S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/23/2016 - 00:25

అది ఇష్టంతో కావచ్చు, అయిష్టంతో కావచ్చు ప్రపంచ ప్రజల నాలుకపై అమెరికా నామస్మరణ నిత్యకృత్యం. ఆ దేశ విదేశాంగ విధానాల ఆధారంగా అమెరికా మీద ఎక్కువమంది దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. కాని ఎవరైనా అమెరికా పర్యటించి వచ్చిన తరువాత ఆ అభిప్రాయాన్ని చాలావరకు మార్చుకుంటారు. మన కమ్యూనిస్టు అగ్ర నాయకులు నారాయణ, రాఘవులు విషయంలో కూడా ఇది రుజువైంది.

07/21/2016 - 23:51

దేశంలో న్యాయవ్యవస్థ (కాలేజీ విద్య మినహా) ఒక్క టి మాత్రమే ప్రైవేటీకరణ దిశగా ఆచరణకి నోచుకోవడం జరగడం లేదు. న్యాయవాదులు న్యాయమూర్తులు ఈ అత్యవసర విషయాన్ని ఆలోచించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వాలకి అన్నిరంగాల్లోనూ పని సక్రమంగా వేగవంతంగా చేయడమన్నది తమతమ రాజకీయాల దృష్ట్యా చేతగానిదని తేలిపోయింది.

07/21/2016 - 23:49

హిందూ ధర్మానికి భారతదేశం పుట్టినిల్లు. అత్యంత పురాతనమైనది. అన్ని ధర్మాలకు మూలమైంది. అట్టి ధర్మాన్ని గౌరవంగా ప్రపంచంలో చాటిచెప్పినవారు ఎక్కువ శాతం బ్రాహ్మణ సామాజికులు. హిందువులకు మతభేదాలు లేవు. హిందువులు పయనిస్తున్న దారిలో ఏ దేవాలయం గాని మరి ఇతర మతస్థుల ప్రార్థనాలయాలైన మసీదు లేదా చర్చి కనిపిస్తే అన్నింటికి నమస్కారం చేస్తారు. అంటే అందరిలోను తమ దైవం వున్నాడనే అభిప్రాయం మాత్రమే.

07/21/2016 - 04:34

స్వీడన్ దేశానికి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చి పడింది. అది వారికి అత్యవసరమైన ఇందనం కొరత. ఇంతకీ ఆ ప్రధాన ఇంధనం ఏమిటో తెలుసా? ‘‘చెత్త’’!! స్వీడన్‌లో చెత్త నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. చెత్త నిల్వలు తరిగిపోవడమంటే ఎవరికైనా సంతోషం కలిగించే విషయమే. కానీ స్వీడన్‌కి మాత్రం ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. విచిత్రంగా లేదూ? ఇంతకీ ఏమిటా ‘‘చెత్త’’కథ? వివరాలలోకి వెళ్దాం.

07/21/2016 - 04:32

విజ్ఞాన శాస్త్రంలో 1960లో వచ్చిన ఆవిష్కరణలు మానవ సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ప్రజలలో నూతన ఆలోచనలు రేకెత్తించాయి. కొన్ని దేశాలు అన్ని రంగాల్లో ఎందుకు విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయి? మరికొన్ని దేశాలు ఎందుకు వెనుకబడి పోతున్నాయి? దీనికి కారణం ఏమిటనే ఆలోచనలు మొదలయ్యాయి.

07/20/2016 - 04:43

మహిళా వివక్ష మత ఛాందసవాదులకు వెన్నతో పెట్టిన విద్య.

07/20/2016 - 04:41

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి 3కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది2అన్న చందాన మారింది. ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అంపశయ్యమీద వున్నాయి. ఇందుకు కారణాలను విశే్లషించడం వృధా ప్రయాస తప్ప ఎటువం టి ప్రయోజనం ఉండదు.

07/18/2016 - 23:45

వెంకటావధానిగారు తూర్పుగోదావరి జిల్లా యండగండిలో 1913 జూలై 29న గురుపూర్ణిమ నాడు దివాకర్ల వంశంలో జన్మించి అవధాన పండిత కుటుంబమైన దానికి ఎనలేని కీర్తి తెచ్చి పెట్టారు. ఆయనది తాతగారి పేరు. తిరుపతి వేంకటకవులలో ఒకరైన తిరుపతి శాస్ర్తీగారు వీరి పినతండ్రి.

07/18/2016 - 02:48

ప్రత్యేకంగా ఏ వాదాన్నీ కాకుండా, ఇంకా చెప్పాలంటే మానవతావాదాన్ని పెంచే రచనల్ని బలివాడ కాంతారావు చేశారు. నేవీలో పనిచేస్తూ ఆయన మనదేశంలో విభిన్న అపదేశాల్ని చూశారు. సంస్కారాల్ని ఆకళింపు చేసుకున్నారు. ఈ అనుభవంతో రాశారు కాబట్టి ఆయన రచనల్లో మనదేశమంతా కనిపిస్తుంది.

07/16/2016 - 08:27

భాష ప్రవాహం వంటిది. నది వెల్లువెత్తి వంకర టింకరగా పారుతూ వాగులూ-వంకలూ తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతున్నట్లే భాష కూడ వ్యావహారికాలను, మాండలికాలను, అన్యదేశ పదాలను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రవాహపు నీళ్ళను కాలువల ద్వారా సక్రమ మార్గంలోకి మళ్ళించినట్లు భాషను కూడ వ్యాకరణం ద్వారా సక్రమంగా ఉండేటట్లు నన్నయ్యాదులు చేశారు. నన్నయ్య స్వయంగా ఆంధ్ర శబ్ద చింతామణిని రాశారు.

Pages