S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/17/2015 - 04:59

ఇవాళ నేను 10 నిమిషాలు ఆలస్యంగా లేచాను. నేను వాకింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది నాకు ఉమెన్స్ కాలేజీ దగ్గర కనబడేవారు. మరికొందరు విసి లాడ్జి దగ్గర కనబడేవారు. ఇంకొందరు మంది ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర తారసపడేవారు. ఇవాళ వారెవ్వరూ కనపడలేదు. నేను ప్రశ్నించుకున్నాను. 10 నిమిషాలు ఆలస్యం చేయటంవలన నాకు వీరందరు కనపడలేదు కదా! ప్రపంచమంతా ఒక క్రమంగా పనిచేస్తుంటే నేను క్రమంతప్పితే క్రమశిక్షణ లేని మనిషినే అంటారు.

12/16/2015 - 06:45

సంపద కొందరి చేతుల్లోకి అపరిమితంగా చేరి అసమానతలు అమిత వేగంగా భారత్‌లో పెరిగిపోతున్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. విన్నింగ్ గ్రోత్ గేమ్స్: గ్లోబల్ వెల్త్ 2015 నివేదిక అదే విషయాన్ని సాధికారంగా తెలిపింది. అమెరికాలోని బోస్టన్ కన్సల్టింగ్ ఏజన్సీ జరిపిన అధ్యయనం దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక అసమానతలపై ఇదొక సమగ్ర నివేదికగా పేర్కొనవచ్చునని కొందరు విశే్లషకులు అంటున్నారు.

12/16/2015 - 06:44

జీవావరణ వ్యవస్థలోని జనాభా పెరుగుదలవల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. జనాభా పెరిగేకొద్దీ మానవ నివాసానికి, వ్యవసాయ భూమి, వంట చెరుకు కోసం అడవులను, పచ్చిక బయళ్ళను నాశనం చేస్తుండటంవల్ల భూమి మృత్తికలు, వాటిలోని సారం కొట్టుకుపోతున్నాయి. సాగుచేయడం ద్వారా మిగిలే వ్యర్థ, ఘన, ద్రవ పదార్థాలు, అనాగరిక పారిశుద్ధ్య అలవాట్లవల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోంది.

12/15/2015 - 02:59

భారతీయులకు సహనం ఎక్కువ. అందువల్లనే బ్రిటిష్‌వారు శతాబ్దాల తరబడి మన దేశాన్ని పాలించే పేరుతో దోచుకొన్నారు. స్వాతంత్య్రంకోసం ఉద్యమిస్తున్న ఎందరినో అతి కిరాతకంగా హత్యలు చేయడంతోపాటు, లక్షలాది మందిని కర్కశంగా చిత్రహింసలకు గురిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన తరువాత, తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు.

12/14/2015 - 05:47

సుప్రీంజీ కుక్కలపై మీ ప్రేమ తగ్గిస్తే పౌరులకు సేవ చేసినవారౌతారు. కుక్కల్ని చంపకండి. వాటి సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయమని మీరు సలహా ఇచ్చారు. కుక్కల్ని పట్టుకోవటమే కష్టం. పట్టిన కుక్కలకి ఆపరేషన్ ఎలా చేస్తారు. ఆలోచించండి. కుక్కల కారణంగా నేడు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కుక్క కాటు వ్యాక్సిన్‌లు ఎక్కువగా దొరకటంలేదు. ఏమి చేయలేని స్థితిలో ఉన్నామని ప్రభుత్వ డాక్టర్లు వాపోతున్నారు.

12/13/2015 - 04:15

డిసెంబరు 2015 మొదటి వారంలో చెన్నై నగరం చిన్న ద్వీపంగా మారిపోయింది. అనూహ్యమైన వర్షాల కారణంగా అడయార్ నది పొంగింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ ప్రాకృతిక విపత్తుకు వెంటనే కేంద్రం స్పందించి సకాలంలో సహాయ సహకారాలు అందించింది. గత నూరు సంవత్సరాల కాలంలోను చెన్నై ఇలాంటి ఉపద్రవాన్ని చూచి ఎరుగదు.

12/12/2015 - 04:51

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరాచేస్తున్న రేషన్ బియ్యం అక్రమాలకు తెర పడటం లేదు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడంలేదు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలనుండి బియ్యం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అక్రమ మార్గాన వెళ్ళిపోతోంది.

12/11/2015 - 05:27

పోయిన సంవత్సరం అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీగారి ఉపన్యాసం అనటం కన్నా ‘స్వచ్ఛ భారత’ పిలుపు దూరదర్శినిలో చూస్తూ వినటం జరిగింది. ఎప్పటిలాగానే ఆయన ఉపన్యాస వైఖరి అందర్నీ మంత్ర ముగ్ధులను చేసింది.

12/11/2015 - 05:26

అగ్నికి బద్ధశత్రువు హిమం (మంచు). అయితే ప్రకృతి అందాలకు కొలువైన కాశ్మీర్‌లో మాత్రం అటు హిమం, ఇటు అగ్ని చెట్టపట్టాల్ వేసుకొని ‘హిమగ్ని’గా మారాయి. అటువంటి ‘హిమగ్ని’ని తిరిగి హిమం, అగ్నిగా వేరుచేయడానికి గత నాలుగున్నర దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిమగ్నిలో సమిధలుగా మారుతున్నది యువత.

12/10/2015 - 05:13

రాష్ట్రంలో విద్యాశాఖని అవినీతి చెదలు తినేస్తున్నాయి. విద్యాశాఖలో గత ప్రభుత్వ అధికారంలో ఉండగా ఉప విద్యాశాఖాధికారుని నియామకానికి నోటిఫికేషన్ జారీచేసి వ్రాతపరీక్షలకు భారీ మొత్తాల్లో వసూలుచేసి ఒకే సామాజిక వర్గానికి చెందినవారిని ఎంపిక చేశారు అనే ఆరోపణలున్నాయి. వీరందరూ దొడ్డిదారిలో అధికారులైపోయారు. అక్రమ సంపాదనను అలవాటుగా మార్చుకొని అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

Pages