S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/30/2015 - 06:19

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడం అభినందనీయం. అయితే ప్రణాళికా లోపంవల్ల అందరికీ పండుగలా ఉండవలసిన కార్యక్రమం, ప్రభుత్వానికి ప్రదర్శన వేదికగా, పిల్లలకు వారి తల్లిదండ్రులకు పరుగుల పందెంగా తయారైంది.

11/28/2015 - 04:27

ఎం.వి.ఆర్. శాస్ర్తీగారు రచించిన వంకర టింకర సెక్యులరిజం వ్యాసంలో ఓట్లకోసం రాజకీయ నాయకులు సర్కస్‌ఫీట్లను చక్కగా వివరించారు. కర్ణాటక ముఖ్య మంత్రే స్వయంగా గోమాంస భక్షణకై లొట్టలేస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం. రాబోయే కాలంలో సున్తీ చేయంచుకుంటే తప్పేంటి? ఆరోగ్యకరం కాదా? అని రాజకీయ నాయ కులు సన్నాయనొక్కులు నొక్కినా ఆశ్చర్యం లేదు.

11/27/2015 - 05:44

ప్రభుత్వం అధికారికంగా పండుగలూ, ఉత్సవాలూ నిర్వహించడం, విందులూ, దుస్తులు పంచిపెట్టడం, కులం మతం ప్రాంతం పేరుతో నజరానాలు, భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నది. ఇవేమీ ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు కానేకావు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల విశ్వాసం కలిగి మరోసారి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అధినేతతో మాట్లాడేందుకు మంత్రులకే అపాయంట్‌మెంట్ లభించడంలేదు.

11/26/2015 - 04:57

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలంగాణలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యూనివర్సిటీ ప్రస్తుతం లేదు. అదేవిధంగా హైదరాబాద్‌లో ఉన్న తెలుగు అకాడమీ కూడా తెలంగాణకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది లేదు. ఇక ఉర్దూ అనేది జాతీయ భాష కాదు.

11/25/2015 - 04:59

దేశంలో ప్రస్తుతం 30వేల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇవి ప్రజా జీవితంలో దాదాపు అన్ని పార్శ్వాలను స్పృజిస్తున్నాయి. ఉదాహరణకు గోహత్యను దాదాపు 12 రాష్ట్రాలు నిషేధించినప్పటికీ, చట్టం మాత్రం అమలు కావడంలేదు. అదేవిధంగా వరకట్న నిషేధ చట్టం, జంతువుల హింస నిషేధ చట్టం, తప్పుడు మార్గాల్లో మత మార్పిడులు వంటివి.

11/24/2015 - 05:39

మంత్రి గంటా శ్రీనివాసరావు రైతు బజార్లు, మార్కెట్లను చుట్టేసి హడావిడి చేసి కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మగ్గపెట్టేవారిపై చర్యలు తీసుకున్నారు సరే. కాని అవి తాత్కాలికమే అయ్యాయ. మళ్లీ అక్రమ వ్యాపారులు విజృంభిస్తున్నారు. పాత విధానంలోనే పండ్లను మగ్గపెట్టడం కొనసాగిస్తున్నారు. దయచేసి మంత్రివర్యులు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా తీసుకున్న చర్యలు శాశ్వతంగా ఉండిపోయేకా చూడాలి.

11/23/2015 - 04:57

‘స్వచ్ఛ్భారత్’ ఆశయం తప్పక నెరవేరుతుంది. ప్రధానమంత్రి కల - చెదిరిపోదు - కాని పెద్దలు చాలా మంది వారి అభిప్రాయంలో ఒకరు దానికి ప్రణాళిక కావాలి, ప్రచారం మాత్రమే చాలదని, మరొకరు ఆర్భాటమని, ఇంకొకరు ఆరాటమని వెలిబుచ్చారు. అందరూ తమ అభిప్రాయాలలో ‘స్వచ్ఛత’కు వ్యతిరేకులు కారని గమనించాలి.

11/20/2015 - 23:27

సెక్యులరిస్టు అంటే హిందూ వ్యతిరేకమా? లేక, హిం దువులను హతమార్చడమా? సెక్యులరిజం అంటే అనిన మతాలను సమానంగా చూడటం కదా. అది అలా ఉం చితే, టిప్పు సుల్తాన్ నాటి టెర్రరిస్టు అని చెప్పక తప్పదు. ఎక్కువగా నంబూద్రి బ్రాహ్మణులను ఇస్లాంలోకి బల వంతంగా చేర్పించడం, మారని వేలాది మందిని హత మార్చడం జరిగింది. మలబార్ ప్రాంతంలో లక్షలాది మం ది హిందువులను బలవంతంగా మతం మార్చినట్టు తెలు స్తున్నది.

Pages