S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/07/2016 - 07:10

అర్థంకాని చదువు వ్యర్థం అన్నది సామెత కాదు, అక్షరాలా నిజం. ప్రతి తరగతి గదిలో ఎక్కువ వినవచ్చేటటువంటి పదం 4ఆలోచించండి22అని టీచర్లు అంటారు. ఉపాధ్యాయుడు పదే పదే అనే పదం4ఆలోచించండి2 అంటుంటారు. ఈ పదం వినేవాడు ఏమిచేయాల్నో? స్పష్టంగా అర్థంకాదు. అదే మాదిరిగా ఏ ఉద్దేశంతో ఈ పదం వాడుతున్నాడో ఆ ఉపాధ్యాయుడు కూడా చెప్పలేడు. తరగతి గదిలో అన్నింటికన్నా అస్పష్టంగా ఉన్న పదం22ఆలోచించండి అన్న పదమే.

07/07/2016 - 07:09

దేవాలయాలు పడగొట్టడం అనే ప్రక్రియ, ఈమధ్య జోరుగా సాగుతోంది రోడ్లు వెడల్పు చేసేటప్పుడు ముఖ్యంగా. దేశంలో రోడ్లువెడల్పు చేయడం అభివృద్ధి కిందే వస్తుంది. దానికి చాలాచోట్ల ఆలయాలు అడ్డంకులే. మంత్రులు, ప్రజాప్రతినిధులు వారికి ఉన్న ఆస్తులు అలా పడగొట్టవలసి ఉంటే, అక్కడ ఎంత పెద్ద రోడ్డయినా ఎన్నో వంపులు తిప్పి వెళ్ళడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరూ కాదనలేరు.

07/06/2016 - 01:05

మన ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతూ వున్నా పెరుగుదల ఆశించిన స్థాయలో లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1970-71లో 10.8 కోట్ల టన్నులుంటే, 2000-01లో 19.7 కోట్ల టన్నులుగా, 2012-13లో 25.7 కోట్ల టన్నులుగా వుంది. అయితే, హరిత విప్లవం వల్ల గోధుమలు, వరి బాగా లాభం పొందాయి. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ప్రగతిని సాధించలేకపోయాయి. ప్రపంచంలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణంలో మన దేశం వాటా 33శాతం, ఉత్పత్తిలో ఈ శాతం 24.

07/06/2016 - 01:04

ప్రపంచ పౌరులందరూ గమనించి, భావితరాలకు బాసటగా నిలవాల్సిన ఒక మహోద్యమం. విస్మరిస్తే వినాశకాలానికి నాంది పలకడమే అవుతుంది. ఒకప్పుడు ముందు రానున్న ఉత్పాతాన్ని దార్శికులు మునుముందుగానే కనిపెట్టి దేశాధిరాజులకు తెలియజెప్పేవారట. అయితే నేడు శాస్ర్తియ విజ్ఞానంతో విశ్వవ్యాప్తమైన వాతావరణ కాలుష్యాన్ని, ప్రకృతిపరమైన వైపరీత్యాలను వాతావరణ శాస్తవ్రేత్తలు ముందే పసిగట్టి ప్రపంచ దేశాధినేతల ముందుంచుతున్నారు.

07/05/2016 - 04:40

తమ తప్పిదాలను ఇతరుల పైకి నెట్టివేసి, తాము సచ్చీలురమని చెప్పుకొనే సంస్కృతి సమాజంలో నానాటికి పెరిగిపోతున్నది. అంతే తప్ప, ఆత్మవిమర్శ చేసుకొని, జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే నాథుడే కరవయ్యారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మన రాష్ట్రంలోని విద్యావ్యవస్థను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో నానాటికీ విద్యారంగంలో ప్రైవేటు సంస్థల (కార్పొరేట్) ప్రాబల్యం పెరిగిపోతున్నది.

07/04/2016 - 04:33

భారతమాత దాస్యశృంఖలాలను ఛేదించడానికి జాతి యావత్తు అహింసే పరమధర్మమని ప్రగాఢంగా విశ్వసించి ఉన్న తరుణంలో దానికి భిన్నంగా సర్వశక్తి సంపన్నులైన బ్రిటిష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు.

07/03/2016 - 01:53

షీలా దీక్షిత్ న్యూఢిల్లీ ముఖ్యమంత్రిణిగా ఉన్నప్పుడు నాల్గువందల కోట్ల వాటర్ ట్యాంక్ కుంభకోణం జరిగింది. కొత్త ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ గత సంవత్సరానికి పైగా ఈ అవినీతిని వెలుగులోకి రానీయకుండా కాపాడాడు. దీనిపై ముందు పోలీసులు ఎఫ్ ఐఆర్ దాఖలు చేశారు. ఇక రాబర్ట్ వాద్రా భూముల కుంభకోణానికి సంబంధించి ఏక సభ్య కమిషన్ నియమింపబడింది. దానికి హైకోర్టు జడ్జి డింగ్రా నాయకుడు.

07/02/2016 - 02:44

మన దేశంలో ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలు వలె వెలిగిపోతున్నదనడంలో సందేహం లేదు. ప్రజలు అవినీతి పరులను అం దలం ఎక్కిస్తున్నారు. వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని అకృత్యాలు చేసినా వారిని ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. హంతకులను దోపిడీదారులను ఎన్నుకుంటున్నారు. ఖైదులో శిక్ష అనుభవిస్తున్నవారిని కూడా గెలిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదే కాబోలు.

06/30/2016 - 23:49

సివిల్ సర్వీసులకు మార్గదర్శక సూత్రాలు భిన్నస్థాయిలో వడపోతల తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా 1078 మంది విజేతల్ని ప్రకటిస్తే అందులో 67 మంది తెలుగు విద్యార్థులు రాణించడం హర్షణీయం. అందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విజేత ఫలితాల్లో చోటుచేసుకోవడమన్నది గ్రామీణ భారతానికే గర్వకారణం.

06/30/2016 - 23:48

‘‘పుస్తకాలు చదవడమంటే రామాయణ, భారత, భాగవతాలు చదవడమనీ, చదవలేకపోతే వాటిని పురాణాలుగా చెబుతూ ఉంటే వినడమనీ, జనబాహుళ్యం అనుకునే రోజుల్లో- తెలుగు పుస్తకాలు చదవడంలో విప్ల వం తెచ్చిన రచయిత కొవ్వలి. తెలుగు చదవడం రాని వాళ్లు ఆయన పుస్తకాన్ని చదవడం కోసం తెలుగు నేర్చుకున్నారంటే అతిశయోక్తి అనిపించుకోదు’’ అన్నారు డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావుగారు.

Pages