S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

09/15/2016 - 06:02

యూపిఏ నేతలకు రెండు సంవత్సరాల ముందు తాము ఓటమి చెందనున్న వైనం తెలుసుగాని ఇంత ఘోర పరాజయం వూహించలేదు. కాంగ్రెస్ జీన్స్‌లో వల్లమాలిన వుడుకుమోత్తనం వుంది. బెంగాల్‌లో మొదటిసారి అధికారానికి వచ్చిన కమ్యూనిస్టులు నాటి కాంగ్రెస్ వారి అరాచకాలను మరిచేరేమో గాని భారత్‌లో చాలామంది మరువరు. మరవాలసిన అవసరం వున్నవారు మరిచేరు. ఢిల్లీ ఎన్నికలపుడే చర్చిలపై దాడులు జరిగేయి. కాంగ్రెస్ ఓట్లు ఆప్‌కు బదిలీ అయ్యేయి.

09/14/2016 - 06:25

నదీ జలాల పంపిణీ వ్యవహారంలో నీరు, ప్రజల మధ్య నిప్పుని రాజేయడం, సమాజంలో అశాంతికి ఆజ్యం పోయడం మామూలైంది. ఇది గడచిన శతాబ్ద కాలంగా జరుగుతున్నదే. అయతే నేటికీ ఇదే స్థితి కొన సాగుతుండటం పాలనా వైఫల్యం. ఇరు రాష్ట్రాలకూ ప్ర త్యేకించి ఎగువ రాష్ట్రం శాంతి భద్రతల పేరుతో తన ఆదే శాన్ని ఖాతరు చేయకపోవడాన్ని సహించబోమని అత్యు న్నత న్యాయస్థానం చెప్పడం అభినందనీయం.

09/12/2016 - 23:52

మన దేశ రాజకీయవేత్తలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజల యొక్క ఐకమత్యాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోరు. దేశంలో కులాలను విడదీసి ప్రజల్లో ఐకమత్యత లేకుండా చేసి, తమ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. రిజర్వేషన్ల పేరు తో ప్రజలను యస్.సి, యస్.టి, బి.సి., ఒ.సిలుగా విభజించింది చాలక ఇప్పుడు యస్.సిలను మళ్లీ వర్గీకరించాలన్న ఆలోచన వచ్చింది.

09/12/2016 - 01:12

మార్కెట్లో ఏ వస్తువైనా ధర పెరగటమేగాని తగ్గటం లేదు. పెరుగుతున్న ధరలు, ఫీజులు పన్నులతో కాలం వెళ్ళబుచ్చుతున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు రావల్సిన మూడు డి.ఎ.లకోసం ఎదురుతెన్నులు చూస్తున్న సమయంలో ప్రభుత్వం ఒక డి.ఎ.ని విదిల్చేసి చేతులు దులుపుకున్నది. రాష్ట్రానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చినందుకుగాను ఒక క్రీడాకారిణికి మూడు కోట్లు నజరానా ప్రకటించడం సమంజసమా? ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయం లేదు.

09/10/2016 - 07:42

కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇబ్బడిముబ్బడిగా జీతాలు పెంచుతూ, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల పట్ల మాత్రం వివక్ష చూపిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధికి జీవం, వెనె్నముక లాంటివారు కార్మికులు. వారు ఓటు బ్యాం కులు కాదు. వారిపట్ల వివక్షచూపినా తమ అధికారానికి, ఉనికికి ఏమాత్రం ప్రమాదం లేదన్నది పాలకుల ఆలోచన. కేంద్ర ప్రభుత్వం కార్మిక బీమా పథకాన్ని ప్రారంభించాలి. ప్రతి కార్మికుడి జీతంనుండీ నెలకు 2 రూ.

09/09/2016 - 00:06

ఉత్తరప్రదేశ్‌కు రానున్న ఎన్నికల్లో రాహుల్‌గాంధీ తల పెట్టిన కిసాన్ యాత్రకి సంకేత ప్రాయంగా మోదీ ‘చాయ్ పే చర్చా’కి నకలుగా ‘ఖాట్ పే చర్చా’ (మంచంపై మాటా మంతీ)ని ముందుకు తీసుకొని రావడం కచ్చితంగా ఒక చౌకబారు ఎత్తుగడ. అనుకున్నట్టే మొదటి ప్రయత్నం లోనే మంచం ప్రచారం బెడిసి కొట్టడం, అందు కని వినియోగిచిన రెండువేల మంచాలు సభికులు ఎత్తుకు పోవడం ఆ పార్టీ స్వయంకృతం.

09/08/2016 - 04:23

టాటా కార్ల పరిశ్రమకై బెంగాల్ ప్రభుత్వం గతంలో సే కరించిన 997ఎకరాల భూమిని తిరిగి రైతులకు అప్ప గించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అసాధారణం, ఆ హ్వానించదగ్గ విషయం. ఈ వ్యవహారంలో తొలి రాజకీయ లబ్దిదారు మమత కాగా, తొలిదెబ్బతిన్న నిర్వా సితులు మాత్రం నాడు అధికారంలో ఉన్న వామపక్షాలు కావడం విచిత్రం.

09/06/2016 - 23:48

రాజ్యాంగం దేశంలోని పాలకుల, పాలితుల సామాజిక సంవిధానం. ప్రవర్తన, పరివర్తన జీవనశైలికి క్రమవిధానం. రాజ్యాంగంలో నిక్షిప్తం చేయబడిన రిజర్వేషన్లు పీడితవర్గాల అభ్యున్నతికి, చైతన్యానికి సావకాశం. కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు వాటిపట్ల సానుకూలతలు, వ్యతిరేకతలు అనేది మూడు వేల ఏళ్లుగా సాగుతున్న చరిత్ర.

09/06/2016 - 23:47

విశాఖ సముద్రంలో ఔటర్ హార్బర్ ప్రాంతంలో నిర్మించిన బ్రేక్‌వాటర్స్ కారణంగా విశాఖ బీచ్‌కు పెనుముప్పు పొంచివుందన్న నిపుణుల హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయ. భీమిలి, ఋషికొండ ప్రాంతంలో ఇప్పటికే తీరం అధికభాగం కోతకు గురయ్యింది. ఎత్తయిన అలల సమయంలో కెరటాలు తీరంవరకు దూసుకువచ్చేస్తున్నాయి. ఇ.ఎఫ్.ఆర్.

09/05/2016 - 05:07

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ఉంచేందుకుగాను ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ జోనల్ వ్యవస్థ రాష్ట్రాన్ని ఏరకంగాను కలిపి ఉంచలేకపోయింది. కొద్దిమంది అధికారులకు పదోన్నతులు కల్పించటానికి మాత్రమే ఉపయోగపడింది. రాష్ట్రంలో జోనల్ అధికారుల పాత్ర కేవలం కర్రపెత్తనం చేయడానికే పరిమితమైంది. రాష్ట్భ్రావృద్ధిలో వారి పాత్ర శూన్యమని చెప్పవచ్చు.

Pages