S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/02/2017 - 00:41

విభజన చట్టంలో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల శాసనసభలలోని సంఖ్య 225, 153గా పెంచాలని ఉంది. దీనికి రాజ్యాంగ సవరణ చెయ్యాలని కొందరు, అక్కర్లేదని కొందరు అంటున్నారు. శాసనసభ్యుల సంఖ్య పెరిగితే మండళ్లళ్ళలో కూడా, ఆంధ్రలో 50 నుంచి 75కు, తెలంగాణాలో 40 నుంచి 53వరకు పెరుగుతాయి. దీనికి ఎన్నికల సంఘం నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణకు ఒక కమిషనును ఏర్పాటు చేస్తుంది.

12/31/2016 - 00:25

ప్రధాని మోదీ చెప్పిన ‘నోట్ల రద్దు యాగం’ మొత్తానికి ముగిసినట్టే. ఇక యాగఫలాలపై ఆయన ఏమంటారో యావత్ జాతి ఆశగా ఎదురుచూస్తోంది. అలనాడు తక్షకుడితో పాటు సర్ప సంతతిని రూపుమాపడానికి జనమేజయుడు సర్పయాగం చేసినట్టు- ‘నల్ల సర్పాల’ను నాశనం చేస్తానంటూ పెద్దనోట్ల రద్దు యాగం మోదీ మొదలుపెట్టారు. పురాణ కథలో తక్షకుడు తప్పించుకొన్నట్టే, ఇక్కడ కూడా ‘నల్ల’ త్రాచులు తప్పించుకున్నట్లు చాలామందిలో ఒకటే అనుమానం.

12/30/2016 - 00:21

సంపన్నులకే సకల సౌకర్యాలు కల్పిస్తూ సామాన్యభక్తుల పట్ల ఉదాసీన వైఖరిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదర్శిస్తోంది. దైవ దర్శనం, సత్రాలు, ఇతర సౌకర్యాల విషయంలో సాధారణ భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ సామాన్య భక్తుల నుంచి కూడా అధిక మొత్తంలో ఆదాయం వస్తున్నా, ఆలయ అధికారులు సంపన్నవర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలయంలో ఉన్నతాధికారులను సైతం ఇక్కడి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు.

12/29/2016 - 07:34

తెలంగాణలోని అన్ని ఆలయాల అర్చకులకు, సిబ్బందికి ట్రజరీల ద్వారా వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన ప్రకటన చేయాలి. అర్చకులు, ఆలయ ఉద్యోగుల సమస్యలపై గతంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కెసిఆర్ రాబోయే కొత్త సంవత్సరం కానుకగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే అర్చకులు పలు ప్రాంతాల్లో భిక్షాటనలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

12/27/2016 - 23:35

తమ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్న పరిశ్రమల్లో ఉద్యోగాలన్నీ నూటికి నూరు శాతం కన్నడిగులకే ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం చట్టం చేయబోతోందన్న వార్త చూశాక మనం ఉన్నది భారతదేశంలోనా? లేక విదేశంలోనా? అని ప్రతి పౌరుడికీ సందేహం కలగటం సహజం. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ మినహా మిగిలిన అన్ని ప్రైవేటు రంగ సంస్థలకూ ఈ నిబంధన వర్తిస్తుందట.

12/26/2016 - 23:53

సాక్షాత్తూ టి.టి.డి సభ్యుడైన ఓ ఘరానా వ్యక్తి వైష్ణవ నామాలను నుదుట అలంకరించుకుని మర్యాద ఉట్టిపడేలా వస్త్రాలంకరణ చేసుకుని- చివరికి వేలకోట్ల నల్లధనంతో, వందలాది కిలోల బంగారంతో ఐ.టి అధికారులకు దొరికిపోవడం విస్మయం కలిగిస్తోంది. భక్తుడి అవతారంలో కనిపించే ఆ పెద్దమనిషికి తమిళనాడులో ఉన్న అక్రమాస్తులు ఎన్నో ఇంకా లెక్కతేలలేదు. అక్రమ సంపాదన కూడబెట్టిన ఇలాంటి వారు భక్తులా? దేశద్రోహులా?

12/26/2016 - 02:39

తెలంగాణలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల గూర్చి చర్చ జరుగుతోంది. ఇది అమలుకాదని ప్రస్తుత పాలకులకూ తెలుసు. కొందరిని రాజకీయ క్షేత్రంలో పలుచన చేయడానికి ఇది పాలకుల కుయుక్తి. సామజిక న్యాయంపై ప్రేమ వుంటే రాజకీయంగా పదవులు కేటాయించాలి. మత మార్పిడులు చేసుకున్న వారికి రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?

12/24/2016 - 00:56

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం రాత్రికి రాత్రి కట్టినది కాదు. కేవలం 260 చదరపు అడుగుల స్థలంలో ఇంత భారీ భవనం నిర్మిస్తున్నట్లు ఆ ప్రాంతంలో ఆస్తిపన్ను వసూలు చేసే జిహెచ్‌ఎంసి అధికారులకు, నల్లా కనెక్షన్లు ఇచ్చే ఉద్యోగులకు తెలియనిది కాదు. ఈ అధికారులెవరూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయనందునే ఏడంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించారన్నది జగమెరిగిన సత్యం.

12/23/2016 - 00:33

1నుండి 10 తరగతులకు ఈ విద్యాసంవత్సరం మార్చితో ముగుస్తుంది. 1నుండి 9 తరగతులకు మార్చి ప్రారంభంలో పరీక్షలు నిర్వహించి, మార్చిలోనే నూతన తరగతులకు ప్రమోషన్ కల్పిస్తారు. అయితే తరగతులు ప్రారంభమయ్యేనాటికే నూతన పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలి. 2016లో సకాలానికి నూతన పాఠ్యపుస్తకాలు రాక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈసారి అది పునరావృత్తం కాకుండా చూడాలి.

12/22/2016 - 07:29

సీరియల్స్‌లో ఇటీవలి కాలంలో హింసాప్రవృత్తిని ప్రేరేపించే సన్నివేశాలు ఎక్కువయ్యాయ. అసలే నేటి సమాజంలో హింస ఎక్కువవుతుంటే దానికి కొత్త సీరియల్స్ తోడవుతున్నాయి. మంచిని నేర్పించాల్సిన సీరియల్స్ చెడును ప్రోత్సహిస్తున్నాయి. ఒక సీరియల్‌లోని ఓ సన్నివేశంలో మంగళ స్నానం చేసే నీటిలో యాసిడ్ పోయటం, మెహందీలో చేతులు కాలిపోయే కెమికల్స్ కలపినట్లు చూపించారు.

Pages