S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/28/2020 - 01:19

ఉగ్రవాదులకు ధన సహాయం అందకుండా ‘కట్టడి’ చేయడంలో పాకిస్తాన్ విఫలమైన కారణంగా ‘‘గ్రే లిస్టు’’లోనే కొనసాగించాలని పారిస్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర నిధుల మార్గాలపై కనే్నసి ఉంచి, ఆర్థిక చర్యలను తీసుకునే ఆక్షన్ కమిటీ (ఎఫ్‌ఏటిఎఫ్) మరోసారి సిఫారసు చేసింది. ఈ గ్రేలిస్టునుంచి బయటపడేందుకు పాకిస్తాన్ కొన్ని కంటితుడుపు చర్యలు తీసుకున్నా కమిటీ సంతృప్తి చెందలేదు.

02/27/2020 - 00:03

నెహ్రూ గాంధీల సారథ్యం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదు, ఇది ఒకప్పటి మాట. పార్టీలోనే కాదు, మేథావులు, రాజకీయ విశే్లషకులు, సామాన్య ప్రజలు అందిరిలోనూ ఉన్న అభిప్రాయం.

02/26/2020 - 04:06

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక శాసనసభ్యుల మెజారిటీతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రలో భాగంగా ప్రజలకు నవరత్నాల ఎన్నికల నిబంధనలమేరకు మహిళలకు ఇచ్చిన హామీలలో భాగంగా మద్య నిషేధాన్ని అంచెలువారిగా అమలుపర్చడంలో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలను, పట్టణ, హైటెక్ సిటీలలో బార్లు సంఖ్యను కుదించడంలో సర్కారు ఫలప్రదమైందనే విషయంలో ఏమాత్రం సత్యం గోచరించడం ల

02/25/2020 - 00:10

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం కూడా వుంది. 70 సం.ల చరిత్ర మనది. దురదృష్టంకొద్దీ రానురాను మన దేశ రాజకీయాలు చాలా దిగజారిపోతున్నాయి. గెలుపు ఒక మలుపుగా మారి ప్రజల జీవితాలు ఎంతో బాగుపడతాయని ప్రతి ఎన్నికల సమయంలో మనందరం ఆశిస్తాం. ఒక్క మంచి చెడే గెలుపునకు మూలం కాదు. అనేక అడ్డదారులు త్రొక్కడంవల్ల కూడా చాలామంది ఎన్నికల్లో గెలుపు పొందుతున్నారు.

02/24/2020 - 23:46

ఓచెట్టుకింద మల్లయ్య తపస్సు చేసుకుంటున్నాడు. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు.
‘నా శత్రువు పుల్లయ్య ఆ సరస్సువద్ద తపస్సు చేసుకుంటున్నాడు- వాడి దగ్గరికి వెళ్లి మళ్లీ రండి స్వామీ’ అన్నాడు పుల్లయ్య.
‘మళ్లీ రాను- నీకేం కావాలో ఇప్పుడే కోరుకో’ అన్నాడు పరమశివుడు.

02/22/2020 - 22:31

భారత పౌరులకు ఏమాత్రం సంబంధం లేని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై గత రెండు మాసాలకు పైగా అటు ఢిల్లీలో ఇటు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ప్రదర్శనలు, ఆగ్రహజ్వాలలు అర్ధరహితమని తెలిసినా చాలామంది తమ రాజకీయ అవసరాల కోసం, దానిపై విమర్శలు చేస్తున్నారు.

02/21/2020 - 00:49

మాతృభాష తల్లి పాలతో సమానం. శిశువుకు తల్లిపాలు లభించనట్లయితే ఏ విధంగా అనారోగ్యం పాలవుతాడో మాతృభాష అభ్యసించలేని విద్యార్థి కూడా విషయాలు నేర్చుకోవడంలో వెనుకబడతాడు. 1999వ సంవత్సరంలో యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించడంతో 2000 సంవత్సరంనుండి ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ భాషలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

02/20/2020 - 00:27

1848 ఫిబ్రవరి 21. ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. నిద్రాణంగా ఉన్న జర్మనీ తాత్విక పునాది నుండి నాడు విరిసిన గులాబి నేటికీ విముక్తి సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది. నాడు జర్మనీ కార్మికవర్గ విముక్తి కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అనతి కాలంలోనే విశ్వనరుని విముక్తి గీతంగా మారింది.

02/18/2020 - 02:12

సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు భారత పాలక వర్గాలు లొంగిపోయి వచ్చే ఏడాదికి 30 ఏళ్లు పూర్తికానున్నది. ఈ లొంగుబాటు పర్యవసానం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్ఫుటమవుతోంది. ఇక నుండి ఈ రాష్ట్రాన్ని ఆంగ్లప్రదేశ్ అని పిలుచుకోవడమే సమంజసంగా ఉంటుంది.

02/16/2020 - 02:57

ఎన్నికలలో ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి గెలుపు కోసమే పోటీ చేస్తారు. చివరి వరకు అందుకోసమే ప్రయత్నిస్తారు. అంతేకానీ, ఇంకొకరి గెలుపు ఓటముల కోసం పోటీ చేసే పార్టీ సహజంగా అయితే ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని పార్టీలు కొందరు అభ్యర్థులు వేరొకరి గెలుపు/ఓటమికి ఉపకరించేందుకు ఎన్నికల బరిలో దిగడం ఉంటుంది. అయితే, అలాంటి పార్టీలు అట్టే కాలం మన లేవు. మఖలో పుట్టి పుబ్బలో పుటుక్కుమని పోతాయి.

Pages