S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/01/2016 - 05:02

చక్కని భావి టీచర్లను తయారు చేయాల్సిన ప్రభుత్వ బిఇడి డైట్ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయ. నాణ్యమైన ఉపాధ్యాయ విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు అమలులో ఆమడ దూరంలో ఉన్నారు.

12/31/2015 - 04:46

దత్తత అంటే ఏమిటి? దత్తత అంటే నాది- నేను అనే అర్థం. దత్తత.. వ్యక్తి లేదా గ్రామాన్ని తన వారుగా తన కుటుంబ వ్యక్తిగా పరిగణించి, బాధ్యత వహించి ముందుకు నడిపించాలి.

12/31/2015 - 04:45

ఒకనాడు నేను తరగతి గదినుంచి వచ్చేవరకే ఒక ఆవిడ వచ్చి మా పిల్లవానికి ఒక హోంవర్క్ ఇచ్చారు. మాక్సిమా, మినిమాతోపాటు ఆల్‌జీబ్రా ఉంది. సంఖ్యాశాస్త్రం ఉన్నది. ఈ మూడింటిని కలిపి హోంవర్క్ ఇస్తే ఎంతో కష్టం కదా అని ప్రశ్నించింది. ఐఐటి లోపల ఒక ప్రశ్న ఒకే చాప్టర్‌కు సంబంధించింది ఉండదు. సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అలవాటు చేయటంకోసమే ఆ ప్రశ్న ఇచ్చాను అన్నాను. ఆవిడ వెళ్లిపోయింది. నాకు సంతోషమైంది.

12/29/2015 - 22:33

మానవుల సగటు ఆయుఃప్రమాణం 1920 ప్రాంతంలో చాలా తక్కువగా ఉండేది. ఆ కాఠణంగా అన్నదమ్ములు చిన్న వయస్సులోనే తల్లితండ్రులిద్దరినీ కోల్పోయారు. కొద్దిపాటి వ్యవసాయ భూమి మాత్రమే ఉన్న వారికి చదువుకోవాలన్న కోరిక తీవ్రంగా ఉంది. నేటివలె ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మీల్స్ వం టివి అప్పుడు లేవు. ప్రభుత్వ పాఠశాలలోనైనా ఫీజుకట్టి చదువుకోవలసిందే. అన్నగారు వయస్సులో చిన్నవాడైనా ఆలోచించి పరిష్కారం కనుగొన్నాడు.

12/29/2015 - 22:33

చదువు అంటే వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే కాయకష్టం చేసి, తమ కుటుంబాన్ని పోషించుకోవడం. ప్రతి రోజు ఉదయానే్న కూలి పనులకు వెళ్ళి, సాయంత్రం ఎప్పుడో తిరిగి రావడం వారి దినచర్య. వారి పిల్లలు రోడ్ల వెంబడి తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కాగితాలు ఏరుకొని, వాటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వారికి పాఠశాల అంటే ఎలా ఉంటుందో, చదువుకోవడం అంటే ఏమిటో తెలియదు.

12/28/2015 - 22:50

కొత్త విద్యా సంవత్సరం దాదాపు మూడువంతులు పూర్తికా వచ్చింది. కానీ సర్కారు బడుల్లో సమస్యలు తిష్టవేసే వున్నాయి. పాఠశాల భవనాల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, మరుగున పడిన మరుగుదొడ్లు, నీటి సమస్య సక్రమంగా అమలుకాని మధ్యాహ్నభోజన పథకం, అధ్యాపక కొరత ఇలా ఎన్నో ఎనె్నన్నో సమస్యలు విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నాయి అనటం అతిశయోక్తికాదు.

12/28/2015 - 00:39

‘‘సృష్టిపుట్టకముందే రాముడు పుట్టిండు,’’ అధునాతన పరిశోధకులు తేల్చిన మాట రోజు, వారం, నెల, సంవత్సరం, దశాబ్దం, సహస్రాబ్దం అనేవి కాలం యొక్క పరిధులను తెలియజేసేవి. వీటి మాదిరిగానే యుగము, మహాయుగము కల్పము, మన్వంతరము. కృతయుగం- 17,28,000 సంవత్సనాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాల వయస్సులు కలిగి ఉన్నాయి. ఈ నాలుగు యుగాలను కలిపి ‘మహాయుగం’ అంటారు.

12/25/2015 - 23:58

మాట్లాడితే మనసేమిటో తెలుస్తుంది తప్ప పోయేదేమీ వుండదు. అవసరం వుంటే తప్ప పెదవి కదపనివారు వౌనమునులుగా చెలామణవుతారా? అవకాశవాదులుగా మిగిలిపోతారా? సందర్భం కాకపోయినా ఏదిపడితే అది మాట్లాడేవారు అధిక ప్రసంగానికి చిరునామాగా వుండిపోతారా? ఒక్కొక్క ప్రశ్నకు విభిన్నమైన సమాధానాలు సైతం మాటల రూపంలోనే వినిపిస్తుంటాయి.

12/24/2015 - 22:40

‘నేషనల్ హెరాల్డ్’ స్వాతంత్య్ర సమర కాలంలో అఖిల భారత కాంగ్రెస్ భావాలను బాగా ప్రచారం చేసిన పత్రిక. 1940 దశకంలో ఆ పత్రికకు ఎం.చలపతిరావు సంపాదకులుగా ఉండేవారు. ఆయన నెహ్రూ మిత్రుడు. నెహ్రూ రాజకీయ నాయకుడే కాదు, ఉద్విగ్నమైన ‘నేషనల్ హెరాల్డ్’ అనుభవాలతో పాలుపంచుకున్న ప్రతినిధి కూడా. ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెహ్రూ పర్యటన ఏర్పాటైంది.

12/24/2015 - 22:39

అయుత చండీయాగం ఒక అపూర్వమైన యోగం. తెలంగాణ రాష్ట్రానికే కాదు తెలుగు ప్రజలందరికీ కీర్తి ప్రతిష్ఠలను, దైవానుగ్రహాన్ని కలిగించే సుయోగం. ‘‘అగ్నిముఖావై దేవాః’’ అన్నది వేదవాక్యం. ‘‘అగ్ని మీళే పురోహితం’’ అనేది ప్రథమ వేదమైన ఋగ్వేదంలోని ప్రథమ మంత్రం.

Pages