S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

09/03/2016 - 07:18

శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రజాసమస్యలు దశాబ్దకాలంగా పడకేసాయి. ము ఖ్యంగా రాజాం-నగర పంచాయితీ పరిధిలో ఆర్. టి.సి. కాంప్లెక్సుల్లో సమస్యలు తిష్టవేసాయి. కాస్త వర్షానికే ద మ్ము మడిని తలపిస్తోంది. ప్రయాణికులు త్రాగేందుకు స్వచ్ఛమైన త్రాగేనీరు అందించే దాఖలాలులేవు. ఇక రా జాం మెయిన్‌రోడ్డు విస్తరణకాక నిత్యం చాలా ట్రాఫిక్ సమస్యలు ప్రజల్ని ఇబ్బంది కల్గిస్తుంది.

09/01/2016 - 23:34

తెలుగుకు ప్రాచీన భాష హోదాకు సంబంధించి భారతీయ భాషల ప్రాంతీయ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలి. 2008లో తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించింది. అయితే ప్రాంతీయ కేంద్రం ఇంతవరకు ఏర్పాటుకాకపోవడం తెలుగువారి దురదృష్టమని చెప్పాలి.

09/01/2016 - 00:25

నేటి ఆధునిక కాలంలో కూడ ఒక పంటను వేసుకొని ఏ రైతు అయినా నిబ్బరంగా బ్రతుకును వెళ్ళదీసింది లేదు. వాణిజ్య పంటలైన పొగాకు, ప్రత్తి పంటలను వేయరాదని ప్రభుత్వమే అంటున్నది. కాని ఇతర పంటలు పండించాలని రైతులకు అవగాహన కల్పించింది మాత్రం తక్కువే. పండిన పంటలను కోసి మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధర పలకదాయే. ఉన్న ఊళ్ళోనే పంటను నిలువచేసుకునే సదుపాయం లేదు. రైతులకు ఎక్కడా అప్పుపుట్టదు.

08/31/2016 - 04:18

హైబ్రీడ్ కూరగాయల సాగుకు రైతులిక స్వస్తిపలికి దేశవాళీ విత్తనాలనే ఎన్నుకొని సేంద్రియ ఎరువులతో కూరగాయ పంటలు పండించినట్లే రైతుకు లాభం. తినేవారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఇటీవలి కాలంలో విరగకాసి మార్కెట్‌లోకి వస్తున్న బెంగుళూరు హైబ్రీడ్ టమాటా కండపుట్టి వుందే తప్ప తినడానికి కాస్తనైనా పులుపు రుచి లేదు. అవి ఉడకడం కూడా లేదు.

08/29/2016 - 23:57

ప్రభుత్వం ఉచితంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తూ భోజనం పెడుతున్నది. పాఠ్యపుస్తకాలు ఇ స్తోంది. ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వపరమైనవే వద్దని వేల రూపాయల డొనేషన్లు కట్టి, ప్రతి ఏటా వేలాది రూపాయల వార్షిక ఫీజులు ఒకేసారి చెల్లించడానికి వెనుకాడని పేద, మధ్యతరగతి వర్గాల వారికి, ప్రైవేటును ఆశ్రయించే వారికి ప్రభుత్వపరంగా ఉపకార వే తనాలు ఎందుకు ఇవ్వాలి?

08/29/2016 - 00:28

ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని కోట్లాది మంది ఆంధ్రులు ధర్నాలు, నిరసనలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న విభజన బిల్లు ఆమోదించారు. 01-4-2014 కేంద్ర మంత్రి వర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఐదు కాదు, పది సంవత్సరాలు అడుగుతామని రాజ్యసభ దృశ్యాలు, వార్తలలో అందరూ చూసినదే.

08/27/2016 - 07:30

రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడలో రజతం సా ధించిన తెలుగమ్మాయ సింధు యావద్దేశానికే స్పూర్తి నిచ్చింది. ముఖ్యంగా భారీ సంఖ్యలో క్రీడాకారులు రియో దారి పట్టినా, చివరి వరకు ఒక్కపతకమైనా వచ్చే సూచ నలేవీ దరిదాపుల్లో లేనప్పుడు ముగ్గురు మహిళల విజ యం దేశం పరువు నిలబెట్టింది.

08/25/2016 - 23:51

దేశంలో బాల కర్మికుల వ్యవస్థ లేకుండా చేస్తామని ప్రభుత్వాలు బీరాలు పలుకుతున్నాయి. కాని ఆచరణలో దారుణంగా విఫలవౌతున్నాయని అంతర్జాతీయ బాలల ప్రాథమిక హక్కుల పరిరక్షణ సంఘం తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. గత మూడేళ్లలో స్కూలు డ్రాపవుట్ల సంఖ్య 19 శాతం పెరిగింది. గ్రామీణ బాలల పరిస్థితి మ రింత దారుణంగా వుంటోంది.

08/24/2016 - 23:59

నేటి సమాజంలో పిల్లలు, యువత పయనమెటుపోతున్నదో తెలియడం లేదు. తెగిన గాలి పటంలా ఉంటుం ది వారి గమ్యం. టీ.విలు, కంప్యూటర్లు, మొబైల్ గేమ్స్, సోషల్ నెట్‌వర్క్‌లకు బానిసలై విలువైన సమయాన్ని ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. రోజురోజుకూ వస్తున్న కొత్త గేమ్‌లు, రియాలిటీ షోలా ఉన్న గేమ్‌లు పిల్లలకు, యువతకు మత్తు పదార్థాల కన్నా ఎక్కువ చేటు చేస్తున్నాయి.

08/24/2016 - 07:43

ఆలయాల, మఠాల, సత్రాల భూములు ఆం.ప్ర. వారు 2000 ఎకరాల వక్ఫ్ ఆస్తులను గుర్తించి రు.1,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని రాబట్టబోతున్నారు. అదేవిధం గా ఎన్నో వేల ఎకరాల ఆలయాల, మఠాలు సత్రాల భూ ములు అన్యాక్రాంతంలో ఉన్నాయి. వీటిని కూడా గుర్తిం చి, పూర్తి ఆదాయాన్ని రాబట్టవచ్చు. ఈవిధంగా చేస్తే హిం దూ ధర్మప్రచారం ఇంటింటా ప్రచారం జరిగి హిందూ ధర్మాన్ని రక్షించవచ్చు.

Pages