S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/14/2016 - 06:22

ఉత్తమ ఉపాధ్యాయుడు ఉత్తమ విద్యార్థిని తయారుచేస్తాడు. మరి ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి, ఎవరు తయారుచేస్తారు? అతని తల్లిదండ్రులు మాత్రమే. చిన్నప్పటినుండి వారి తల్లిదండ్రులు, తమ పిల్లలను క్రమశిక్షణ, వినయవిధేయతలతో ఉండే సంస్కారవంతునిగా తయారుచేస్తారు. నేడు మనకు కనిపించే ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రపంచఖ్యాతి పొందిన మన దేశ నాయకులు ఇద్దరు. ఒకరు దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ కాగా, మరొకరు అబ్దుల్‌కలాం.

09/12/2016 - 23:51

ప్రకృతిని పచ్చగా, ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉన్నదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు. మొదట మొక్కలుగా ఉన్నా, పిదప వీటిలో చాలావరకు వృక్షాలుగా, మహావృక్షాలుగా రూపాన్ని సంతరించుకుంటాయి. తాము కార్బన్‌డై ఆక్సైడును పీల్చుకుంటూ, మనకేగాక, పశుపక్ష్యాదులకు అత్యవసరమైన ప్రాణవాయువునందిస్తూ త్యాగానికి మరో పేరుగా అలరారుతున్నాయి.

09/12/2016 - 01:03

మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ స్థాయిలో గ్రామానికి ప్రథమ పౌరుడు అను చెప్పుతుంటాము కదా. నేడు ఏ గ్రామంలో చూసినా ఏ మండలంలో చూసినా ఏ జిల్లాలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా సర్పంచ్‌లలో 80% మంది అవినీతికి పాల్పడుతూ వుంటే అధికార యంత్రాంగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎక్కడవేసిన గొంగడి అక్కడనే అనే చదంగా వ్యవహరిస్తున్నారు.

09/10/2016 - 07:45

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక వూడిపోయిందన్నట్లుంది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. నిధులు, నీళ్లు, నియామకం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రకటించిన సిఎం కేసిఆర్ ప్రభుత్వ ఉధ్యోగుల పదవీ విరమణ వయసును 58నుంచి 60కి పెంచనున్నారని వార్త పత్రికలలో కథనాలు వస్తున్నాయి. సమైక్యాంధ్ర పాలనలో 12 ఏళ్లపాటు ఉద్యోగ నియామకాలు సాగలేదు.

09/10/2016 - 07:43

భారతదేశ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది. సంస్కృతికి ఆధారభూతమైన భాష సంస్కృత భాష. భారతస్య ప్రతిష్ఠేదే సంస్కృతం సంస్కృతిస్త్ధా’’ భారతదేశానికి గౌరవాన్ని సంపాదించి పెట్టే భాష సంస్కృత భాష. ఇది దేవ భాష అని పెద్దల వాక్కు. ఈ భాష విజ్ఞాన ఖని. అనేక వైజ్ఞానిక విషయాలు ఈ భాషలో ఉన్నాయి. అనేక భాషలకు జనని ఈ భాష. అందువలననే భారతీయులందరికీ తమ మాతృభాషలో పాండిత్యం పెంపొందటానికి ఈ భాష ఉపకరిస్తుంది.

09/09/2016 - 00:09

తెలంగాణ భాషకు, యాసకు, గోసకు కావ్య గౌరవం చేకూర్చిన అచ్చమైన ప్రజాకవి, పద్మవిభూషణుడు, మన కాలంనాటి వేమన, కాళోజీ నారాయణరావు. వలస పాలనపై ఎక్కుపెట్టిన ధిక్కార స్వరం కాళోజీ. కాళోజీ జన్మదినం సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ భాషాదినోత్స వం’గా ప్రకటించడం అభినందనీయం. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తిచాటిన అతి తక్కువమంది కవులలో కాళోజీ అగ్ర గణ్యుడు.

09/09/2016 - 00:07

భారతీయ సంస్కృతిలో అన్నిటికన్నా ముఖ్యమైన సత్యం ఒక్కటే. అదే శ్రీరాముడిని ఇతిహాసపురుషుడిగా తలచుకొనడం. అందుకు ఆయన వ్యక్తి త్వం, ధర్మాచరణ పరాయణతే కారణం. మనిషి మరణించిన తరువాత హిందువులు ‘‘రామనామం సత్యం’’ అంటారు. అంతేకాని వేరే ఏ దేవీ దేవతలను తలుచుకోరు. రామశబ్దంలో అంతటి మహత్తు ఉంది. రాముడు సర్వస్వం పోగొట్టుకున్నాడు.

09/08/2016 - 04:21

‘‘ఉత్తమోత్తమ గురువులకే శిష్యుండనైతి
గురువునయ్యెద సచ్ఛిష్యకోటికెల్ల’’ అంటారు కవికోకిల దువ్వూరు రామిరెడ్డిగారు తన ‘‘పానశాలలో ఒక వ్యక్తి ఉత్తమమైన గురువులవద్ద విద్యనేర్చి ఉత్తమశిష్యుడై, ఆ తదుపరి తాను ఉపాధ్యాయుడై ఉత్తమ శిష్యులను తయారుచేస్తే అతడు సమాజాన్ని ప్రగతిపధంలో నడిపించిన వాడౌతాడు.

09/08/2016 - 04:20

సిలబస్ లోపల ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ రివ్యూ ఉంటుంది. ఉపాధ్యాయుడు ఆ సిలబస్‌లో వున్న పాఠాల బాటలో గుడ్డిగా నడపడు. ఉపాధ్యాయుడు స్వతహాగా కొన్ని కానె్సప్ట్స్ తీసుకుంటాడు. కందుకూరి వీరేశలింగం జాతీయవాది అన్నది దృక్పథం ఉంది. తెలంగాణలో వ్యవసాయ పరిణామాలు ఎలా వచ్చాయి? లాంటి వాటిలో కొన్ని కానె్సప్ట్‌లు ఆధారంచేసుకుని పాఠాన్ని ఎలా బోధించాలో విశే్లషించుకుంటాడు. దీని ద్వారా జనంలోకి పోతాడు.

09/06/2016 - 23:49

రియోలో 2016 ఒలింపిక్ క్రీడలు ముగిసాయి. చైనా తరువాత 125 కోట్ల జన సంఖ్యతో ప్రపంచంలో రెండో స్థానంలో భారతదేశం ఉంది. జన సంఖ్యకు తగ్గట్టే అంతర్జాతీయ క్రీడావేదికలపై ఆర్భాటం ప్రదర్శిస్తుంది. దక్షిణాసియా క్రీడారంగంలో సత్తాచాటినా ప్రపంచ పోటీలలో చతికిలపడుతుంది. అందుకు ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్సే సాక్ష్యం. బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు పతకాలకు- అందులో ఒకటి స్వర్ణం- పరిమితమైంది భారతదేశం.

Pages