S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

05/11/2016 - 02:36

ముస్లిం స్ర్తిలు మసీదుల్లో ప్రవేశం గురించి ఇటీవల కొత్తగా వివాదం తలెత్తింది. అంతేకాక ఇటీవల కేరళలోని ఓ మసీదులో స్ర్తిలను అనుమతించడం వంటి వార్త ఆశ్చ ర్యం కలిగించింది. ఇది కొత్త విషయం కాదు. ఎందుకంటే ముస్లిం స్ర్తిలు మసీదుల్లో ప్రవేశించి నమాజు చేసుకోవడం చాలాచోట్ల జరుగుతున్నదే. అంతెందుకు..హాజ్‌కు వెళ్లినప్పుడు పవిత్రమైన మక్కాలోని ప్రసిద్ధి చెందిన మసీదులో స్ర్తిలకు ప్రవేశం ఉంది.

05/09/2016 - 23:30

ఒకనాడు ఉపాధ్యాయులను తమ బిడ్డలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేవారి వారిగా ఎంతో గౌరవభావంతో మెలిగేవారు. తమ పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఉపాధ్యాయులే పునాది అని భావించేవారు. అలాగే టీచర్లు కూడా అంకిత భావంతో విద్యార్థులను తమ సంతానంగా భావించి చదువు నేర్పేవారు. బెత్తానికి పనిచెప్పి శిక్షించినా తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ బిడ్డల అభ్యున్నతిని ఆశించేవారు.

05/09/2016 - 07:28

విశాఖ నగరానికి దీటుగా గాజువాక పారిశ్రామిక ప్రాం తం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అంతే స్థాయిలో భద్రతా పరంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడి పరిశ్రమల్లో తరచుగా ప్రమాదాలు సంభవిస్తుండడడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల దువ్వాడ సమీపంలో బయోమాక్స్ బయోడిజిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది.

05/06/2016 - 00:48

గత పదిరోజులుగా కాంగ్రెస్ దాని తోకపార్టీలైన జెడి(యు), సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, వామపక్షాలు ఒక ప్రశ్నను చిలకపలుకుల్లా వల్లిస్తూ వస్తున్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి ముడుపులు అందుకున్న వారిని బయటకు లాగడంలో ఎన్‌డిఎ ప్రభుత్వం చేస్తున్నదేమిటంటూ అవి ప్రశ్నను సంధిస్తున్నాయి.

05/06/2016 - 00:42

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి. కొన్ని తరగతి గదులను కొందరు ఊరిపెద్దలు తమ నిర్మాణ సామగ్రిని దాచుకోవడానికి ఉపయోగిస్తుండగా, మరికొన్ని గదులలో పేకాట ఆడుకోవడం, తాగడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రహరీ గోడలు లేక పశువులు హాయిగా సంచరిస్తూ శుభ్రతను పాడుచేస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు.

05/05/2016 - 06:42

కృపాల్‌సింగ్..!ఎక్కడా, ఎప్పుడూ ఈ పేరు వినలేదే. ఓహో-1992వ సంవత్సరం వాఘా వద్ద సరిహద్దులు దాటుతుండగా భారత్ గూఢచారేమోనని పాకిస్తాన్‌వారు అతన్ని బంధిం చి వారి జైల్లోపెట్టారా? 2016 ఏప్రిల్ 13న అయిదుపదుల వయసులో అనారోగ్యంతో మరణించాడా? అయ్యో పాపం. ఈ పాతికేళ్ళు పాలించిన ఏ ఒక్క భారత ప్రభువుకు ఈ సంగతులు తెలియవా!

05/04/2016 - 07:03

హిందూమతాన్ని ప్రతి హిందువు ఆచరించాలి. కేవలం విగ్రహారాధన వల్ల ప్రయోజనం లేదు. పురాణ పఠనం, ప్రవచనం లాంటివి ప్రతిదేవాలయంలో ఉండాలి. సీతారాముల కల్యాణం, శ్రీభూ సమేత వరాహస్వామి, లక్ష్మీనరసింహ స్వామి పూజలు నిర్వహించాలి. ప్రలోభాలకు లొంగి మతం మార్చుకొనకూడదు. మత మార్పిడుల వల్ల హిందూ సంస్కృతి దెబ్బతింటుంది. ఎవరి మతాలు వారు అనుసరించాలి. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి.

05/03/2016 - 00:36

హైదరాబాద్‌లోని పార్కులలో కొన్ని సరైన పర్యవేక్షణ లేక దుస్థితిలో ఉన్నాయి. చెత్తాచెదారం వలన ఉద్యానవనాల్లోకి వెళ్లాలంటేనే చాలామంది జంకుతున్నారు. మొక్కలు, చెట్లు ‘పోషణ’ లేనందువలన శోషిల్లుతున్నాయి. పరిసరాల నుండి శబ్దకాలుష్యం ఇతర కాలుష్యాలు ఎలాగూ తప్పవు. కొన్ని పార్కులకైతే ప్రహరీగోడలు కూడా లేవు. కాపలాదారులు ఉన్న పార్కులలో ప్రేమికులు అనబడేవారి వెకిలి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. కాపలావారకి లంచాలే లంచాలు!

05/02/2016 - 05:18

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమాన్యం (అసలు యజమానులు ప్రజలే) నిర్వహణా వ్యయాలు తగ్గించుకోకుండా నష్టాలు పూడ్చుకోవటానికి అంటూ చీటికి మాటికి ప్రజలపై భారం మోపుతున్నది. తాజాగా చార్జీలు పెంచకుండా ప్యాసింజర్, నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య తగ్గించి పాతబడిన లగ్జరీ బస్సులకే వీడయోలు ఏర్పాటుచేసి నాన్‌స్టాప్ సర్వీసులుగా తిప్పుతూ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు.

04/29/2016 - 23:41

ఏప్రిల్ 23న ఎంవిఆర్ శాస్ర్తిగారు తన ‘ఉన్నమాట’లో మత సంప్రదాయాలపై చక్కగా విశే్లషించారు. కోర్టులు విపరీతంగా స్పందిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. అయతే ప్రభుత్వాధికార్లు ఇందుకు తక్కువ తినలేదు. అయన వాళ్లకు ఆకుల్లోను, కానివాళ్లకు కంచాల్లోను అన్న అన్న నానుడిని కచ్చితంగా నిజం చేస్తున్నారు.

Pages