S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/02/2016 - 01:34

గ్రామీణ పేద యువతకు వారి బ్రతుకు ప్రగతిబాట వేసేందుకు అపురూప సంపద గ్రంథాలయం. చదువు మనిషి జీవితానికీ... జీవనానికీ వెలుగునిస్తుంది. అయితే మనిషికి రెండు రకాల విద్యను నేర్పేది మాత్రం పుస్తకమే. జీవనోపాధిని ఎలా కల్పించుకోవాలో... రెండోది ఎలా జీవించాలో... విద్యార్థుల్లో మనో వికాసాన్ని పెంపొందిస్తూ మనోబలాన్ని కూడా అందించేవి గ్రంథాలయాలు. గ్రంథాలయాలు విద్యార్థుల విజ్ఞాన జాగృతి నేస్తాలు.

02/01/2016 - 04:45

విద్యార్థుల మనోవికాసాన్ని పెంచి, వారిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపచేసి, పది మంది కలిసి సమైక్యంగా సంతోషాన్ని పంచుకునేందుకు నిర్దేశించిన ప్రత్యేక ఉత్సవాలు, పాఠశాలలో క్రమేపీ కనుమరుగవుతున్నాయి. స్వార్థసంకుచిత భావాలకు దూరంగా కులమతాలకు అతీతంగా, భారతావనీ ప్రాచీన సంస్కృతికి ప్రతి బింబాలుగా నిలుస్తున్న ఉత్సవాలపై పాఠశాలల్లో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకుంటున్నాయి.

01/29/2016 - 23:33

సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు. వీరిలోని మహేశ్వరుడు నిరాకారుడైన ఒక మహత్తరమైన, అద్భుతమైన శక్తిగా ఉద్భవించి సృష్టి నిర్మాణానికి బ్రహ్మ, విష్ణులను అవతరింపజేసి సృష్టికార్యాన్ని ప్రారంభించినాడు. సృష్టికి మూలకర్తలైన వీరికి మాతాపితల ఆవశ్యకత కలగలేదు. అందుకే వీరికి ‘్భగవంతుడు’ అనే నామకరణం వాడుకలోకి వచ్చింది. సృష్టికార్యంలో ఎనభైనాలుగు లక్షల రకాలైన ప్రాణులను ఉద్భవింపజేశారు.

01/29/2016 - 07:41

నవాజ్‌షరీఫ్ ఎప్పుడు ప్రధానమంత్రి అయినా భారత్‌తో స్నేహ సంబంధాలకు ద్వారాలు తెరచి ఉంచుతారు. ఆయన మొదటిసారి ప్రధాని అయిన ఆరు మాసాలకు అంటే 1991 మేలో భారత పత్రికా రచయితకు యిచ్చిన ఒక ఇంటర్వ్యూలో- ‘కాశ్మీర్‌ను మినహాయిస్తే మిగిలినవన్ని చాలా చిన్న సమస్యలు. పాకిస్తాన్- ఇరాన్ దేశాలే స్నేహసంబంధాలను కొనసాగిస్తున్నప్పుడు భారత్- పాకిస్తాన్ దేశాలమధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం సమస్యేమి కాదు.

01/29/2016 - 07:39

సెల్‌ఫోన్లు జేబులో పెట్టుకుంటే గుండెకు ఇబ్బంది కాబట్టి ప్యాంటు బెల్టుకు సంచిలా తయారుచేసి ఇప్పుడు పెట్టుకుంటున్నారు. సెల్‌ఫోన్ వల్లనే, దాని రేడియేషన్ వల్లనే గుండెకు ప్రమాదముందంటే, దానికంటే కొన్ని వేల రెట్లు ఉండే సెల్ టవర్లవలన చాలా ప్రమాదముంటుందని మనం సులువుగానే గ్రహించవచ్చు. మొత్తం భారతదేశంలో ఈ టవర్లు రకరకాలుగా వున్నాయి. ఎఫ్‌ఎం టవర్లు-500, టీ.వి.టవర్లు- 1000, సెల్ టవర్లు- 4,50,000.

01/28/2016 - 04:39

వెయ్యి సంవత్సరాల చరిత్ర పుస్తకాలలో ఏ ఒక్క పుటలోనైనా భారత రాజ్యానే్నలిన వంశాలలో శూద్ర జాతికి చెందిన ఏ ఒక్క వంశం పేరు కూడా కన్పించదు. సైనికులు, సేవకులు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు భారత సమాజంలో 80% పైగా శూద్రులే. సమాజాన్ని నిర్మించిన సకల జాతులు శూద్రులే. కాని వీరికి ప్రాచీన కాలంనుండి ప్రస్తుత కాలంవరకు కూడా ప్రాధాన్యత దక్కలేదు.

01/28/2016 - 04:37

అంతస్తులు గల సమాజం ఎప్పుడూ కూడా తనకన్న తక్కువ హోదా వున్న వారిని నమ్మదు. అధికారంలో వున్నవారి కాళ్లను వదలదు. అలాంటి సమాజం మన విద్యావిధానానికి పునాది వేసింది. ఆ సమాజంలో యంత్రాంగం విద్యార్థిని, ఉపాధ్యాయులిద్దరిని, నమ్మదు. పరీక్షలే మొత్తం విద్యావిధానాన్ని శాసిస్తున్నాయ. అందుకే మన చదువులో తరగతి గదికన్నా పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి పరీక్షలంటేనే పిల్లలకు హడల్‌గా మారింది.

01/27/2016 - 03:21

‘నిర్భయ చట్టం’ వచ్చి రెండు సంవత్సరాలైనది. ఆ చట్టం వలన సమాజంలో మార్పు వచ్చిందా? అంటే రాలేదనే చెప్పాలి. ‘‘పసిమొగ్గపై కామాంధుని వికృత చేష్టలు, విద్యార్థినిపై అఘాయిత్యం చేసిన కీచక ఉపాధ్యాయుడు, లైంగిక వేధింపులకు తాళలేక ప్రాణం తీసికున్న అభాగ్యురాలు, యువతిని నమ్మించి తీసిక వెళ్లి సామూహిక అత్యాచారం చేసిన మానవ మృగాలు’’ యిలాంటి వేదనా పూరిత విషయాలు అటు బుల్లితెరపై ఇటు దినపత్రికల్లో చూస్తున్నాము.

01/25/2016 - 23:56

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న అశాంతి, ఫలితంగా పిహెచ్‌డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య సమాజానికి ఒక విస్తృత సందేశాలను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు తలకెత్తుకున్న.. కాలంచెల్లిన, అప్రస్తుత కులవ్యవస్థలో నయా- బ్రాహ్మ ణ2 వర్గ ఆవిర్భావం అనేది మొదటి సందేశం.

01/25/2016 - 23:55

వెనుకబడిన తరగతుల కులాల్లో తరతరాలుగా వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న కులాలకు చెందినవారు కుల పరంగా, సామాజిక, ఆర్థిక, అసమానతలతో అభివృద్ధికి దూరమై రోడ్డున పడుతున్నారు. ప్రపంచీకరణవలన కుల వృత్తుల్లోకి పెట్టుబడి ప్రవేశించింది. తెలంగాణ రాష్ట్రంలో తరతరాల నుంచి ‘మేదరి కులస్తులు’ అడవుల్లో దొరికే వెదురుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

Pages