S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/28/2016 - 08:17

కొత్తగా విడుదల చేసిన 2వేల రూపాయల నోటు నీట్లో తడిసి రంగుమారి వెలిసిపోతే అది అసలైన నోటు అని, రంగుమారకుంటే నకిలీ నోటు అని ఆర్‌బిఐ అధికారులు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. వర్షం పడినపుడు ఎంత జాగ్రత్తగా జేబులో దాచినా నోట్లు ఎంతోకొంత తడవకుండా ఉంటాయా? పొరపాటున నీళ్లలో పడినా వెలిసిపోతాయా? పాత 500, 1000 నోట్లు ఎంత తడిసినా రంగుమారేవి కావు. ఇపుడు 2వేల నోటుతో ఎన్ని అవస్థలో..?

11/26/2016 - 04:10

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఏటా నవంబర్ 14 నుండి గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రంథాలయంలో వారం రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. విద్యార్థులకు, మహిళలకు వ్యాస రచన, చిత్రలేఖనం, రంగోళి, ఉపన్యాసం, క్విజ్, పాటలు, నృత్యాలు తదితర పోటీలు నిర్వహించి చివరిరోజున బహుమతులు ప్రదానం చేయాల్సి ఉంటుంది.

11/25/2016 - 06:27

విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పించే అవకాశం శూన్యం కావడంతో ప్రధాని మోదీ తన ప్రతిష్టను పెంచుకునేందుకు, కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పెద్దనోట్లను రద్దు చేసినట్టు కనిపిస్తోంది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం కీలక నిర్ణయం అయినప్పటికీ- సాధ్యాసాధ్యాలను, భవిష్యత్ పరిణామాలను ఆలోచించకుండా పెద్దనోట్లను రద్దు చేశారు.

11/24/2016 - 07:35

పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులకు కునుకు పట్టకుండా పోయిందో లేదో గానీ, చిల్లర నోట్లకు కరువొచ్చి సామాన్య ప్రజలకు వణుకొస్తోంది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వచ్చి రెండు వారాలు గడిచినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు, బ్యాంకులో ఉన్న తమ కొద్దిపాటి డబ్బును తీసుకునేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు.

11/23/2016 - 00:52

ఇటీవలి కాలంలో దేవాలయాల్లో హుండీలు చోరీలకు గురవుతున్నాయి. ఆలయాల్లో హుండీలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. ఆదాయం వున్న గుడుల్లోనే హుండీ దొంగతనాలు జరుగుతున్నాయి. దేవాలయాల్లో రక్షణ నిమిత్తం సెక్యూరిటీ గార్డులను నియమించాలి. దొంగలు దేవుడి నగలు సైతం దొంగిలిస్తున్నారు. ఈ చోరీలను అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత దేవాలయాల ధర్మకర్తలకు, కమిటీ సిబ్బందికి, అధికారులకు ఉంది.

11/21/2016 - 23:11

హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చే రోగులను వివిధ పరీక్షల పేరుతో భయకంపితులను చేసి జలగల్లా పీడిస్తున్నాయి. చిన్నపాటి జబ్బు చేసినా ప్రైవేటు ఆస్పత్రి మెట్లెక్కితే చాలు దోపిడీ కథ ప్రారంభమవుతుంది. రోగి నుండి పూర్తి సమాచారం సేకరించకుండానే ముందుగా ఫలానా పరీక్షలు చేయించుకుంటేనే వ్యాధి నిర్థారణ చేస్తామని వైద్యులు చెబుతుంటారు.

11/20/2016 - 23:35

ముస్లిం సమాజపు అంతర్గత సమస్యగా చెప్పబడుతున్న ‘తలాక్’ అంశం రద్దుపైన విస్తృత చర్చ అవసరం. మానవత్వ కోణంలో చూస్తే స్ర్తి స్వేచ్ఛకు ‘తలాక్’అనేది భంగకరం. మారుతున్న కాల పరిస్థితులకు అనుకూలంగా మత ఆచారాలు, గ్రంథాలలో వ్యాఖ్యానాలు కూడా మార్చుకోవలసిన అవసరం ఉంది. ముస్లిం మత పెద్దలు, మేధావులు, సామాజికవేత్తలు తలాక్ అంశాన్ని సమీక్షించాలి.

11/18/2016 - 22:42

గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం. మన మేధోసంపత్తిని పెంచేవి గ్రంథాలయాలు మాత్రమే. స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయోద్యమం కీలకపాత్ర పోషించింది. అలాంటి విజ్ఞాన సర్వస్వాలైన గ్రంథాలయాలు నేడు ఆదరణ కోల్పోతున్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల్లో సమస్యలు తిష్టవేశాయి. దినపత్రికలు సక్రమంగా రాకపోవడం, బెంచీలు, కుర్చీలు లేకపోవడం, గ్రంథాలయాధికారులు అందుబాటులో వుండకపోవడం లాంటి సమస్యలు తప్పడం లేదు.

11/17/2016 - 23:31

పెద్దనోట్ల రద్దు నిర్ణయం సముచితమైనదే, కాదనటం లేదు. కానీ, చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి వారిలో రోగుల పాట్లు వర్ణణాతీతం. పల్లెటూళ్ల నుంచి ప్రైవేటు ఆస్పత్రులుండే పట్టణాలకు ఎంతోమంది రోగులు వస్తుంటారు. చాలా ఆస్పత్రుల్లో 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడం లేదు. బ్యాంకులు, ఎటిఎంలు, పోస్ట్ఫాసులు ప్రజల అవసరాలను తీర్చడం లేదు.

11/17/2016 - 07:03

భారత్‌లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని అనేక దేశాలు నిరసిస్తున్నాయి. కానీ, చైనా మాత్రం పాకిస్తాన్‌కు మద్దతు తెల్పుతోంది. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. అటువంటి చైనాకు భజన చేయడం మన దేశంలోని కమ్యూనిస్టులకే చెల్లుతుందేమో. ఉగ్రవాదంపై పోరాటంలో మనకు అమెరికా అండగా నిలబడింది. అమెరికా, భారత్ ప్రజాస్వామ్య దేశాలు. ఇవి స్నేహంగా వుండటంలో ఆశ్చర్యం లేదు.

Pages