S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/08/2016 - 06:12

కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో అత్యున్నతమైన సివిల్ సర్వీసులకు ఎంపిక పరీక్షలను రాజ్యాంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అయితే, సివిల్ సర్వీసు తరువాత క్రమంగా క్రింది స్థాయిలయిన గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగాలను పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పడిన ‘స్ట్ఫా సెలక్షన్ కమిషన్’ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించటం ద్వారా భర్తీ చేస్తుంది.

01/07/2016 - 00:05

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర గ్రంథాలయంగా హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లోని గ్రంథాలయం వుండేది. ఇప్పుడది తెలుగు రాష్ట్రాల విభజనానంతరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర గ్రంథాలయం అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ పౌర సంచాలకుల కార్యాలయం తాత్కాలికంగా అఫ్జల్‌గంజ్ గ్రంథాలయంలో కార్యకలాపాలు సాగిస్తోంది.

01/06/2016 - 23:59

తరగతి గదిలో జరిగేది ప్రాసెస్ కానీ ప్రాజెక్ట్ కాదు. విద్యార్థికి హోంవర్క్ ఇవ్వగానే సరిపోదు. తల్లి వంట చేయగానే సరిపోదు. ఆ వంట తిని పిల్లలు కేరింతలు వేస్తేనే తల్లి ఉల్లాసంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఆ హోంవర్క్‌ను లెన్స్ పెట్టుకుని చూడాలి. కొన్నిసార్లు ఉపాధ్యాయుడికి కూడా విద్యార్థి పాఠం చెప్పవచ్చును. ఈ విద్యార్థికి వచ్చిన ఐడియా తనకెందుకు రాలేదని ఉపాధ్యాయుడు సంతోష పడుతుంటాడు. విద్యార్థిది ఫ్రెష్ మైండ్.

01/06/2016 - 01:04

ప్రధాని నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన సందర్భం గా, తన ప్రసంగాల్లో మనదేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొంటూ వచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో అనేక దేశాలవారు నివసిస్తుం టే, మన దేశవాసులు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నారని చమత్కరించారు.

01/06/2016 - 01:02

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుదిపేస్తున్న సమస్యల్లో బీఫ్ ఫెస్టివల్ ఒకటి. మన హిందువుల సాంప్రదాయాల్లో గోవును మాతగా గౌరవించడం, పూజించడం మనకు ఎప్పటినుండో ఉన్నది. కుల, మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు గోవును గౌరవిస్తారు. కొందరి ప్రవర్తనల వల్ల గోవులు అంతరించిపోతున్నాయి. గోవధలో భాగంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతవరకు సబబు.

01/05/2016 - 04:45

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా స్థానిక పరిస్థితులకు ఉద్యోగులకు ఉపయుక్తమైన సర్వీసు నిబంధనలను మార్చడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయి. బ్రిటీష్ పాలకులు తమ దమననీతితో, విభజించి పాలించడానికి తమకు వంతపాడే ఉద్యోగులను, అధికారులను అందలాలు ఎక్కిస్తూ అన్యాయాలను ప్రతిఘటించే ఉద్యోగులను, అధికారులను క్రమశిక్షణ కేసుల పేరుతో నిరంకుశంగా అణగదొక్కేవారు.

01/04/2016 - 05:03

‘‘స్వచ్ఛ్భారత్’’ పదం దాదాపు సంవత్సర కాలంనుండి వింటున్నాం. పదం వినే దానికి స్వచ్ఛంగా, అందంగా వుంది. అమలుకు మాత్రం ఆమడదూరమన్నది అక్షర సత్యం. స్వచ్ఛ్భారత్ ముందుకు సాగలేక చతికిలపడిందెందుకు? అని మనం లోతుగా ఆలోచిస్తే, ‘కర్ణుని చావుకెన్నో కారణాలు’గా విఫల కారణాలు కనిపిస్తాయి. స్వచ్ఛ్భారత్ విషయంలో ఎవరికివారు నాకెందుకు అనేలా ప్రవర్తిస్తున్నారన్నది వాస్తవం. చిత్తశుద్ధి లోపం పుష్కలం.

01/03/2016 - 06:57

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా జర్నలిస్టులను నిర్బంధించడం ద్వారా చైనా రికార్డ్ నెలకొల్పింది. నాటకీయంగా 2015లో టర్కీ, ఈజిప్ట్‌లలో సహితం పెద్దసంఖ్యలో జర్నలిస్టులను జైళ్ళలో ఉంచారు. అయితే ప్రపంచం మొత్తంమీద జైళ్ళలో ఉన్న జర్నలిస్టుల సంఖ్య మూడేళ్ళలో గత సంవత్సరం కొంతమేర తగ్గింది.

01/02/2016 - 06:59

భారతదేశం ప్రజాస్వామిక దేశం కావచ్చు. ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా విహంగాలై తమ వైయక్తిక జీవనాన్ని గడుపుతూ సభ్య సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయ. దీనిని ప్రతి పౌరుడు గుర్తెరిగి తోటి వారి మనోభావాలను కించపరచని రీతిలో, సమాజాన్ని విచ్ఛిన్నపరిచే పద్ధతిలో వ్యవహరించకుండా రాజ్యాంగం ప్రసాదించిన సర్వహక్కులను సంపూర్ణంగా పొందేవారు మాత్రమే గౌరవనీయులు. సమాజ హితైషులు.

01/01/2016 - 05:02

ఏ విద్య అయినా గురుముఖత నేర్చుకోవాలి. గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. దేశంలో అందరూ ఆఘమేఘాలమీద విద్యావంతులై పోవాలని మన ప్రభుత్వం అత్యాశతో విద్యనేర్పడానికి అనేక సంప్రదాయేతర విధానాలను ప్రవేశపెట్టింది. ముందుగా వయోజన విద్య ప్రారంభమైంది. ఇది రాత్రివేళ జరిగేది. తరువాత కొంతకాలానికి రద్దయింది. తిరిగి ఈ శతాబ్ది ప్రారంభంలో పెద్ద యెత్తున ప్రారంభించారు.

Pages