S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

04/06/2016 - 07:09

మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావడం పలువురిని కలవరపెడుతున్నది. ఎన్ని దుర్ఘటనలు జరిగి, ఎంతమంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలసినా వీటిని అదుపులో పెట్టలేకపోవడం అధికారుల వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. కేవలం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనో, టోల్‌గేట్ల వద్దనో డ్రైవర్లకు మద్యం పరీక్షలు నిర్వహించినంత మాత్రాన ప్రమాదాలు ఆగిపోవు.

04/04/2016 - 23:31

జాయిష్ ఏ మొహమ్మద్ జిహాదీ ముఠాకు చెందిన మొదటి హంతకుడు మసూద్ అఝార్‌ను ఐక్యరాజ్యసమితిలో నిర్లజ్జగా సమర్ధించడం ద్వారా చైనా ప్రభుత్వం మరోసారి మనదేశంపై విషం కక్కింది! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత భారత వ్యతిరేక జిహాదీ ఉగ్రవాదాన్ని ఇలా చైనా ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపైన సమర్ధించడం ఇది మొదటిసారి కాదు! పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను మనదేశంపైకి ఉసిగొల్పుతుండడం దశాబ్దుల చరిత్ర!

04/04/2016 - 23:24

విజయవాడ నగరంలో బిచ్చగాళ్ల బెడద ఇటీవలి కాలం లో బాగా ఎక్కువయ్యింది. 2014 గణాంకాలతో పోలిస్తే వీరి సంఖ్య 30 శాతం పెరిగింది. ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి మొదలైన భిక్షాటన నేడు ఆదా య వనరుగా మారింది. పొట్టకూటికోసం యాచన చేసే వృద్ధుల జాబితాలో యువతీయువకులు కూడా చేరిపోతున్నారు. రకరకాల కారణాలు, క్రొత్త వేషాలతో భిక్షాటనకు దిగుతున్నా రు.

04/04/2016 - 06:31

దేశాన్ని పారిశ్రామికాభివృద్ధి పధంలో పరుగులెత్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన పారిశ్రామిక విధానం అద్భుతంగా వుంది. పరిశ్రమల స్థాపన అనేది వివిధ రకాల అనుమతులతో కూడిన ఒక సంక్లిష్ట ప్రక్రియ. దేశం ఆర్థిక పుష్టి గడించాలంటే పారిశ్రామిక సరళీకృత విధానాలు తక్షణం అమలుచేయాలని రతన్‌టాటా 2010లోనే సమర్పించిన నివేదికను గత పాలకులు బుట్టదాఖలు చేసారు.

04/02/2016 - 02:35

భారతీయ ఆథ్యాత్మిక విలువలు, ప్రాధాన్యతలపై దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ముందు తరాల వారిని ధర్మాచరణ దిశగా నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఆథ్యాత్మిక దినోత్సవంగా నిర్వహించేందుకు నిర్ణయించడం ముదావహం.

04/01/2016 - 00:09

పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జన్మదిన కానుకగా వృద్ధులకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించబడింది. సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర రోడ్డు రవాణా బస్సుల్లో రాయితీ లేదు ఇప్పటివరకు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రైల్వే శాఖ కొన్ని రాయితీలు ఇవ్వడం లేదా? వృద్ధులకు సదుపాయాలు కల్పించండి.
- బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ

03/31/2016 - 00:13

ఈమధ్య భావ ప్రకటనా స్వేచ్ఛపై వాదోపవాదాలు చాలా జరుగుతున్నాయ. ప్రభుత్వంలో ఉన్న పార్టీవారు అసహనంతో ఉన్నారంటూ నిందిస్తున్నారు. ఈమధ్య కన్నయ్యకుమార్ సభలో ఒక యువకుడు భారత్ మాతా కీ జై అని నినదించినందుకు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు. అంటే అసహనం ఎవరికి ఉన్నదో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది తమకుమాత్రమే ఉన్నదని, ఉండాలని సోకాల్డ్ ఉద్యమ కారులు భావించడం సరైనది కాదు.

03/29/2016 - 23:42

హిందువులకు ఇల్లు అద్దెకివ్వకపోవడం, స్నేహితులు వెడ్డింగ్ కార్డు యిస్తే వాటిమీద హిందూ దేవుళ్ల చిత్రం ఉంటే బయట పారేయడం, మర్యాదకైనా పండ్లు ఇస్తే ప్రసాదం కాదుకదా అనడం, వంటివి చూస్తుటే క్రైస్తవుల్లో అసహనం ప్రస్ఫుటమవుతోంది. మరి క్రైస్తవ సాహిత్యాన్ని బస్సు ప్రయాణికులకు, రైతుల బజారులోని రైతులకు పంచిపెట్టడం ఒప్పా?

03/29/2016 - 01:51

కాదు కాదు! కాల్పనికత-
కనిపించే వాస్తవికత-
భారతీయ సోదరా! బహుపరాక్! బహుపరాక్!-
వాస్తవికతను గుర్తించు-
వివేకంతో ప్రవర్తించు!-
శరీరంలో పైత్యతత్వం ప్రకోపిస్తే-
పిచ్చితనం తలకెక్కుతుంది-
ఉచ్ఛనీచాలు మరచిపోతాడు-
పిచ్చివాగుడు పెచ్చరిల్లి-
నడివీధిలో నగ్నంగా తిరుగుతాడు-
కనిపించిన వారి నెల్లా రక్కుతాడు-
విషాన్ని కక్కుతాడు-

03/28/2016 - 01:56

జెఎన్‌యుకు కాదేదీ అనర్హం. నిరోధ్‌లు, డ్రగ్‌లు, దేశద్రోహులకు జిందాబాద్‌లు. పేరు సబర్మతీ దాభా. హాస్టల్ గోడలపై ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా పోస్టర్లు ప్రత్యక్షం. గంగా దాభా వేదికగా కన్హయ్య కుమార్ జాతివ్యతిరేక ప్రసంగం. మొన్నటికి మొన్న ఓ ప్రొఫెసర్ మణిపూర్‌ను చైనాలో విలీనం చేయమని ప్రసంగం.

Pages