S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/28/2015 - 22:29

అల్‌ఖైదా తర్వాత ప్రపంచం ముందు పెద్ద ఉగ్రవాద ముప్పుగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్‌పై రష్యా వైమానిక దాడులు ప్రారంభించడం అమెరికా, ఇతర ఐరోపా దేశాల కపట నాటకాలను బహిర్గతం చేస్తున్నది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అసాధ్యులని, వారిని కట్టడి చేయడం అసాధ్యం అనే రీతిలో కొంతకాలంగా ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం ఈ దేశాలు చేస్తున్నాయి.

11/28/2015 - 04:22

ఘటనలు వాస్తవాలు కనుక వాటిని వక్రీకరించకూడదనేది పత్రికా రచయితలకుండాల్సిన ప్రధాన లక్షణం. కానీ దానిపై అభిప్రాయాలను మాత్రం ఎవరిష్టమైన రీతిలో వారు వ్యక్తం చేసుకోవచ్చు. ఉదాహరణకు రోడ్డుపై శవం ఉంది. దానిపై గాయాలు కూడ ఉన్నాయి. ఇక్కడ శవం ఉండటం వాస్తవం. అది ఆత్మహత్య, హత్య, వాహనం ఢీకొనడం వల్లనా అనేవి పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. కానీ దర్యాప్తులో మాత్రం నిజం తేలుతుంది.

11/27/2015 - 05:43

తాగునీరు కరువైతే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. పేద ప్రజలు పనికి వెళ్ళలేరు. వైద్యపు ఖర్చులు పెరిగి అప్పులపాలవుతారు. అయినా ఈ రంగంలో మన దేశ ప్రగతి అంతంత మాత్రంగానే వుంది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2012లో ప్రపంచంలో 78.3 కోట్ల ప్రజలకు త్రాగునీరు అందుబాటులో లేదు. అయితే కొన్ని లెక్కల ప్రకారం, ప్రపంచంలో 300 కోట్ల ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు లభించడం లేదు.

11/27/2015 - 05:42

మన దేశంలో వేదకాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అందుకే మన పెద్దలు ‘‘స్ర్తిలు ఎక్కడ పూజించబడతారో- అక్కడ దేవతలు ఉంటారు’’ అని చెప్పారు. అనంతరం మారిన పరిస్థితులలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం ఏర్పడింది. మధ్యయుగం నాటికి మహిళలను వంటింటి కుందేళ్ళుగా, కేవలం సంతానాభివృద్ధికి, తమకు శారీరక సుఖాల్ని అందచేసే ఆటబొమ్మలుగా మార్చివేశారు. మహిళలపై అడుగడుగునా ఆంక్షలు విధించారు.

11/26/2015 - 04:55

మన దేశంలో మోన్‌శాంటో విత్తనాలు బి.టి.విత్తనాలు వలె విద్యారంగంలో కూడా పాశ్చాత్య దేశాల దిగుమతి విద్యావిధానాన్ని ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టం ద్వారా నెత్తికెత్తుకున్నారు. అప్పటి మానవ వనరుల అభివృద్ధిశాఖామాత్యులు అమాంతం విదేశీ విద్యావిధానాన్ని, భారతీయ విద్యావిధానంపై రుద్దటానికి చేసిన ప్రయత్నమే ఈ వికృతమైన చట్ట రూపం. ఈ చట్టంలో లోపాలు గురించిన చర్చించిన నాధుడే లేడు.

11/26/2015 - 04:53

ప్రజాస్వామిక వ్యవస్థ ప్రభుత్వానికి రాజకీయాలకే పరిమితం కాదు. అన్ని రంగాలను అది ప్రభావితం చేశాయి. సమాజంలో కూరుకుపోయిన అసమానతలను ఛేదించి దాని కారణాలను సమాజం ముందు సవాళ్లుగా నిలిపింది. దానిలో విద్యారంగం చాలా మార్పులకు గురైంది. విద్య సమాజ పరివర్తనకు కారణభూతమని, ఆ విద్యను అందరికీ హక్కుగా ఇవ్వాలని మన న్యాయకోవిదులు ఇచ్చినటువంటి తీర్పులు ప్రభుత్వాలకు మార్గదర్శకమయ్యాయి. సమాజంలో అందరు ఒక రకంగా ఉండరు.

11/25/2015 - 04:57

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్‌లపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం నుంచి క్రమక్రమంగా తప్పుకొంటూ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూండటంతో పలు కులాలు తమకు కూడ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

11/25/2015 - 05:00

నేటి విద్యావిధానంలో ఓ కరిక్యులర్ యాక్టివిటీస్ తప్పనిసరిగా మారింది. పదవ తరగతి విద్యార్థులకు ఎనభై మార్కులు ప్రతి సబ్జెక్టులో ఉంటూనే ఇరవై మార్కులు కళలు-సాంస్కృతిక విద్యకు ఉంటున్నాయి. కళలు మన సంస్కృతికి ప్రతిబింబాలు. వ్యక్తి మానసికోల్లాసానికి ఎక్కడైతే అవకాశం ఏర్పడుతుందో అక్కడ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది అని అంటారు ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్.

11/24/2015 - 05:46

నేడు పట్ట్భా సీతారామయ్య జయంతి
=======================

11/23/2015 - 04:54

ఆయ్‌ఁ... ఆ తెలుగు పుస్తకాలు నీకెందుకు? ...అంటూ బాల సాహిత్యాన్ని పెద్దలు లాగేసుకుంటున్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. అసలే పెద్దల పోరు, తెలుగు పట్ల పిల్లల అయిష్టం ‘బాల సాహిత్యా’న్ని పిల్లలకి దూరం చేసేస్తోంది.
‘ఏయ్! అది బాల సాహిత్యం కాదు! మా సాహిత్యం?’అంటూ ఉన్నవాటినీ పెద్దలు లాగేసుకుంటే పిల్లలకు మిగిలే సాహిత్యమేది?
పెద్దలే ఆలోచించాలి!

Pages