S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/11/2016 - 04:45

గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చేతబడి హత్యలకు ఎందరు బలైపోయారో అన్న విషయమై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా మండల తాహశీల్దార్లతోనూ, గ్రామ కార్యదర్శులతో సర్వే జరిపించాలి. చిల్లంగి పేరిట, బాణామతి, చేతబడి, మంత్రాలు వేస్తున్నారన్న నెపంతో ఎంతమందిని జల సమాధి చేశారు. ఎంతమందికి నాలుకలు కోశారు? వివస్త్రుల్ని చేసి ఎంత మందిని ఊరేగించారు?

01/09/2016 - 04:15

దశాబ్దకాలం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దౌత్యం సఫలీకృతం కావాలిన ఇరుదేశాల నాయకులు వాంఛించినా, దీన్ని ప్రజాస్వామ్యం ముసుగులో సాగుతున్న సైనిక పాలన సాధ్యం కానివ్వడం లేదన్నది పరమసత్యం. ఒకపక్క అనేక శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ-నవాజ్‌లు కరచాల నాలు చేసుకుంటున్న సమయంలోనే కాశ్మీర్‌లో కాల్పులు జరిపి మన సైనికులను పొట్టన పెట్టుకుంటున్న సంఘట నలు చోటు చేసుకుంటున్నాయ.

01/08/2016 - 06:15

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో తగినన్ని ఆకు కూరలు చేర్చడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి మనం దరికీ తెలిసిందే. అయతే నేడు ఈ ఆకుకూరలను పండిం చే చిన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఈ ఆకు కూరలను ‘పొందర’ కులానికి చెంది న రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.

01/07/2016 - 00:07

నాకు తెలిసి విశాఖపట్టణంలో పోస్టలు డిపార్ట్‌మెంటు వారి భూములు నాలుగు ఉన్నాయ. సీతమ్మధార వద్ద హెచ్‌బి కాలనీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం పోస్టాఫీసువద్ద, బుచ్చిరాజు పాలెం, కంచరపాలెం హైవే నుండి పారిశ్రామిక ఎస్‌బిఐకి వెళ్లే దారిలో ఇవి ఉన్నాయ. ఇవికాక ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పోస్టలు భూములు ఉన్నాయ.

01/06/2016 - 01:05

పవిత్రమైన గవర్నర్ వ్యవస్థ, రాజ్‌భవన్‌లు కుట్రలు, కుతంత్రాలు వేదికగా మారడం ఈ మధ్య తగ్గిందనుకు నేంతలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిణా మాలు తిరిగి గవర్నర్ వ్యవస్థపై చర్చకు దారి తీశాయ. ఆ రాష్ట్ర శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటె రెండు నెలల ముందుగానే సభ ప్రారంభమై స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చ జరపాలని ఆదేశాలివ్వడం రాజ్యాంగ విరుద్ధంగా విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.

01/05/2016 - 04:49

విశాఖపట్టణంలోని కింగ్‌జార్జ్ ఆసుపత్రి బ్రిటీషు వారి కాలంలో ప్రారంభించబడింది. వందేళ్లకు పైగా చక్కగా నడిచిన కెజిహెచ్ తర్వాతి కాలంలో పెను మార్పులకు లోనై ప్రస్తుతం కుహనా రాజకీయాలకు నెలవై అధ్వాన్న పరిస్థితిలో ఉంది. జనరేటరు పనిచేయ దు, లిఫ్టులు లేవు. డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసుల్లో మునిగి తేలుతుంటారు. రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి షరా మామూలే. అటువంటి పరిస్థితిలో ఆసుపత్రి ఎందుకో బోధపడటం లేదు.

01/04/2016 - 05:07

హిందూపురంలో ఇటీవల భాజపాకు వ్యతిరేకంగా ముస్లింలు ప్రదర్శన నిర్వహించడం, మతఛాందస వాదులకు బుద్ధి చెప్పాలని ప్రకటన చేయడం చాలా విడ్డూరం. దీని వెనుక కుహనా లౌకిక వాదులు, వామపక్ష తదితర హిందూ వ్యతిరేకులు ఉన్నట్లు అర్థమవుతోంది. హిందూ సమాజంపై దాడి చేయడం సరైనది కాదు. పెను గొండ, పరిగి, గోరంట్ల ప్రాంతాల్లోని ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

01/02/2016 - 07:02

‘‘అఖండ భారత్’’- ఇది అందరూ కోరుకోవలసినది. కాని ఇప్పుడది ఆర్.ఎస్.ఎస్. వారి కోరికగా మారిపోయం ది. పైగా..అదేదో బూతుపదం అన్నంతగా, మన కమ్యూనిస్టు సోదరులు, కాంగ్రెస్ సోదరులు, గోబెల్స్ ప్రచారం ద్వారా సమాజంలో గగ్గోలు పెట్టారు. వియత్నాం, జర్మనీలు కలిసికట్టుగా భవిష్యత్తులో వాటి అవసరాల దృష్ట్యా భారత్, పాక్, బంగ్లాదేశ్ కలవవచ్చు. దానికెందు కింత గగ్గోలు?

01/01/2016 - 05:04

రెండు తెలుగు రాష్ట్రాలు వితంతువులు, వికలాం గు లు, వృద్ధులకు నెలనెలా పింఛన్లు చెల్లిస్తున్నాయ. విచిత్ర మేమంటే వీరంతా పింఛను చెల్లింపు కార్యాలయానికి ప్రతి నెలా తప్పనిసరిగా హాజరై తమ పింఛను తీసు కోవాల్సి వస్తున్నది. ఉద్దేశపూర్వకంగా కాకపోయనా, తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొన్న నిబంధన వీరిని ఇబ్బందుల పాలు చేస్తున్నది.

12/31/2015 - 04:47

ఒకటి, రెండు రూపాయల నోట్లను, ఇరవై ఐదుపైసల నాణేలను రిజర్వు బ్యాంకు రద్దు చేస్తున్నట్టు గతంలో అధికారికంగా రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ రిజర్వు బ్యాంకు వారు తయారు చేస్తున్న ఐదు రూపాయల నోటు, యాభై పైసల నాణేలకు సంబంధించి రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయ. కిరాణాషాపులు, కూరగాయల మార్కెట్ తదితర చిల్లర లావాదేవీలు జరిగే చోట్ల గందరగోళం నెలకొంటున్నది.

Pages