S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/23/2016 - 00:19

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు ఉద్యోగస్తులకు, పెన్షనుదారులకు ఐదారు నెలలక్రితమే హెల్త్‌కార్డులు ఇచ్చినప్పటికీ వానికి ఇంతవరకూ మోక్షానికి నోచుకోలేదు. ఇంతవరకు ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆ కార్డులకు విలువ ఇవ్వడంలేదు. ప్రభుత్వ పరిపాలనకు విలువలేనపుడు సా మాన్యుని గతేమిటి?

03/22/2016 - 00:27

పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జాతీయ జెం డాను రూపొందించినవాడు. స్వాతంత్య్ర సమరంలో ఆయన నిర్వహించిన విశిష్ట పాత్ర, జవహర్‌లాల్‌నెహ్రూ, సర్దార్ పటేల్, మహాత్మాగాంధీల ప్రశంసలందుకుంది. ఆయన జగద్గురు శంకరాచార్య భక్తుడు కూడ. ఆయన తన జీవితంలో ‘మానవ సేవయే మాధవ సేవ’ అనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటించినవాడాయన. అంత చేసి ఆయన పేదరికంలోనే మరణించారు.

03/21/2016 - 01:04

ఈనెల 12న ప్రచురితమైన ‘ఉన్నమాట’లో ప్రతి మాట వాస్తవాల మూటే. ఇతర మతాలవారిని ఏ స్వల్ప కారణం గా నైనా నిందారోపణ చేస్తే అది నిప్పుకణమై దేశానే్న దహించే ప్రయత్నం చేస్తుంది. దానికి ఇతర మతాలవారు దన్నుగా నిలుస్తారు. కాని పెద్ద దురదృష్టమేమంటే హిందూమతమే హిందువులతో సహా అందరకూ లోకు వైపోయంది. ఈ హిందూ అనైక్యతే దేశాన్ని విచ్ఛిన్నం చేసి పరపాలనపాలు చేసిందని చరిత్ర చాటి చెబుతోంది.

03/18/2016 - 23:45

ఆనాడు తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, జీడిగుంట రామచంద్ర, పన్యాల రంగనాథంగార్లు ఆకాశవాణి ద్వారా వార్తలను చదువుతుంటే శ్రోతలకు వీనులవిందుగా ఉండేది. వీరి కంఠం మృదు మధురంగా ఉండేది. కాని ఈనాడు వార్తలు చదువుతుంటే అపశ్రుతులు, కొన్ని అక్షరాలు పలుకక పోవడం అర్ధరహితముగా ఉండటం ఎంతో విచారకరం!
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
చారిత్రక కట్టడాన్ని కాపాడాలి

03/18/2016 - 00:08

ఆర్టీసి బస్సులు సమయానికి రాకపోవడం, వచ్చినా కిక్కిరిసి ఉండడం, మరి కొన్నిచోట్ల బస్సు సౌకర్యాలు లేకపోవడం వలన చాలామంది ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ అవకాశాన్ని కొంతమంది ఆటోడ్రైవర్లు సొమ్ముచేసుకుంటున్నారు.

03/17/2016 - 06:40

క్షణికావేశంలో విలువైన జీవితాన్ని ఆత్మహత్య పేరుతో చిదిమేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మార్కులు సరిగ్గా రాలేదనో, అమ్మనాన్నలు తిట్టారనో, ప్రేమించే అమ్మాయి తిరస్కరించిందనో లాంటి చిన్నచిన్న కారణాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం.

03/16/2016 - 00:54

ప్లాస్టిక్, పాలిథీన్ వస్తువులు మన సమాజంలో వికృతంగా మారి ఈసారి ఏకంగా గణతంత్ర దినోత్సవంరోజు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ జెండాలే దర్శనమిచ్చాయి. కాగితం జెండాల స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమించేసింది. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర ప్రైవేటు స్థలాల్లో జాతీయ పతాకాలు ఎగురవేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే అలంకరణకోసం తోరణాలుగా కట్టిన ప్లాస్టిక్ జెండాలు కిందపడి చెత్తాచెదారంలో చేరిపోతున్నాయి.

03/15/2016 - 01:21

తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రకటించడంతో ఈ ప్రదేశాలలో ఒక్కసారిగా భూములకు రెక్కలొచ్చాయ. కార్పొరేట్ సంస్థలు,పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు ఇక్కడ గ్రామస్థుల నుండి నయానో, భయానో భూములను కొనడానికి యత్నిస్తున్నారు. అమ్మడానికి ఇష్టపడని రైతులపై ఏదోరకంగా వత్తిళ్లూ తెస్తున్నారు.

03/14/2016 - 00:42

2016...17 తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ప్రారం భిస్తూ గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వం లక్ష్యా లను ఉభయ సభల్లో ఆవిష్కరించిన తీరు బాగా ఉంది. తాగునీరు, సాగునీరు, నీటి ప్రాజెక్టులు, జలవనరుల వినియోగం, మిషన్ కాకతీయ రెండోదశ కార్యక్రమాలు, మిషన్ భగీరథ లక్ష్యాల సాధన దిశగా కదిలితే బంగారు తెలంగాణ సాధ్యమే. నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ లక్ష్యాలను అమలు చేయాలి.

03/11/2016 - 23:54

రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్‌లు సమర్పించారు. కాని ఆంధ్రప్రదేశ్‌కు గాని, మధ్యతరగతి ప్రజలకు గాని, పేదలకు గాని, నిరుద్యోగులకు గాని మేలు జరిగింది లే దు. ముఖ్యంగా ఆంధ్రకు ఇస్తామన్న విశాఖ రైల్వేజోన్ మాట లేదు. ప్రత్యేక హోదా వూసే లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర కరువు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు లేవు. మన ముఖ్యమంత్రి నోరు మెదపలేదు. వెంకయ్యగారు మాట్లాడలేదు.

Pages