S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/07/2016 - 04:49

మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారు. మనదేశం వ్యవసాయ దేశం అని మరిచిపోయారు. వ్యవసాయం అభివృద్ధి చెందకపోతే దేశం అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడుతుందనే విషయం మరిచారు. దేశ ప్రజల దైన్య స్థితిని మరిచిపోయారు. ఈ ప్రభుత్వాలు రెండు వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు మరిచి ప్రజలను మభ్యపెడుతున్నారు.

03/04/2016 - 23:28

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2015 డిశంబరు నాటికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు రెండు విడతల డిఎ వాయదాలు ఇవ్వవలసి ఉన్నది. డిఎ ఇవ్వనందువల్ల ముఖ్యంగా పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి పెన్షనర్ల ఇబ్బందులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు రిటైరై ఉన్నారు కదా. డిఎ విడుదలకు ఏడాది కాలం ఎందుకు పట్టిందో అర్థం కాదు. రాష్ట్ర విభజన కారణమా? ఆర్థిక దుస్థితి కారణమా?

03/04/2016 - 06:27

తొలగని తోడేలు పేరిట ప్రచురితమైన సంపాదకీయం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్రవాదుల దాడులకు ఆస్తినష్టం ప్రాణనష్టం బాగా జరుగుతోంది. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో తీవ్రవాదుల దాడులను అరికట్టడం సాధ్యం కాదు. కార్యశీలత కావాలి.

03/03/2016 - 05:51

ఇటీవల డిఎస్సీ పరీక్షా విధానంలో వికలాంగులకు వారికి కొన్ని స్థానాలను కేటాయించటంలో పక్షపాత వైఖరి కనిపిస్తున్నది. వికలాంగులకు నిర్ణీత సంక్షేమ పథకాల నిర్వహణ మరి ఉద్యోగ నియామక విధానాలు కేవలం చట్టాలకే పరిమితమైనాయ తప్ప, అమలుకు నోచడం లేదని స్పష్టవౌతోంది. ఇప్పటికైనా ఏ కులం వారైనప్పటికీ రిజర్వేషన్ సదుపాయమున్న వికలాంగులకు న్యాయం చేకూరుతుందా?
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

03/02/2016 - 04:53

ప్రజలకోసం ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు (వీరందరు పబ్లిక్ సర్వెంట్స్‌గా పిలువబడుతారు) ఎన్నో చట్టాలు చేసారు. చేస్తున్నారు. ఆ చట్టాలలో ఉన్న సెక్షన్లు, జివోలు ప్రజల పాలిట యమపాశాలుగా, ఉరితాళ్ళు అవుతున్నాయి. ఈ చట్టాల ఉరితాళ్ళు పబ్లిక్ సర్వెంట్సు చేతుల్లో పగ్గాలుగా ఉన్నాయి. వీటితో ప్రజలను బెదిరించి లంచాలు పిండుతున్నారు. తనకు న్యాయం ప్రకారం రావలసిన దానికోసం ఏ ఒక్కరు లంచం ఇవ్వరు.

03/01/2016 - 06:30

దేశభక్తీ! మేలుకో! ధీశక్తిని మేలుకొలుపు
కానీ కాదిది కవిత! జరుగుతున్న వాస్తవికత
సగటు భారతీయుని మనసులోని వ్యధ
నవ భారత యువ సమాజామా!
భావి భారత ప్రజానీకమా!
చూస్తున్నారా? మీరంతా?
స్వతంత్ర భారత ప్రజాస్వామ్యపు వింత
ధనానికి ధర్మం దాసోహం
దానికి తోడు పదవీ వ్యామోహం
తరతరాలు అనుభవించినా తీరని అధికారదాహం

02/26/2016 - 23:49

ప్రభుత్వం ప్రాథమిక ఉన్నత పాఠశాలలు మూడు పూవులు ఆరు కాయలుగా గతంలో వికసించాయి. కాని నేడు పేరుకు మాత్రం గ్రామాల్లో రెండుమూడు ప్రాథమిక పాఠశాలలు వెలిశాయి. కాని ఫలితం శూన్యం! ప్రభుత్వానికి విపరీత నష్టం. అలాగే ఉన్నత పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు కోకొల్లలు! కాలక్షేపానికి మాత్రం కనిపిస్తున్న వీటిని ఎవరు పట్టించుకొన్నట్లు?

02/26/2016 - 06:18

అనుక్షణం భారత్‌లో తాను పాలుపోసి పెంచిన ఉగ్రవాదుల చేత మారణకాండ ఎలా జరపాలా అని మంత్రాంగం చేసే పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు మన ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం చూపుతోందో అర్ధం కావడం లేదు.

02/25/2016 - 00:22

విద్యాలయం ఒక దేవాలయం. జాతికి భవిష్యత్తు నాయకులను ఇచ్చి మానవ విలువలను, జాతి సంస్కృతిని పదిలపరచే పవిత్ర స్థలాలు. వీటిలో మత, జాతీయ, మానవతా విలువలుకు భంగపరచే ఎలాంటి కార్యక లాపాలను అనుమతించరాదు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని కదా వేదవాక్కు. విద్యార్థులు, అధ్యాపకులు, సహనానికి జాతీయ సమైక్యతకు పెద్దపీట వేయాలి. దేశ విచ్ఛిన్నతకు, దేశభక్తిని భంగపరచే కార్యక్రమాలను నిషిద్ధాలు.

02/24/2016 - 06:51

ఇది మినీ కవిత! కాదంటే వాస్తవికత
భారతీయ సోదరా! బహుపరాక్!
జాగో! జాగో! జగాతే రహో!
భారతీయ ప్రజాస్వామ్యం పరిహసించబడుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన సేచ్ఛ రంకుతనం పాలవుతోంది.
‘‘వ్యక్తి స్వేచ్ఛ’’ అనే బంగారు జింకగా మారి
మారీచ రాక్షసులు మాయలు పన్నుతున్నారు
గాలి, వెలుతురు కోసం ఇంట్లో పెట్టిన వెంటిలేర్లు సక్య ముల పాములకూ వారసత్వపు తేళ్లకు దారిగా మారాయ

Pages