S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/17/2015 - 23:53

మహాత్ముడే నా స్ఫూర్తిదాత అని చెప్పుకొనే ప్రధాని మోదీ చైనా నుండి విపరీతంగా దిగుమతి ఔతున్న వస్తువులను నిషేధించాలి. విదేశీయుల పెట్టుబడులను ఆహ్వానించకూడదు. స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ పారిశ్రామికులను, శాస్తజ్ఞ్రులను, ఇంజనీర్లను ప్రోత్సహించాలి, అన్ని విధాల సహకరించాలి.
- సత్యప్రకాశ్, సూర్యాపేట

12/20/2015 - 03:58

పొలమున్న మహిళలు పొలం పెట్టి గాని బంగారము పెట్టిగాని బ్యాంకులలో ఋణము తీసుకుంటారు. అట్లాగే పొలమున్న పురుషులు కూడా పొలంగాని బంగారం గాని తాకట్టు పెట్టి ఋణం తీసుకుంటారు. స్ర్తిలకు మాత్రమే ఋణ మాఫీ చేస్తామనటం అన్యాయం. ఋణమాఫీ చేస్తే స్ర్తి, పురుషులందరికీ చేయాలి. ఎన్నికల హామీ నెరవేర్చాలి. లేకపోతే ఎవరికి ఋణమాఫీ చేయకూడదు. మరియు నిజాయితీగా బాకీ చెల్లించిన వారికి ఆ కట్టిన డబ్బు వాపసు చేయాలి అది న్యాయం.

12/22/2015 - 05:44

నాలుగేళ్లలో విశాఖను స్మార్ట్ సిటీగా మార్చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. స్మార్ట్ సిటీ సంగతి దేవుడెరుగు ముందు తగినంత రక్షిత మంచినీరు సరఫరాచేస్తే చాలునని విశాఖనగర వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రస్తుతం రోజుకు 40 ని.లు మాత్రమే అదీ ఒక నిర్ణీతమైన టైము అనేది లేకుండా నీరు సరఫరా చేస్తున్నారు. ఇక ఏడేళ్ల క్రితం జి.వి.యం.సి.

12/14/2015 - 05:45

చండిగఢ్‌లో జరిగిన ఒక సదస్సులో ‘‘నెహ్రూ విదేశీ విధానం నేటికీ సరిపోతుంది’’ అని రాష్టప్రతి చెప్పడం ఆశ్చర్యమే. ఎందుకంటే నెహ్రూ జీవిత కాలంలోనే అవి బెడిసి కొట్టాయి! అందరూ వద్దని చెప్పినా ద్వైపాక్షిక అంశం కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి నివేదించారు నెహ్రూ. అందువల్లనే ఆ సమస్య రావణకాష్ఠంలా ఇంకా రాజుకుంటూనే ఉంది.

12/12/2015 - 05:00

అప్పులపాలై బక్కచిక్కి ఆత్మహత్య చేసుకునే రైతులంటే కవులకు ప్రేమ. ఆవురావురని కవితాక్షరాల పోగులు పెడతారు. ప్రభుత్వానికి ప్రేమ. బావురు బావురు మంటూ సానుభూతి ఎక్స్‌గ్రేషియా కుప్పలు పోస్తారు. ప్రతిపక్షాలకూ ప్రేమే. బోదురు బోదురని ప్రభుత్వంపై విమర్శల రాశులు పోస్తారు. అందరివీ మాటల గ్యాసే. చేతలు నిల్. స్వచ్ఛంద సంస్థలు చేయగలిగింది ఎంతో ఉంది. కాని చేయరు. ఈ సంస్థలు రైతుల వద్దకు వెళ్లి సాంత్వన కలిగించవచ్చు.

12/11/2015 - 05:28

దేశవ్యాప్తంగా రోమింగ్ ఉచితం, రాత్రిళ్లు ఔట్ గోయింగ్ ఉచితం అంటూ ప్రచారం చేసుకుంటున్న బి.యస్.యన్.యల్. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో విఫలవౌతోంది. శ్రీకాకుళం నగరంలో వర్షం పడితే చాలు ల్యాండ్‌లైన్ ఫోన్లు మూగపోతాయి. నగరంలోని సెల్ టవర్లకు తరచుగా విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా సెల్ సిగ్నల్స్ నిలిచిపోతుంటాయి.

12/10/2015 - 05:15

నేత కార్మికులు బ్రతుకుదెరువుకోసం క్రొత్త దారిని ఏర్పరచుకొని మరో వ్యాపారంలోకి వెళ్ళాలి. చేనేత బట్టలు ఈనాటి యువతకు రుచించవాయె. ఇప్పుడంతా జీన్స్, టీషర్ట్ రెడీమేడ్.. ఇదో ట్రెండ్. ముసలివాళ్లు కూడా టీషర్ట్స్ వేస్తున్నారు. ఆ బట్టలన్నీ మిల్లునుండి వస్తున్నాయి కదా! మరి అలాంటప్పుడు చేనేత వస్త్రాల వ్యాపారం మందకొడిగానైనా సాగేటట్లు లేని పరిస్థితి.

12/09/2015 - 05:55

బీఫ్ ఫెస్టివల్‌లో హిందూ వ్యతిరేకత కనిపిస్తున్నది. నాకు పరిచయమున్న ముస్లిం సోదరులనడిగాను. వారు ఖురాన్‌లో ఆవును చంపి తినమని ఎక్కడా లేదన్నారు. తప్పనిసరిగా తినాలని గాని- తినకూడదని గాని లేదన్నారు. హిందువులు పూజిస్తారు కనుక తినాలని భారతదేశ ముస్లిం సోదరుల పంతం అన్నారు. క్రిస్టియన్ దేశాలలో ఆహారం క్రింద గోమాంసం తింటారు. ఈమధ్య మ్యాడ్‌కౌ జబ్బులు వచ్చి ఆహారం దొరకక వారు ఇబ్బంది పడ్డారు.

12/07/2015 - 23:49

‘విమానాల్లో మోదీ. పంట పొలాల్లో నేను. వారిది సూటు బూటు ప్రభుత్వం. రైతులు, పేదల పక్షాన మేము. ఈ పోరులో చావుకయినా సిద్ధమే’‘ ఎవరు రాసి పెట్టారో గాని రాహుల్ మాటలు సినిమా పంచ్ డైలాగుల్లా ఉన్నాయి! మోదీ సరదా షికార్లకోసం విదేశాలకు వెళ్లడం లేదు. వాటివల్ల మన దేశానికి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలుగుతున్నాయి. 1947లో అధికార మార్పిడి జరిగి బ్రిటిష్ విధానాలే కాంగ్రెస్ కొనసాగించింది.

12/07/2015 - 04:14

వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్‌లో మరొక ఎటిఎమ్ యొక్క అవసరం ంతైనా వుంది. ప్రస్తుతం శాంతినగర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్ ఎటిఎమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఎటిఎమ్ వినియోగించేవారు ఎక్కువ కావడంతో, డబ్బులు త్వరగా అయిపోతున్నాయి. అంతేకాదు సాంకేతిక కారణాలతో ఏదైనా ఎటిఎమ్ పనిచెయ్యకపోతే, మరో ఎటిఎమ్‌పై ఆధారపడాలి. అందులో డబ్బులు అయిపోతే దిక్కుతోచని పరిస్థితి.

Pages