S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/21/2017 - 01:10

రైతుల ఆత్మహత్యలపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల స్పందిస్తూ- ‘రైతు చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు. ఆ పరిస్థితిని నివారించడానికి మీరు తీసుకొంటున్న సమగ్ర విధానమేమిట’ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం హర్షణీయం. గత నెలలోకూడా ఇదే తీరులో అన్నదాత ఆత్మహత్యల్ని మానవ హక్కుల ఉల్లంఘనగా భావించాలంటూ న్యాయ పాలిక ఆదేశించడం జరిగింది. ఇక ఆ స్ఫూర్తిని పాలకులు అందిపుచ్చుకోవాలి.

03/20/2017 - 01:02

రాజకీయ పార్టీలు వాటి పాత్రను సక్రమంగా నిర్వహించనందునే మన ప్రజాస్వామ్యం బలహీనమై పోతోంది. పదవుల కోసం నేతల తపన. ప్రజాసేవ హామీలకే పరిమితం. అభివృద్ధి కాగితాల పైనే. గత నాలుగు దశాబ్దాల్లో మన రాజకీయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టింది. అధికారం కోసం ఎత్తుకు పైఎత్తులు వేయడం మొదలు పెట్టింది.

03/19/2017 - 02:38

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన ప్రధాని మోదీ కంటే.. తామెందుకు ఓడిపోయాం, ఇక తమ పార్టీల భవిష్యత్తేమిటన్న దానిపై నిజాలు మాట్లాడిన ఒ మర్ అబ్దుల్లా, చిదంబరం, మణిశంకర్ అయ్యర్ వంటి స్థితప్రజ్ఞులను అభినందించాలి. మరో ఐదేళ్ల వరకూ తమ ‘దౌర్భాగ్యం’ ఇలాగే ఉంటుందని ‘ఏడున్నరేళ్లముందే’ ఈ నేతలు కనిపెట్టడం విశేషమే. తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, దాని తోక పార్టీలకు ఇంకా కర్తవ్యం బోధ పడనట్లుగానే ఉంది.

03/18/2017 - 00:58

దేశంలో మోదీ హవా లేనే లేదని ‘ఆప్’ నేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఓ సభలో విమర్శిస్తుండగా- ‘తల నుంచి మెడ వరకూ చుట్టుకున్న మఫ్లర్‌ను కాస్త తొలగించి చూడండ’ని ఎవరో సలహా ఇచ్చారట! పాలనా పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్నా మోదీలో వాడి,వేడి తగ్గలేదు. కొత్త శకాన్ని చూపిస్తున్న మోదీకి, ఆయన అనుచరగణానికి యుపి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

03/17/2017 - 00:56

భూమిలో సహజంగా లభించే చమురు, బొగ్గు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను ఒక్కసారిగా దగ్ధం చేస్తే భూగోళంపై సగటున 12డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదే గనుక జరిగితే ధృవాల వద్ద, ఇతర ప్రాంతాల్లోను మంచు అంతా కరిగి సముద్రమట్టం అనూహ్యంగా పెరుగుతుంది. అయితే, ఈ విపరిణామం రాత్రికి రాత్రి జరగదు.

03/16/2017 - 07:36

అన్ని తరహాల ప్రభుత్వాల్లోకీ ప్రజాస్వామ్యమే మేలని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వానే్నర్పరిచే ప్రజాప్రతినిధులను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు గనుక. పాలనా నిర్వహణలో పరోక్షంగానైనా ప్రజల ప్రమేయం ఉంటుంది. తామెన్నుకున్న ప్రభుత్వం సంతృప్తికరంగా పనిచేయకపోతే, ఒక నిర్ధిష్ట కాలపరిమితి (అయిదేళ్లు) తర్వాత ఆ పార్టీని మార్చి, మరో ప్రభుత్వాన్ని ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా ఎన్నుకోవచ్చును.

03/16/2017 - 07:33

మనం జీవిస్తున్నది ఆవిష్కరణల యుగం. ఆవిష్కరణల ప్రభావం ఉన్నత విద్యపై తప్పక ఉంటుంది. ఉన్నతవిద్యలో రాణించేవారికే జీవితంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాఠశాల విద్యలో చాలామంది మంచి అలవాట్లతో గొప్ప సంస్కారంతో బైటకు వస్తారు. కారణం ఆ స్థాయిలో విద్యార్థిపై పర్యవేక్షణ చేసేవాళ్లు చాలామంది ఉంటారు.

03/15/2017 - 00:24

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ఇవ్వడానికి చాలాకాలం ముందే ఆ పార్టీకి నిలువ నీడ లేకుండా చేశారు ఒడిశా ప్రజలు. ఒక విధంగా జాతీయ పార్టీగా కాంగ్రెస్ పతనం ఇక్కడి నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. 2000 నుంచి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటున్న బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కాంగ్రెస్‌ను తిరిగి కోలుకోనీయలేదు.

03/14/2017 - 00:43

ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అఖండ విజయానికి కారకుడైన ప్ర ధాని మోదీ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించారు. ‘పొలిటికల్ క్రికెట్’లో నియమాలు మారలేదు, కేవలం ఫార్మాట్ మారిందంతే. అవే ఫోర్లు.. అవే సిక్సర్లు.. టెస్టు క్రికెట్ నుండి టి- 20కి మార్చినట్టు. ఆ ఫార్మాట్‌లోని మార్పులు ఇతర పక్షాలు పసిగట్టేలోగా ఆట పూర్తయింది.

03/13/2017 - 01:04

‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ అని మన తెలుగు భాష మాధుర్యాన్ని పొగడుతుంటారు. ఇటాలియన్ భాష చాలా శ్రవణానందంగా ఉంటుందని యూరోపియన్ భాషలతో కాస్త ఎక్కువ పరిచయం ఉన్నవారు అంటారు. తెలుగు భాషకి ఆ మాటకివస్తే భారతీయ భాషలకీ, యూరోపియన్ భాషలకీ పోలికేమిటి? యూరప్‌లో అన్నీ భాష ఆధారంగా రూపొందిన రా జ్యాలు, భాషల ఆధారంగా ఏర్పడిన భిన్నమైన జాతులు, రా ష్ట్రాలు ఉన్నాయి. ‘యూరోపియన్ జాతీయత’ అని ఏమీలేదు.

Pages