S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/10/2015 - 05:12

అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొనాలి. అందుకు పరిపాలనా వికేంద్రీకరణ అవసరం. సుపరిపాలనకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు. వనరులు సమకూర్చుకోవడం ఎంత ముఖ్యమో వాటిని సక్రమంగా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అనేక అభివృద్ధి కార్యక్రమాలను దేశ రాజధానినుండి ఆమాటకొస్తే రాష్ట్ర రాజధాని నుండి అమలుచేయడం కష్టం, వాంఛనీయం కూడా కాదు. కొన్ని సమస్యలు స్థానిక స్థాయిలో వున్నవారికే అర్థమవుతాయి.

12/09/2015 - 05:53

మా ఆయుధాలు సముద్ర మార్గం ద్వారా వస్తున్నాయి. ఒక్క ఆయుధం కూడ చేతిలో లేదు.. అదే సమయంలో అల్లరి మూకలు ఆయుధాలతో దాడులు చేయడానికి వస్తున్నాయి.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండమని ఐక్యరాజ్యసమితి కమాండర్ నుంచి ఆదేశాలు. మరుసటి రోజు అల్లరిమూకలు రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసురుతూ హింసకు పాల్పడటం ప్రారంభించాయి. అయినప్పటికీ, ఒక మహిళా బెటాలియన్ ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా అల్లరిమూకలను తరిమికొట్టింది.

12/09/2015 - 05:52

ర్యాగింగ్ అనేది ఒక ఎగతాళి. వేధింపు. ఇది స్కూల్లో, కాలేజీల్లో మాత్రమే చేసేది కాదు. ఇది పుట్టుకతోనే మొదలౌతుంది! ఎవరైనా, ఆడ లేక మగ బిడ్డను ప్రసవించినట్లైతే ఆ బిడ్డను చూసిన తమ వాళ్ళే, అయ్యో! బిడ్డ కర్రిగా వుందనో, కళ్ళు సరిగాలేవనో, ముక్కునోరు సరిగాలేవనో రకరకాలుగా వంకలు పెడుతూ..ఎగతాళి చేస్తారు. వారేదో రతీమన్మథుల లాగ వున్నట్లు!

12/07/2015 - 23:46

మనది వ్యావసాయిక దేశం. 70 శాతం మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పూర్తిగా పారిశ్రామిక దేశంగా మారిపోయిందనుకోండి. అప్పుడు ఆహారాన్ని పండించేవారు కొరవడటంతో, తిండికి సంబంధించిన కొరత ఏర్పడక మానదు. పురాణకాలం నుంచీ కొనసాగుతున్న పరంపరాగత సంస్కృతి ప్రధానంగా వ్యవసాయాధారితంగా వృద్ధి చెందిదేనన్నది మరువరాదు. కృష్ణుడు గోపాలకుడైతే, బలరాముడు హలధారి. వీరిద్దరూ పాడిపండలకు అధిదేవతలు!

12/07/2015 - 04:11

డిసెంబర్ 6వ తేదీని వివిధ ముస్లిం సంస్థలు, వారి సర్వకాల స్నేహితులు, కమ్యూనిస్టులు-రక రకాల అంత్య ప్రత్యయాలను తగిలిగించుకున్నవారు- ప్రముఖ మార్కిస్టు మేధావులు ‘బ్లాక్ డే’గా పాటించారు. 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రి కట్టడాన్ని కూల్చివేయడం వీరు ఈ విధంగా బ్లాక్ డేను పాటించడానికి ప్రధాన కారణం.

12/07/2015 - 04:08

ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అక్షరాల అమలుచేయాల్సి ఉండగా పాలకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఆశ కార్యకర్తలను వెట్టిచాకిరికి గురిచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవలు అమలుకావాలంటే క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం. ఆశా కార్యకర్తలకు అధికారులు అందించే వేతనం దినసరి కూలీ కంటే అధ్వాన్నంగా ఉంది. వెట్టిచాకిరి చేయించుకుని అరకొర పారితోషికం ఇస్తున్నారు.

12/05/2015 - 04:00

ఏ మతానికో చెందిన వారిగా కాకుండా, కేవలం ఒక దేశపౌరులుగా నాగరికత కలిగిన మానవులుగా కాసేపు ఆలోచిద్దాం.. కేవలం ఒక మతంపై ద్వేషంతో, తమ దౌష్ట్యాన్ని ప్రదర్శించడానికి, ‘కవ్వింపు చర్యగా’ మతకలహాలకు దారితీస్తూ, దేశాన్ని అశాంతి పాలు చేసే అనాగరక కృత్యంగా స్పష్టంగా కనబతుతున్న అంశం: బహిరంగంగా గోమాంస భక్షణను ప్రకటించడం, సవాలు విసరడం.

12/04/2015 - 03:48

జనం ఆకలిని తీర్చే రైస్‌మిల్లు పరిశ్రమ సంక్షోభంలో కూరుకొని పోయింది. కోట్ల రూపాయలు పెట్టి రైస్‌మిల్లు పరిశ్రమను స్థాపిస్తే, పాలకుల తలాతోక లేని పాలసీలు, అధికారుల నిర్లక్ష్యంవల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పారాబాయిల్డ్, రా రైస్‌మిల్లులు మూతపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోను సుమారు 4వేల వరకు రైస్ మిల్లులు ఉన్నాయి.

12/04/2015 - 03:45

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 మేరకు హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని, అలాగే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని విభజించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈమేరకు గవర్నర్ చొరవ ప్రదర్శించి తగు ఏర్పాట్లుచేయాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు నొక్కిచెబుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రెండుగా విభజించారు.

12/03/2015 - 03:08

ఆటవిక సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువుంటుంది. సమాజ నియంత్రణ త క్కువుంటుంది. రక్షణ, భద్రతా తక్కువే. శారీరక బలం, మందిబలం వున్నవారిదే అక్కడ అధికారం. సభ్యసమాజంలో వ్యక్తిస్వేచ్ఛ తక్కువుంటుంది. సమాజ నియంత్రణ ఎక్కువుంటుంది. కాని రక్షణ భద్రత వుంటాయక్కడ. వ్యక్తి, సమూహం, గణం, పౌరసత్వం, సమాజం, రాజ్యం- ఇది రాజ్యావిర్భావానికి పరిణామక్రమం!

Pages