S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

10/08/2016 - 03:30

ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గృహనిర్మాణ పథకాలు నీరుగారిపోతున్నాయి. ఒకప్పుడు వివిధ పథకాల కింద పేదలకు గృహనిర్మాణం జోరుగా సాగింది. ఈ పథకాలకు ఇందిరమ్మ, రాజీవ్, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి నేతల పేర్లను పెట్టడం తప్ప నిరుపేదలకు సొంత ఇల్లు కలగా మారుతోంది. చాలా చోట్ల భూమి లభించడం లేదన్న సాకుతో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదు.

10/07/2016 - 01:12

‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అంటే ఎవరు? ‘ఉత్తమ’ అనే పదానికి మంచి లేక శ్రేష్ఠమని అర్థం. ఈ పురస్కారం సాధించలేని ఉపాధ్యాయులు అసమర్థులా? ఏటా ఈ పురస్కారానికి అధికారులు తమకు తోచిన వారిని ఎంపిక చేస్తారు. అనేక మంది అసమర్థులకు సైతం ఉత్తమ ఉపాధ్యాయ బిరుదులు ఇచ్చినట్లు నిత్యం విమర్శలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలోను, రాష్టస్థ్రాయిలోను, జిల్లా స్థాయిలోను ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సత్కరించడం ఓ ప్రహసనంగా మారుతోంది.

10/07/2016 - 01:07

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ మనకు శత్రుదేశం. ఉగ్రవాదులు మనకు శత్రువులే. కానీ, పాక్ కళాకారులు మనకు మిత్రులే. యూరీ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులు మన దేశం నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేస్తుండగా, కళాకారులు వస్తూపోతుంటేనే రెండు దేశాల మధ్య మైత్రి పెరుగుతుందని కొందరు మేధావులు చెబుతున్నారు.

10/06/2016 - 02:54

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ (ఆదాయ బహిర్గత పథకం) ద్వారా అరవై వేల మంది తమ అప్రకటిత ఆదాయాన్ని, ఆస్తుల్ని నలభై ఐదు శాతం పన్ను కట్టి చట్టబద్ధం చేసుకోగా, ప్రభుత్వ ఖజానాకు ముప్ఫైవేల కోట్లరూపాయల మేరకు జమ కావడం అభినందనీయం. దేశంలో ఆరు లక్షల మందికి నోటీసులు జారీ కాగా, ముందుకు వచ్చినవాళ్ళు అరవై వేల మంది మాత్రమే కావడం నిరాశాజనకం.

10/05/2016 - 05:16

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కొందరిని మైనారిటీలంటూ మతం ప్రాతిపదికపై విడదీసి చూడడం చాలా ప్రమాదకర సంకేతం. ఈ ధోరణి ఏదో ఒకనాటికి మరలా దేశ విభజనకు దారితీయవచ్చు. ఒకప్పటి భారత్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్‌గా విడగొట్టారు. ఇప్పుడు కాశ్మీర్‌ను ప్రత్యేకించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇదంతా మైనారిటీ అనే పదం వల్లే జరుగుతోంది.

10/04/2016 - 02:07

మార్కెట్లలోకి కుప్పలుతెప్పలుగా వస్తున్న బెంగళూరు టమాటా, హైబ్రీడ్ రకం టమాటాలు సరిగా ఉడకడం లేదు. వీటికి పులుపుండదు. రుచి లేని ఈ రకం టమాటాలకు బదులు రైతులు దేశీయ విత్తనాలను వాడితే వినియోగదారులకు ఫలితం ఉంటుంది. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రైతులకు దేశీయ విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి. మిగతా కూరగాయలకు సంబంధించి కూడా దేశీయ వంగడాలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

10/03/2016 - 05:38

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న దేశాలలో అగ్రభాగాన నిలిచి మన దేశం ఇప్పటికే చాలా అప్రతిష్ట మూటకట్టుకుంది. రహదారి ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసే పాలకులు- ప్రమాదాల నివారణ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.

09/30/2016 - 02:02

ప్రధాని మోదీ పేదరికంపై యుద్ధం ప్రకటిస్తూ వచ్చే సంవత్సరాన్ని ‘గరీబీ కళ్యాణ్‌వర్ష్’గా ప్రకటించడం ముదావహం. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలను, దళితులను ఓటు బ్యాంకుగా భావించి సంక్షేమాన్ని నీరుగార్చిన ఫలితంగా గ్రామీణ దళితులు మరింత పేదలుగా, పట్టణాలలో దళితులు మురికివాడలకే పరిమితమైన వారిగా మిగిలిపోయారన్న మోదీ మాటలో అతిశయోక్తి లేదు.

09/29/2016 - 07:12

హిందూ మతం ఇప్పుడు విదేశీ శక్తుల కబంధ హస్తాలలో నలుగుతోంది. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు హిందూ సమాజాన్ని పీడిస్తున్నాయి. చాలామంది ఈ సమస్యలను ఎదిరించలేక మతం మారుతున్నారు. లౌకిక రాజ్యంలో మతం మారడం తప్పుకాదు. కాని బలవంతంగా, ఒత్తిళ్లకు గురిచేసి మతం మార్చడం తప్పు. భారతదేశ సంస్కృతి హిందూ మతంపై ఆధారపడి ఉంది. హిందూ సమాజాన్ని ఇప్పుడున్న స్వాములు ఉద్ధరించడం లేదు.

09/28/2016 - 04:54

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని తోటపల్లి రిజర్వాయర్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి నాగావళి నదీ తీరంలో వేంకటేశ్వర ఆలయం చిన్న తిరుపతిగా పేరుపొందింది. ఈ ఆలయానికి చేరువలోనే కోదండరామస్వామి వారి ఉత్తరాంధ్ర భద్రాద్రి రామునిగా భావిస్తారు. తోటపల్లి ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి పరచాలని కోట్లాది ప్రజలు చిరకాలంగా కోరుతున్నారు.

Pages