S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/21/2016 - 01:11

తెలుగు పాఠ్య పుస్తకాల్లో మాండలికాలు ఎక్కువగా వుండే పాఠ్యాంశాలను తొలగించాలి. తెలుగువారందరికీ అర్ధమయ్యే శ్రేష్ట వ్యావహారిక భాషని ప్రయోగిస్తేనే తెలుగు గొప్పవారసత్వ భాషగా నిలచి వుంటుంది. మాండలికాలనేవి ఒక్కో జిల్లాకు ఒక్కోవిధంగా వుండి మిగతావారికి ఇబ్బందిగా వుంటుంది. మాండలికాలపై మమకారం ఉండొచ్చు. కానీ అందరికీ అర్థమయ్యేలా ఉన్న భాషను ఉపయోగించుకోవాలి.

12/20/2016 - 01:11

క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు తెలంగాణ ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తోంది. గతంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు కూడా ఈ ప్రభుత్వం అనేక తాయిలాలు ప్రకటించి అందజేసింది. ఇఫ్తార్ విందులకోసం నిధులు వెచ్చించింది. ప్రభుత్వానికి పెద్దమొత్తంలో హిందువులు చెల్లిస్తున్న పన్నుల నుంచి ఖర్చు చేస్తోంది. మెజారిటీ ప్రజలైన హిందువులకు రుచించని, ఆ వర్గానికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలుగానే భావించాలి.

12/19/2016 - 04:20

పాఠశాల స్థాయిలో భాషా వాచక పుస్తకాలలో పాఠ్యాంశాలకు ముందు విధిగా కొన్ని దేశభక్తి గీతాలను ఇవ్వాలి. గతంలో పాఠ్యపుస్తకాలలో ప్రారంభంలో ‘సారే జహాసె అచ్ఛా’, ‘వందేమాతరం’ వంటి తదితర దేశభక్తి గీతాలు ఇచ్చేవారు. వాటిని ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించేవారు. రానురాను వాటి ప్రాధాన్యతను తగ్గించారు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా భాషావాచకాలలో విధిగా దేశభక్తి గీతాలను చేర్చాలి.

12/17/2016 - 00:20

పెద్దనోట్ల రద్దు తర్వాతి పరిణామాలు గమనిస్తే దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశ పూర్వకంగా రాజకీయం చేస్తున్నాయన్న విషయం ప్రజలకు అర్థమవుతోంది. దొంగనోట్లు, నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని సామాన్య జనం అర్థం చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పార్టీల నేతలు అనవసర రాద్ధాంతం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.

12/16/2016 - 01:05

ఈమధ్య టిఎస్ ఆర్‌టిసి కొన్ని బస్సులను కొనుగోలు చేసినా అవి ప్రయాణీకుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రయాణీకుల సంఖ్యకు సరిపోనందున కొన్ని అద్దెబస్సులను కూడా నడుపుతున్నారు. కొన్ని చోట్ల కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారు. రద్దీ మార్గాల్లో ప్రయాణీకులు నిలబడి ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సుల్లో కనిపిస్తోంది.

12/15/2016 - 07:39

పోస్టుద్వారా పంపిస్తున్న వార, మాసపత్రికల కవర్లపై చందాదారుని నెంబరు, చందా గడువు తేదీ వంటి వివరాలు ప్రచురించకూడదని తపాలా శాఖ నిర్ణయించడంతో చందాదారులకు కలుగుతున్న అసౌకర్యం కలుగుతోంది. రిప్లై కార్డులు ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రజలకు నష్టం కలిగించే ఇలాంటి నిర్ణయాలు సరికాదు. చందా నెంబరు, గడువుతేదీ ముద్రించటం వలన పాఠకులకు మేలు. పత్రిక యాజమాన్యంతో సంప్రదింపులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

12/13/2016 - 23:49

హైదరాబాద్ శివారు గ్రామాల్లో ‘జిప్లస్‌టూ’ అనగా మూడు అంతస్తుల భవన నిర్మాణాలకు పంచాయతీల నుండి అనుమతి తీసుకుని కొందరు బిల్డర్లు ఐదు, ఆరు అంతస్థుల్లో అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఈ అక్రమాలకు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు సహకరిస్తున్నారు. కాలనీ సంక్షేమ సంఘాల పేరుతో కొందరు వ్యక్తులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు.

12/12/2016 - 23:58

పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో దడ పుట్టించిన ప్రధాని మోదీ అభినందనీయుడు. ఎవరు ఎంత మంచిపని చేసినా కొన్ని లోటుపాట్లు తప్పవు. చేసిన మంచిపని కన్నా చిన్న చిన్న లోపాలపై దుమ్మెత్తిపోసేందుకు విపక్షాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దేవుడికే తప్ప- లోటుపాట్లు లేకపోవడం మానవులకు సాధ్యం కాదు. దేశంలోని అన్నివర్గాల ప్రజలూ మోదీ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు.

12/12/2016 - 00:01

పెద్దనోట్ల రద్దు తరువాత డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయాలన్న ప్రచారం విస్తృతమైంది. కానీ మన వ్యవస్థలో అది అంత సులువుకాదు. బ్యాంకు అకౌంట్లు లేని ప్రజల సంఖ్య తక్కువేమీ కాదు. డెబిట్, క్రెడిట్ కార్డులతో చిల్లర మార్కెట్లు, కూరగాయల మార్కెట్లలో చెల్లింపులకు తగిన ఏర్పాట్లు కూడా సరిగా లేవు. అది ఆచరణలో కష్టమే.

12/10/2016 - 00:58

పెద్దనోట్లను రద్దు చేశాక బడాబాబులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. నగదు కొరత, చిల్లర సమస్యతో పేద, మధ్యతరగతి వారు నానా యాతన అనుభవిస్తున్నారు. చిరువ్యాపారులకు జీవనోపాధి కరవయ్యే ప్రమాదం ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు ఫలితంగా చిల్లర నోట్లను సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఈ దుస్థితి ఏర్పడింది. నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద భారీ క్యూలు తప్పడం లేదు.

Pages