S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

10/20/2016 - 22:06

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల పైశాచిక చర్యలకు ప్రాణాలను కోల్పోతూ తమ కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్న ప్రతి సైనికుడూ కోట్లాది భారతీయుల హృదయ మందిరాలలో కొలువుదీరిన దేవుడే. దేశ భద్రత కోసం జీవితాలను అంకితం చేస్తున్న సైనికులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అమర సైనికుల కుటుంబ సభ్యులకు ఏ లోటూ రాకుండా చూసుకోవడం మన ఏలికల కనీస బాధ్యత.

10/20/2016 - 03:20

ఎపి సర్కారు ప్రభుత్వోద్యోగుల పదవీ కాలాన్ని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. దీనిని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లకు వర్తింపచేసింది. పదవీ విరమణకు పెంచిన గరిష్ట వయో పరిమితి విషయంలో నాల్గవ తరగతి ఉద్యోగులకు ఓ రకంగా అన్యాయం జరిగిందనే చెప్పాలి. గత ప్రభుత్వాల కాలంలో ప్యూన్లు, అటెండెంట్లు, గార్డెనర్లు, స్కావెంజర్లు తదితరులకు రిటైర్‌మెంటు వయసు 60 ఏళ్ళుగా వుండేది.

10/18/2016 - 23:51

రెండేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న విశాఖ షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఈ హార్బర్‌లో దాదాపు 700 మెకనైజ్డ్ బోట్లపై ఆధారపడి వేలాదిమంది మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తుపాను కారణంగా జెట్టీ,గిడ్డంగులు, యాంకరింగ్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి.

10/17/2016 - 23:02

దేశంలో ప్రజలంతా ఒక్కటే, అందరికీ చట్టాలు ఒక్కటే. అయితే, నేడు మన పాలకులు ‘మైనారిటీ’లంటూ కొంతమందిపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ విధానం జాతి సమైక్యతను దెబ్బతీస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకై ‘మైనారిటీ’ అన్న పదాన్ని తరచూ వాడుతూ దేశానికి కీడు తలపెడుతున్నారు. ఈ పదమే అఖండ భారత్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లుగా విడదీసింది. ఇప్పుడు కాశ్మీర్ సమస్యను రావణకాష్ఠంలా రగిలిస్తున్నారు.

10/16/2016 - 23:25

‘్భరత సైన్యం జరిపిన మెరుపుదాడులకు ప్రభుత్వం రుజువులు బయటపెట్టాలి’- అని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రభస చెయ్యబూనటం చాలా అసహ్యకరంగా ఉంది. పాకిస్తాన్‌లో ఉన్న ప్రముఖులే ‘పాకిస్తాన్ ఆత్మహత్యకు పాల్పడటం మంచిది కాదు’- అని తమ సూచనలు వెల్లడిస్తూంటే వారం కిందట మొరాదాబాద్ (యుపి)లో సంజయ్ నిరుపమ్ పార్టీ గణాచారిగణాలు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని ఊరేగింపు చేసారు!.

10/15/2016 - 03:24

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆచరణలో ఏమీ కనిపించడం లేదు. పేదవర్గాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా మధ్యాహ్న భోజనం అమలుచేస్తే బాగుంటుంది. ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు నిరుపేద కుటుంబాల్లో జన్మించి ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు.

10/14/2016 - 00:24

ఇటీవల మన సైనికులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిపిన ‘మెరుపుదాడి’ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవు. ఓ వైపుప్రధాని నరేంద్ర మోదీకి జైకొడుతూనే మరోవైపు మెరుపుదాడికి సంబంధించిన వీడియోలను బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. కేజ్రీ నిజాలు మాట్లాడారని ఆయన అభిమానులు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు ప్రశంసల వర్షం కురుపించవచ్చు.

10/13/2016 - 04:52

ప్రస్తుతం రాష్ట్రంలో ‘వనం-మనం’ కార్యక్రమం జోరుగా సందడిగా రాజకీయ నాయకులు జరిపిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, భూమి కనపడితే, ఇళ్ళు, దుకాణాల ముందు మొక్కలు నాటి ఫొటోలు, వీడియోలు తీసి మీడియా ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్నారు. మరి నాటటం వరకేనా, ప్రతిరోజూ మొక్క పెరగటానికి నీళ్ళు పోయటం లాంటి జాగ్రత్తలు, చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అన్నది అంతుచిక్కని ప్రశే్న.

10/11/2016 - 06:40

కిందటి తరంవారు మాతృభాష తెలుగులోనే ఉన్నత విలువలను సాధించిన తర్వాత హిందీ, ఉర్దూ, ఆంగ్లం తదితర భాషల్లో పరిణతి పొందగలిగారు. అటువంటిది ఈనాడు తెలుగు వెలుగు లేక రాను రాను భ్రష్టుపట్టటానికి కారకులు ఎవరన్నది ఆలోచించాల్సిన విషమ పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల ఆలోచనలోనే కాదు తల్లిదండ్రులలో కూడా మాతృభాషను నేర్పించాలన్న ఆసక్తి ఉంటేనే తెలుగు చక్కగా పదికాలాలపాటు మనుగడ సాగిస్తుంది.

10/10/2016 - 00:24

గత కొద్దిరోజులుగా దేశ రాజకీయ రంగస్థలిపై వివిధ పక్షాలు విసురుకొంటున్న వాగ్బాణాలు అదుపు తప్పుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల కావల ఉన్న తీవ్రవాద శిబిరాలపై భారత్ సేనలు మెరుపుదాడి చేసి విజయంతో తిరిగిచ్చిన ఉదంతంపై రాజకీయ నేపథ్యం సంతరించుకోవడం బాధాకరం. ప్రధాన రాజకీయ పక్షాలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తే అది- సైన్యానికి, దేశానికీ, ప్రజలకి ఎంత మాత్రమూ మేలు కాదు.

Pages