S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/27/2018 - 01:22

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కుతూ సందర్శకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘విజన్’కు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగం విస్తరిస్తోంది. సహజ సిద్ధంగా ఉన్న అన్ని అవకాశాలను పర్యాటక శాఖ సద్వినియోగం చేసుకుంటోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తోంది.

12/26/2018 - 01:13

దేశ ఆర్థిక వృద్ధి రేటు 9-10 శాతం సాధించాలని, 2022-23 సంవత్సరం నాటికి రూ.28 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ‘నీతి ఆయోగ్’ ఇటీవల వ్యూహపత్రాన్ని ప్రకటించింది. దేశం ఇప్పుడొక సంధియుగంలో ఉందని, గతంలో కోల్పోయిన అవకాశాల్ని సరిదిద్దుకునే సమయమిదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు.

12/25/2018 - 01:47

ప్రపంచంలోకెల్లా జనాభాపరంగా రెండవ స్థానంలో వున్న మన భారతదేశంలో యువత పరంగా ప్రథమస్థానంలో వుంది. భారతదేశానికి అతి పెద్ద వరం ఆ దేశంలో వున్న యువతేనని ఇటీవలి కాలంలో అమెరికా, చైనా, రష్యా అధ్యక్షులు ప్రకటించడం చూస్తుంటే మనకు ఎంత మంచి సంపద లభించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోవున్న యువత వంటి మానవ వనరులతో మేము అద్భుతాలను సాధించగలమని ఫ్రాన్స్ అధ్యక్షులు స్వయంగా సెలవిచ్చారు.

12/22/2018 - 22:21

ఛ త్తీస్‌గఢ్ అనగానే మావోయిస్టులు గుర్తుకొస్తారు. ఆ రాష్ట్రంలోని అబూజ్‌మాడీ అటవీ ప్రాంతాన్ని ‘‘విముక్తి ప్రాంతం’’గా చేసుకుని సమాంతరంగా జనతన సర్కారు నడుపుతున్నారని వినికిడి. సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల, దళారి- బూర్జువా వర్గాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని ఆదివాసీల చేత మావోయిస్టులు అసహజ రీతిలో చెప్పిస్తున్నారు.

12/21/2018 - 23:08

అజనాభము, ఆర్యావర్తనము, ధర్మభూమి, కర్మభూమి అనబడే విశిష్ఠ పదాలతో పిలువబడే భరతవర్షము, భరత ఖండము, భారతదేశము అనబడే మన దేశము తొలి మనువుచే పరిపాలించబడిన భూభాగమే పుణ్యభూమి హిందుస్థానము. ఈ హిందుస్థానములోనే మానవ సృష్టి ప్రారంభమైనదని వేద శాస్త్ర పురాణ ప్రమాణములచే పరిశోధనాత్మకమైన కృషి సల్పిన మేధావులు నిరూపించినారు.

12/21/2018 - 01:11

చిన్నపిల్లల సంచుల్లో పుస్తకాలను నింపడం కన్నా వారి మనసుల్లో జీవిత ఆశయాలు నింపాలి. ‘నేను నిరర్థకుణ్ణి.. నేను బలహీనుణ్ణి.. నేను పెద్దవాళ్లు ఆడుకునే కీలుబొమ్మను..’ అనే ఆలోచనలు వారి మెదళ్లలోకి రాకూడదు. ‘నాకు ఒక అస్తిత్వం ఉంది.. నాకొక వ్యక్తిత్వం ఉంది.. నాకూ లక్ష్యాలున్నాయి..’ అనే ఆలోచనలు వారిలో బలంగా ఉంటాయి. పిల్లల్లో వ్యక్తిత్వాన్ని పెంచాలి.

12/19/2018 - 03:55

‘‘నా మాతృభూమిని ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నా... నా త్యాగం మరెందరికో స్ఫూర్తినిస్తుంది. హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. భారత్‌లోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడిగా గర్వపడుతున్నా..’’ -అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.

12/18/2018 - 01:51

అధికార పార్టీ ఆత్మవిశ్వాసంతో ఎన్నికల పోరులో అడుగుపెట్టి, మళ్లీ అఖండ మెజారిటీతో గెలిచిందంటే- కచ్చితంగా ఆ ప్రభుత్వం ప్రజలకు మేలుచేసినట్టు, సమర్ధవంతమైన పాలనను అందించినట్టు మనం భావించి అభినందించాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ అధికార పార్టీనే భారీ మెజారిటీతో ఓటర్లు గెలిపించడం ఈ విషయానే్న నిరూపిస్తున్నది. ఏ పార్టీ ఎలాంటిదో, ఏ నాయకుడు ఎలాంటివాడో ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు.

12/16/2018 - 02:36

ఓటరు స్వేచ్ఛగా, రహస్యంగా తన అభిప్రాయాన్ని ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల పట్ల తన ఓటు ద్వారా సానుకూలంగా లేక వ్యతిరేకంగా వ్యక్తం చేయటం జరుగుతుంది. ఓటు ద్వారా వెల్లడయ్యే ఈ ప్రజావాంఛ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వెల్లడయ్యిందో ఓసారి పరిశీలిద్దాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పలువురి అంచనాలను మించి భారీగా పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ రమారమి 75 శాతం వరకు జరిగింది.

12/14/2018 - 02:03

ఎక్కడ సాధన ఉండదో అక్కడ బోధన ఉండదు అంటారు. ఎక్కడ విద్యార్థి ఉండడో అక్కడ ఉపాధ్యాయుని అస్తిత్వం కనపడదు అంటారు. బోధించేటప్పుడే ఉపాధ్యాయుడు నేర్చుకుంటాడు. తను చదువుకున్నది వల్లెవేయటం కాదు. విద్యార్థుల్లో ఉండే ఆసక్తే ఉపాధ్యాయుని సాధనకు మూలం. విద్యార్థులు చేసే తప్పులు ఒప్పులను సరిచేసే మార్గమే ఉపాధ్యాయునికి సాధన.

Pages