S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/23/2019 - 02:49

తిరుగులేని మెజారిటీతో నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక విపక్షపార్టీలకు అయోమయ పరిస్థితి ఎదురైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలందరూ ప్రాంతీయత, కులమతాలకతీతంగా దేశ ప్రగతి, దేశ సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తూ భాజపాకు అఖండ మెజారిటీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర విపక్ష నేతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

07/21/2019 - 02:13

మన దేశంలో ఉచిత నిర్బంధ విద్య అమలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగంలో 1 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలకలకు నిర్బంధ విద్యనందించాలని నిర్దేశించారు. కాని 72 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నిర్భంధ విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు సఫలీకృతం కావడం లేదు.

07/19/2019 - 22:09

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ ప్రాంతం కమనీయ దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పుట్టినిల్లులా దర్శనమిస్తుంది. దేశంలోనే పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. గతంలో ‘నాగార్జునసాగర్ పులుల అభయారణ్య ప్రాంతం’గా పిలవబడినప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంగా మార్పు చెందింది. వన్యప్రాణుల స్వేచ్ఛా జీవనానికి, అరుదైన వనమూలికలకు ఈ ప్రాంతం పేరుపొందింది.

07/18/2019 - 22:11

‘‘పంచపాండవులు ఎంతమంది అంటే.. మంచం కోళ్ల మాదిరి మూడే..’’ అంటూ రెండు చూపుడు వేళ్లు చూపించాడట వెనుకటికి ఒక వ్యక్తి. వెనుకబడ్డ ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు నూతన ప్రభుత్వం కేటాయించిన నిధుల గురించి పరిశీలిస్తే అదే సామెత గుర్తుకొస్తుంది. ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ. 24 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

07/17/2019 - 05:09

ఓ వైపు చందమామ పైకి ‘ఇస్రో’ రోవర్‌ను పంపేందుకు సర్వసన్నద్ధమవుతున్న వేళ.. ఇటు మావోయిస్టులు ప్రజలను కిరాతకంగా చంపుతూ హత్యా రాజకీయం చేస్తున్నారు. ఇదెంత విచిత్రం!

07/16/2019 - 22:29

ద్వితీయ ప్రపంచ సంగ్రామం నాటి కాలంలో- 1945 జూలై 16వ తేదీ అణుబాంబు ఆవిర్భవించిన న్యూక్లియర్ శకావిష్కరణకు గుర్తుగా ప్రపంచ చరిత్రలో మిగిలిపోయంది. అమెరికాలోని న్యూ మెక్సికోలో లాస్ ఆలమ్స్ ప్రాంతానికి 200 మైళ్ల దూరంలో ఉత్తర ఎడారిలో- ప్రప్రథమంగా అణుబాంబు పరీక్షకు ఆనాటి ఉదయం 5.30 గంటల ముహూర్తం నిర్ణయమైంది.

07/14/2019 - 02:37

ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతిలో గోసంరక్షణకు అత్యంత ప్రధాన స్థానముంది. వేదాలలో గోవు ‘అఘ్న’ అని పేర్కొనబడింది. దానికి అర్థం ‘వధింపబడరానిది’ అని. గోసంరక్షణ అనేది ఒక ఆధ్యాత్మిక సాధన గానే కాదు, సమాజ ఆర్థిక వికాసంలో ప్రధాన పాత్ర వహించింది కూడా. చక్రవర్తుల నుంచి అతి సాధారణ పౌరుని వరకు ప్రతి ఒక్కరూ గోసంరక్షణ, పోషణతో పాటు వాటిని ఆరాధన గావించారు.

07/13/2019 - 01:47

కొందరు అతివాద హిందువులు మన దేశంలో ముస్లింలు తదితర మైనారిటీలపై దాడు లు చేస్తున్నారని ఇటీవల ప్రచారమవుతోంది. ఈ వార్త అమెరికాలోని ‘మత స్వేచ్ఛా సంస్థ’ వార్షిక నివేదికలో ప్రముఖంగా వచ్చింది. విదేశీ సంస్థలు మన గౌరవాన్ని భంగపరిచాయన్న నిజాన్ని విస్మరించి, ఇలాంటి తప్పుడు నివేదికలను ‘సెక్యులరిస్టుల’ ముసుగులో కొందరు నేతలు స్వార్థానికి వాడుకుంటున్నారు.

07/12/2019 - 02:12

ఆషాఢ మాసం ఆరంభమైనప్పటికీ ప్రస్తుత వర్షాకాలంలో చినుకు జాడ లేక తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి వానలు సమృద్ధిగా కురిసి ఖరీఫ్‌కు రైతాంగం సమాయత్తమయ్యే పరిస్థితి కానరావడం లేదు.

07/10/2019 - 02:47

డిజిటల్ ఎకానమీ వైపు 2018-19 సంవత్సర ఆర్థిక సర్వే వేలు చూ పింది. ప్రపంచ మార్కెట్లను చేరేందుకు 5జీ సాంకేతిక పరిజ్ఞానం చక్కటి అవకాశమని సూచించింది. ఈ ఏడాది 5జీ స్ప్రెక్ట్రమ్ వేలం వేస్తే రూ.4.9 లక్షల కోట్లు రావొచ్చునన్న అభిప్రాయం వ్యక్తమైంది.

Pages