S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/01/2019 - 21:17

మహాకవి శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ కవితా సంపుటిలో ‘ఒకటీ-పదీ’ అనే కవిత ‘ఈ ఫస్టోబరు రోజు ఎవరా వస్త’ అని మొదల్యతుంది. పది పాదాల తర్వాత ఈ మాటలు కనబడతాయి.
‘‘అదో పదోనెల బాల
హాస విశాల
పుట్టింటికొస్తోంది
పూర్ణ గర్భిణి’’
ఐదు పుటలు ఆక్రమించిన నాలుగు భాగాల కవిత మధ్యలో ఈ పాదాలు కూడా ఆకర్షిస్తాయి..
‘‘ఈ ఫస్టోబరు వేళ
నిన్నటి మన స్వరూపం స్మరించి

11/01/2019 - 02:04

వ్యవసాయంపై ఆధారపడే రైతన్నల తర్వాత కులవృత్తిపై ఆధారపడుతూ ఎక్కువ సంఖ్యలో జీవ నం గడుపుతున్నది నేతన్నలే. తెలుగు రాష్ట్రాలలో నేడు చేనేత కార్మికుల కుటుంబాలు కడు దయనీయ స్థితిలో ఉన్నాయి. వేరే పని చేయలేక కులవృత్తిపై ఆధారపడుతూ, దంపతులిద్దరూ రోజంతా శ్రమచేసినా కనీసం 200 రూపాయలు కూడా గిట్టుబాటు కానందున తమ కుటుంబాలను పోషించలేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.

10/31/2019 - 01:44

మన దేశానికి తృతీయ ప్రధానిగా 1966లో ఇందిరా ప్రియదర్శిని పగ్గాలు చేపట్టాక- నాటి సీనియర్ రాజకీయవేత్తలు ఆమెను ‘డంబ్ డాల్’గా అభివర్ణించారు. అయిదేళ్ల తరువాత ‘లండన్ టైమ్స్’ పత్రిక ఆమెను మహిళాశక్తికి ప్రతీకగా ప్రశంసించింది. ఇందిరకు చిన్నతనంలోనే మహాత్మా గాంధీ ఆశీస్సులు లభించాయి. 1942లో ఫిరోజ్ గాంధీతో వివాహం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది.

10/30/2019 - 02:06

వృత్తిపరంగా భూమితల్లిని నమ్ముకున్న రైతాంగానికి కాలానుగుణంగా సహనం వారికి అలవడిన సహజ గుణం. ముఖ్యంగా రాయలసీమ రైతులకు వేచి చూడడం అదను సదనులో వర్షం పడుతుందని ఆకాశంవైపు మోరలెత్తి చూస్తూ సీమపై కరమబ్బులు కమ్మి పిల్లతెమ్మెరలు వీచడంతో వాన తప్పకుండా కురుస్తుందని ఆశగా ఎదురుచూడడం వారికి సంవత్సరాల తరబడి ఆశగా ఎదురుచూసే క్రమం ఆనవాయితీగా మారింది.

10/29/2019 - 00:15

సిసలైన సంపాదకుడు, లోతయిన అధ్యయనశీలి, ఆకట్టుకునే వక్త, సంభాషణా చతురుడు, మృదువైన స్నేహశీలి, ఆకర్షణీయమైన స్ఫురద్రూపి అయిన సి.రాఘవాచారి హైదరాబాదులో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 1939 సెప్టెంబరు 10వ తేదీన వరంగల్ జిల్లా జనగామ/ పాలకుర్తి మండలం శాతాపురంలో జన్మించిన చక్రవర్తుల రాఘవాచారిని చాలామంది విజయవాడవైపు వ్యక్తిగా పరిగణిస్తారు.

10/27/2019 - 01:53

మరోసారి మానవత్వాన్ని మావోయిస్టులు మంట గలిపారు. విశాఖ మన్యంలో ‘ఇన్‌ఫార్మర్’అన్న నెపంతో పెదపాడు గ్రామానికి చెందిన తంబేలు లంబయ్య అలియాస్ దివుడు అనే గిరిజనుడిని మావోయిస్టులు ఇటీవల కాల్చి చంపారు. పొలంలో పనిచేసుకుంటున్న లంబయ్యను సాయుధులైన మావోలు చుట్టుముట్టి కుంకుంపూడి గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు.

10/25/2019 - 21:22

భూమిపై సమస్త జీవరాశి మనుగడ సాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు అనేక రూపాలలో కలుషితమై పోయింది. కా లుష్యం ఫలితంగా స్వచ్ఛమైన గాలి నానాటికీ కరవవుతోంది. అభివృద్ధి పేరుతో సహజ వాతావరణంపై మానవ ప్రమేయం రోజురోజుకూ మితిమీరిపోతున్న తరుణంలో వాతవరణ కాలుష్యం విషమ పరిస్థితికి చేరుకొంది. దీని పర్యవసానంగా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

10/25/2019 - 00:45

ఆహారం లేకుండా ఏ ప్రాణి, ఏ మనిషి జీవించడం అసంభవం. కానీ, కొన్ని జీవులు ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి. మొక్కలకు జీవనాధారం నీళ్ళు. వర్షాలు కురిస్తేనే మొక్కలు నీటిని పీల్చుకొని పెరుగుతాయి. కొన్ని జంతువులు అంటే గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మొదలైనవి ఆ చెట్ల ఆకులను, గడ్డిని తిని బతుకుతాయి. క్రూరమృగాలు అడవుల్లో బలహీనమైన దుప్పులు, మేకలు వంటి జంతువులను తిని జీవిస్తాయి.

10/23/2019 - 00:58

అగ్రరాజ్యాల విస్తరణాధిపత్యం, ఆటవిక యుద్ధోన్మాదం నేడు ‘ప్రపంచ రాజకీయ నీతి’గా చెలామణీ అవుతోంది. సిరియా ఈశాన్య ప్రాంతం నుంచి అమెరికా సైన్యం ఉపసంహారం, కుర్దిష్ మిలిటోయాపై టర్కీ దా డులు, మళ్లీ అమెరికా ఆంక్షల కారణంగా కాల్పుల నిలుపుదల వంటి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు నిస్సహాయ పౌర జీవన విపత్కరతకు అద్దం పడుతున్నాయి.

10/22/2019 - 01:34

నేడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు విషాదం బారిన పడుతున్నాయి. భావి జీవితాన్ని చూడకుండానే యువకులు, పసివాళ్లు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం రహదారులు రక్తసిక్తం కావడానికి కారణాలేమిటి? ఇందులో వాహనచోదకుల బాధ్యత ఎంత? రోడ్ల నాణ్యతాప్రమాణాలు ఎంత? అనే ప్రశ్నలు వేసుకుంటే- మనకు నిరాశాజనకమైన జవాబులే వస్తాయి.

Pages