S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/01/2018 - 00:42

ఆది శంకరాచార్యులు నెలకొల్పిన శ్రీ కంచి కామకోటి పీఠ పరంపరలో 69వ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధి గాంచారు శ్రీ జయేంద్ర సరస్వతీస్వామివారు. సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని ప్రబోధించారు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు. మనం ఎక్కడ జీవించినా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో వున్నా పరమాత్ముని సంతానమే. ఈ సృష్టికంతకూ కారణభూతుడైన ఈశ్వరుడొక్కడే..

02/28/2018 - 01:05

ఇటీవల మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సులో ‘సాంకేతిక పరిజ్ఞాన విశ్వరూపం’ ఆనవాలు స్పష్టంగా కనిపించింది. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఊహాగానం చేయడం కాదు. దృశ్యమానంగా కనిపించడం అద్భుతం, అమోఘం. సామాన్యుడు సాధికారత వైపు నడిచేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఊతం ఇస్తోంది. ఆధునిక సాంకేతికత ప్రధాన లక్ష్యం సామాన్య ప్రజల ప్రయోజనమే కావడం గొప్ప విప్లవాత్మక పరిణామం.

02/27/2018 - 00:46

ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వమైనా జమాఖర్చులు, లాభనష్టాలు, పెట్టుబడులు, ఉపసంహరణలు వంటివన్నీ బేరీజు వేసుకుంటూ ఏదో ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఏడాది కాలానికి ఒక నివేదిక సమర్పించడం ఆనవాయితీ. వీటన్నిటితోపాటు మరో కొత్త పద్ధతి అనుసరించడం నేటి రాజకీయం అలవాటు చేసుకుంది. ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారాన్ని నిలుపుకునే దిశగా బేరీజు వేసుకోవడం, అందుకు తగిన పథకాలు, ప్రణాళికలు రూపుదిద్దుకోవడం జరుగుతోంది.

02/24/2018 - 06:43

అఖండ భారతావని నాటి చిన్న చిన్న రాజ్యాలు కనుమరుగై ప్రజాస్వామ్య పాలనా విధానంలో స్వతంత్ర భారతం ఆవిర్భవించింది. సంస్కృతంలో రాజ్యానికి రాష్ట్రం అనే పేరు వుండటంతో, స్వాతంత్య్ర పోరాట కాలంలో అంకురించిన హిందూమత భావైక్యత, దేశం లేదా రాజ్యం లేదా ఒకే రాష్ట్రంగా ఏర్పడాలని హిందూత్వ విశ్వాసులు ప్రగాఢంగా ఆకాంక్షించారు.

02/22/2018 - 23:07

ప్రతి తరం గత తరం భుజాలపై నిల్చొని ఆనాటి తరగతి గది రూపురేఖలను దిద్దుతుంటుంది. దానితో ఎంతోమంది భాగస్వాములు వారి ఫలితమే ఆనాటి సమాజంలో వచ్చిన మార్పులు. ప్రతితరం కొత్త జ్ఞానాన్ని సృష్టిస్తుంది. గత తరం జ్ఞాన వృక్షానికి నీళ్లుపోస్తూ తమ ఆలోచనలను దానిలో పూరిస్తూ ఉంటుంది. కొత్త సమాజానే్న సృష్టించటం కాదు. ఉన్న సమాజాన్ని మెరుగు పరచటం. దీనినే క్రియేటీవ్ థింకింగ్ (కాల్పనిక శక్తి) అంటారు.

02/22/2018 - 07:13

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- ప్రతిరోజూ టీవీ చానల్స్‌లో పొద్దునా, సాయంత్రం వీక్షకుల చెవులు బద్ధలయ్యే స్వరాలతో వచ్చే హోరాహోరీ చర్చోపచర్చలు వింటూ ఉండటం వల్ల! ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ నిలదీస్తూ, కడిగేస్తున్న సందర్భంలో ఆత్మరక్షణలో పడిన సదరు పార్టీనేత ‘ప్రజలు చూస్తున్నారు.. వాస్తవాలు వాళ్లకు తెలుసు’ అనేస్తాడు. ‘కాగల కార్యం

02/21/2018 - 06:31

ఇటీవల ఢిల్లీలో ‘నీతి ఆయోగ్’ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై దేశంలో వెనుకబడిన జిల్లాల సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుపుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నది. విశాఖ, ఖమ్మం జిల్లాల్లోనే మావోల కదలికలున్నాయట. దేశం మొత్తం మీద కేవలం 35 జిల్లాల్లో మాత్రమే వారి ప్రభావం కనిపిస్తోందని ‘నీతి ఆయోగ్’ తెలిపింది.

02/17/2018 - 05:56

సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల మధ్య వివాదానికి తెరపడిందనే అనిపిస్తుంది. గత నెలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించడంతో ఈ విస్ఫోటం మొదలైంది. ఈ నెల 2వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ‘కేసుల విభజన’కు సంబంధించి ప్రకటించిన రోస్టర్ విధానం పత్రికల్లో ప్రాముఖ్యతను సంతరించుకొంది.

02/15/2018 - 23:35

విద్యార్థితో సన్నిహిత సంబంధాలు పెంచుకోక పోవడం అన్నది పదునైన కత్తితో సమానం. అంటే విద్యార్థిని పదునుపెట్టే విధంగా చేయవచ్చు. అది బలుపుగా మారవచ్చు లేదా వాపుగా మారవచ్చు. అలాగే, విద్యార్థితో సన్నిహితత్వం పెంచుకుంటే తనకు తాను ఎక్కువగా అంచనా వేసుకుని నిర్లక్ష్యం కూడా వహించవచ్చు. అది ప్రోత్సాహకరంగా తీసుకుని ముందుకు నడవవచ్చు.

02/15/2018 - 01:00

మందిరం, మసీదు, చర్చి వంటివి పవిత్ర స్థలాలు. సందర్శకులకు, భక్తులకు అనేక నిబంధనలుంటాయి. సెల్‌ఫోన్లు, బ్యాగులతోపాటు బెల్టుల్ని కూడా అనుమతించరు. మరికొన్ని స్థలాల్లో కట్టుకునే దుస్తులపైనా నిబంధనలుంటాయి. టోపీ పెట్టుకోవడం, ముసుగు వేసుకోవడం లాంటివి విధిగా పాటించాల్సిందే! కాని ప్రకృతి ఒడిలో, నదీ తీరాల్లో, సముద్రపు ఇసుక తినె్నలపై ఎలా మసులుకోవాలో నిబంధనలెక్కడా లేవు, అలాంటివి కానరావు.

Pages