు జరగాల్సిన ఎన్నికల్లో నల్లధనం, దాదాగిరీ వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇది ప్రజాస్వామ్య ప్రియులందరికీ బాధ కలిగించే విషయం. ఎన్నికల్లో ప్రజావిశ్వాసానికి ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ధనస్వామ్యం ప్రభావం చూపడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ఎన్నికల వేళ నల్లధనం, ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం ప్రబలిపోవడం అత్యంత విచారకరం.

10/23/2018 - 05:16

తొలుత- తితిలీ తుఫాన్
తీరం దాటింది
మా బతుకుల్నీ, పంటల్నీ
ఫలహారం చేసింది.

పిదప- రాజకీయ ‘అల్ప’పీడనం
మమ్మల్ని చుట్టుముట్టింది
మా వెతల్ని పరిహాసం చేస్తోంది.

మోకాళ్ళ లోతు మొసలి కన్నీళ్లలో
మునిగి ఉన్నాం
కాస్తా పక్కకు తప్పుకుంటారా...
చెదిరిన మా గుండెల్ని
ఇక సరిచేసుకోవాలి...
-డాక్టర్ డి.వి.జి.శంకరరావు, విజయనగరం

10/17/2018 - 02:37

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తితిలీ తుపాను బాధితుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క రాత్రిలో రెండు జిల్లాల్లో పంటల్ని, రోడ్లను ఊడ్చేయడమే కాకుండా లక్షలాది మందికి మంచినీరు, ఆహారం, ప్రాథమిక సౌకర్యాలకు దూరం చేసిందీ తుపాను.

10/16/2018 - 02:33

‘మత్తు’ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది మద్యం మత్తు.. మాదక ద్రవ్యాల మత్తు.. అధికారపు మత్తు.. అలసత్వపు మత్తు... అంతేకదూ! కానీ, జనం అవగాహన పొందాల్సిన వేరే మత్తు ఉంది.. అదే వైద్యంలో ‘మత్తు’ పాత్ర లేదా మత్తు వైద్యుని (ఎనస్థీషియన్) పాత్ర. చిన్న ముల్లు గుచ్చుకొన్నా, వేలు తెగినా నొప్పితో ఎలా విలవిల్లాడతామో. అదే శరీరాన్ని పైనుండి క్రిందదాకా కోత పెట్టి వైద్యం చెయ్యాలంటే కుదిరే పనేనా?

10/12/2018 - 00:23

దేశ విదేశాల్లో ఇప్పుడు మహిళలు చేపట్టిన ‘మీటూ’ ఉద్యమం ప్రత్యేకమైనది, అభినందనీయమైనది. సినిమా, మీడియా, పరిశ్రమలు.. ఇలా ఏ రంగంలోనైనా అక్కడ పనిచేసే మహిళలకు వేధింపుల నుండి మినహాయింపు లేదు. అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో ఈ జాఢ్యం వేళ్ళూనుకొనడానికి ఎన్నో కారణాలున్నాయి. బాధిత మహిళ నోరు తెరచి చెప్పుకోలేదులే అన్న ధీమాతో వేధింపులకు పాల్పడేవారు బరితెగిస్తున్నారు.

10/09/2018 - 23:41

ఇరవై శతాబ్దాలకు పైగా తెలుగు సీమలను అలరించిన భాష మనది. నన్నయ, తిక్కన, ఎర్రన, పోతనాదుల ఉద్గ్రంధ రచనలు వెలగ ఎంతో సంపన్నతనొందిన భాష మనది. రాజరాజ నరేంద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు మరెందరో మహారాజ పోషకుల చేతుల్లో ఆదరింపబడి సువికసితయైన భాష మనది. రాజసభలనలరించిన అల్లసాని పెద్దనాదులు, మొల్ల, రంగనాథ, వెంగమాంబాదుల రచనల ద్వారా నడయాడిన తెలుగు- మనం గర్వించదగిన భాషగా విలసిల్లినది.

10/06/2018 - 00:13

తెలుగు రాష్ట్రాల్లో హింసా ప్రవృత్తి నానాటికీ పెరిగిపోతోంది. పరువు, ప్రతీకారం అంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని హత్యలకు పాల్పడటం సర్వ సాధారణమైంది. మన దేశం సామాజికంగా ఇంకా వెనుకబడే వుంది. చదువు, సంపాదన కోసం ఆడపిల్లలను కుటుంబాలకు దూరంగా పంపటం, తమకు నచ్చని ప్రేమ వివాహాలు చేసుకున్న వారిపై హత్యాయత్నాలు చేయటం దారుణం. ప్రభుత్వాలు కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తుంటే పరువు హత్యలు గర్హనీయం.

10/05/2018 - 02:05

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దుచేస్తూ సుప్రీం కోర్టు విలక్షణమైన తీర్పు వెలువరించింది. మహిళలు ఆ గుడిలోకి ప్రవేశించవచ్చునంటూ తేల్చిచెప్పింది. ఇది మహిళల పట్ల ఉన్న వివక్షను రద్దుచేసే తీర్పుగా ఎక్కువమంది అభినందిస్తున్నారు. మతం అన్నది వ్యక్తిగత భావన. మన దేశం మత రహిత దేశం కాదు, మతతత్వ దేశం కూడా కాదు. అన్ని మతాలనూ ఒకే గౌరవభావంతో చూసే దేశం.

09/27/2018 - 00:35

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ఉనికిని గుర్తింపును తెచ్చిన కన్నతల్లి వంటి మన మాతృభాష, పోషణ, ఆదరణ కరువై చిక్కిశల్యమై మంచాన పడింది. కన్నతల్లి ఆలనా పాలనా చూడాల్సిన తెలుగు బిడ్డలు పరాయి భాషల మోజులో పడి విలువలను మరచి, పెంపుడు తల్లి పంచన చేరడం అత్యంత దురదృష్టకరం.

09/25/2018 - 22:26

‘రాఫెల్’పై జవాబు చెప్పాలి

Pages