S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/01/2018 - 00:07

జాగాయకుడు గద్దర్ పార్టీ పెడతారట..’
‘ఆ.. ........’
‘ఏమండోయ్.. గద్దర్ రాజకీయ పార్టీ పెడతారట...’
‘అంత సీన్ లేదులే!’
‘అదేమిటి.. అలా అంటారు?’
‘అదంతే!.. అది పూర్తిగా పాతపాట.’
- ఊహాత్మకమైన ఈ సంభాషణను పక్కన పెడితే...

07/30/2018 - 23:49

లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మర్నాడు- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ స్థాయి విలేఖరుల సమావేశాన్ని నిర్వహించి, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో చెబుతూ, ఆయన కాస్త ‘అతి’గా మాట్లాడటం తెలంగాణ వాదులకు తీవ్ర మనస్తాపం కలిగించింది.

07/28/2018 - 23:39

ప్రస్తుత నగర జీవన విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకువెళ్తున్న యువతలో కొందరు చెడు మార్గంలోకి వెళుతున్నారు. కొందరైతే అమానవీయ చర్యలకు పాల్పడుతూ మానవత్వానికే మచ్చ తెస్తున్నారు. ఇందుకు అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాను చేసిన అప్పులు తీర్చడానికి స్నేహితుడి ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగిలించడమే కా కుండా అతడిని ఓ యువకుడు పెట్రోలు పోసి తగులబెట్టాడు.

07/27/2018 - 22:01

ఈ సంవత్సరం మార్చి నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరిపారు. ఆ సందర్భంగా బెంగళూరు నగరంలో జరిగిన ఉత్సవంలో మాజీ డీజీపీ సాంగ్లియానా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ‘నిర్భయ కేసు’గా విశేష ప్రాచుర్యం పొందింది. బెంగళూరులో జరిగిన సభకు ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రినాథ్ సింగ్‌లు హాజరయ్యారు.

07/26/2018 - 23:15

ప్రస్తుత 21వ శతాబ్దంలో అద్భుత ప్రయోగాలు జరిగాయి. చిన్న చిన్న దేశాలు ఏర్పడ్డాయి. మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. వనరులన్నీ మలేషియాలో ఉండేవి కానీ, ఈనాడు ప్రపంచంలో అమెరికాతో సమానంగా సింగపూర్ ‘జీడీపీ’ ఉంది. ఉత్తర కొరియాలో వనరులన్నీ ఉన్నాయి. కొరియా విడిపోయాక దక్షిణ కొరియా శరవేగంగా అభివృద్ధి చెందింది. స్వీడన్ ఒకనాడు ప్రపంచానికి గడియారాలిచ్చింది.

07/25/2018 - 00:04

‘దేశమును ప్రేమించుమన్నా..
దేశమంటే మట్టికాదోయ్..’

07/21/2018 - 22:17

రక్తపాత విప్లవాలకు కాలం చెల్లింది. జ్ఞాన విప్లవాలకు ఆదరణ కనిపిస్తోంది. ప్రజలు పెద్దఎత్తున అందులో భాగస్వాములవుతున్నారు. ఇది ఈ కాలపు విశిష్టత. తాజాగా ఐటి, టెలికమ్యూనికేషన్ రంగాల్లో, విద్య-వైద్యంలో ఈ విప్లవాల ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగాలన్నీ పరస్పర పూరకాలుగా, ఒకదానిపై ఒకటి ఆధారపడి ముందుకు వెళుతున్నాయి. ఈ విషయమై, ప్రపంచంలోని అన్ని దేశాలు పోటీపడుతున్నాయి.

07/20/2018 - 23:45

రాముడిపైన సీతపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పై ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించి ఆయన స్వంత జిల్లా చిత్తూరు పంపారు. ఎవరైనా ఒక వ్యక్తి జాతీయ పురుషుడిపైన అనుచితమైన వ్యాఖ్యలుచేస్తే వారికి నగర బహిష్కరణ శిక్ష వేస్తే సరిపోతుందా? అదే కనుక న్యాయం అయ్యేటట్లైతే మన న్యాయస్థానాల చట్టాల పరిస్థితి ఏమిటి?

07/19/2018 - 22:54

పాఠశాల ఒక వ్యవస్థ. దాని పని విధానం చెట్టుకున్న బెండు వంటిది. అది కాలానుగుణంగా మారుతుంటుంది. అది వడ్డించిన విస్తరి కాదు. దానిలో ఉండే వ్యక్తులు చేసే పని నిర్ధారణ చేస్తుంది. పాలసీలు, రూల్స్ సమస్యలను పరిష్కరించవు.దానిలో పనిచేసే మనుషుల ఆలోచనా విధానమే సమస్యల సృష్టికి, పరిష్కారానికి కారణం. రూల్స్‌ను మార్చే ముందు అక్కడి వ్యక్తులతో కలిసి మాట్లాడి ఏకాభిప్రాయాలు తీసుకొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి.

07/17/2018 - 22:28

కాలం చెల్లిన మార్క్స్ సిద్ధాంతాన్ని అత్యున్నత శిఖరంపై చూడాలనుకునే రచయిత్రి రంగనాయకమ్మ స్వాప్నికురాలు, అమాయకురాలు.. మార్క్సిజం ‘బలిపీఠం’ ఎక్కడం ఏ మాత్రం సహించని సంప్రదాయ మార్క్సిస్టు ఆమె. సాంకేతిక పరిజ్ఞానం శ్రామికుల ముంగిళ్లలో నర్తనమాడుతున్నా ఆమె పాతకాలపు సమీకరణలనే వల్లెవేస్తున్నారు. మార్క్సిజంపై ఈగ వాలనీయకుండా ఆమె ఇటీవల చేస్తున్న రచనలు చూస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది.

Pages