S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

02/17/2016 - 07:51

ఇటీవల జంటనగరాల్లో ఇంటినుండి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానికి రెండు డబ్బాలను ఇంటింటికి ఇచ్చారు. చెత్తను మీ ఇంటినుంచే సేకరిస్తామన్నారు. ఇప్పుడు చెత్త సేకరించిన వారికి ప్రతినెలకి ఇంటికి ఫ్లాట్‌కి రూ.50 ఇవ్వాలని చెత్త తీసేవారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏదైనా సర్క్యులర్ ఉన్నదా అని అడగాలంటే వీళ్ల బాస్ ఎవరో తెలియదు. అలా ఇవ్వకపోతే చెత్త సేకరించం అంటున్నారు.

02/15/2016 - 23:30

మజ్లిస్ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తుందా? ప్రశ్నార్థకమే. బీఫ్ తినాలంటే మజ్లిస్‌కే ఓటు వేయాలంటూ చేసిన ప్రచారం విడ్డూరంగా ఉన్నదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మజ్లిస్ ఆవిధంగా ప్రచారం చేయడం విడ్డూరం మాత్రమే కాదు అవివేకం కూడా. తాగునీరు, విద్యుత్ సమస్య మొదలైన జీవనానికి సంబంధించిన నినాదాలుండాలి కాని, ‘బీఫ్’ ఆఫర్ ఏమిటి?

02/15/2016 - 01:24

పేదరికం, నిరక్షరాస్యత మరియు జన సమూహం నుండి దూరంగా ఉండటంవల్ల ప్రాథమిక వైద్య సదుపాయాలు వినియోగిచకపోవడం వల్ల ఆదివాసీలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు ఎదుర్కొంటున్న ముఖ్య ఆరోగ్య సమస్యలుగా సికిల్‌సెల్ ఎనిమియా, మలేరియా, డెంగ్యూ, అతిసార వ్యాధి, క్షయ, హెపటైటిస్, ధాలిసీమియా మరియు ఇతర జన్యుసంబంధిత వ్యాధులు ఉన్నాయి.

02/12/2016 - 22:49

కేంద్రం గుప్పిట్లో ఉండిపోతున్న గవర్నర్ వ్యవస్థ వల్ల ఆర్థిక భారం తప్ప లాభం లేదు. కాబట్టి రద్దు చేయడమే మంచిదన్న సిపిఐ నారాయణ మాట అక్షర సత్యం. మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉండవలసిన రాజ్యసభ, విధాన మండళ్లు రాజకీయ తైనాతీలు, ఎన్ని కల్లో చెల్లని ముఖాలకు స్థావరాలుగా మారిపోయాయ. వారిపై కోట్లాది రూపాయలు ఖర్చు అవుతోంది. వాళ్లు చేస్తున్న ఘనకార్యమేంటి?

02/12/2016 - 05:29

ప్రపంచం మొత్తం అతను జీవించాలని ఎంతో ఆశగా ఎదురు చూసింది. తాను నమ్మిన దేవుడినల్లా ప్రార్థించింది. మంచు చరియల కింద కూరుకుపోయిన మన జవాన్లను కాపాడటం కోసం సైన్యం ఎంతగానో కృషి చేసింది. ఆరురోజుల తర్వాత జవాన్ల మృతదేహాలను కనుగొన్న సైన్యానికి లాన్స్ నాయక్ హనుమంతప్ప మాత్రం జీవించి ఉండటం ఉత్సాహాన్ని నింపింది. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను ఢిల్లీలోని ఆర్‌ఆర్ ఆసుపత్రికి తరలించారు.

02/11/2016 - 08:25

న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులు అది ఒక్కోసారి సంధించే ప్రశ్నలు ప్రజల్ని అయోమయంలో పడేస్తాయ. దైవదర్శనానికి వచ్చే స్ర్తిలు సంప్రదాయ దుస్తులు ధరించాలని, పురుషులు పంచెకట్టుతో రావాలని కొన్ని ఆ లయాలు నిర్దేశించగా మత విశ్వాసాల్లో కోర్టులు కలుగజేసుకోవని సుప్రీంకోర్టు చెప్పిందొకసారి. ఇప్పు డేమో శబరిమలలో స్ర్తీలకు ప్రవేశం నిషేధించడం రాజ్యాంగ బద్ధం కాదు కదా అని కోర్టు ప్రశ్నిస్తున్నది.

02/10/2016 - 04:45

ఢిల్లీలో ఎన్‌సిఈఆర్టీ మాదిరిగానే హైదరాబాద్‌లో ఎస్‌సిఈఆర్టీ కార్యాలయం లాల్‌బహదూర్ స్టేడియం వద్ద ఉన్నది. హైదరాబాదు రామకృష్ణ మఠంలోని స్వామీ జీలతో కలిసి ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు బోధనకు ఉపయోగపడేవి ఏరి వాటిని రాష్ట్ర సిలబస్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఎస్‌సీఈఆర్టీ డైరెక్టరు ను కలిసి వారికి వాటి సెట్ ఇచ్చి సిలబస్‌లో చేర్చమని అభ్యర్థించాము. సుమారు పదేళ్ల క్రితం ఇది జరిగింది.

02/08/2016 - 01:28

నా తెలంగాణా
కోటి రతనాల
వీణ గర్జించిన
శ్రీ దాశరధి అ
మృత సుధాధా
రలు కురిసిన
సాహిత్యం
భువియందు
కాంతి పుంజము
ప్రకాశితమై తెలుగు
కవిత్వంబునకు వనె్నదెచ్చె
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

02/05/2016 - 23:39

రాజస్థాన్‌లో సూర్యప్రతాప్ సింగ్ రాజవత్ లాగా దీనా నాథ్ బాత్రా తన 85వ ఏట కూడా విద్యారంగ సంస్క రణలపై అలుపెరుగని కృషి చేస్తున్నారు. సోనియా విజాతీయురాలి కనుసన్నలలో మానవ వనరుల శాఖా మంత్రి అర్జున్ సింగ్, రొమెల్లా థాఫర్, ఇర్ఫాన్ హబీబ్, సెక్యులర్ పేరుతో ఎన్.సి.ఆర్.టి. సంస్థను ‘సిక్’ చేశారు. వామపక్ష చరిత్రకారులకు పట్టం కడితే ఎడమ చేతివాటానికి పని కల్పించారు.

02/05/2016 - 06:03

‘భారతరత్న’ బిరుదు ఇవ్వడానికి అర్హత ఏమిటి? యోగ్యత ఏమిటి? ఎందుకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఈమధ్య ‘భారతరత్న’ హోదా విచక్షణారహితంగా ఎవరికి పడితే వారికి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో తెలియడం లేదు. ‘భారతరత్న’ పురస్కారం అత్యంత గౌరవప్రదమైన, ఉన్నతమైన పురస్కారంగా చెబుతున్నారు. కాని, జన బలం, ధన బలం, రాజకీయ పలుకుబడి బట్టి, కేవలం సిఫార్సుబట్టి, రాజకీయమైన ప్రలోభంతో ఇస్తున్నట్లుగా తోస్తున్నది.

Pages