S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/02/2017 - 08:52

మన పాలకులు స్వీయ రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రజారక్షణకు ఇవ్వడం లేదు. అందువల్లనే మన దేశంలో నేరాల సంఖ్య నానాటికీ ఆందోళనకరంగా పెరిగిపోతోంది. శాంతిభద్రతలు క్షీణించినా, నేరాలు పెరిగినా అందుకు మన రక్షక భటుల అసమర్ధతే కారణమని ఆరోపించడం మన పాలకులకు అలవాటు. ఇది కేవలం వాస్తవాలను మరుగున పడవేయడానికి వారు ఆడుతున్న నాటకం మాత్రమే. ప్రపంచంలో అత్యుత్తమ పోలీసు వ్యవస్థలలో మనది ఒకటి.

02/02/2017 - 08:50

ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు ఏదో ఒక పుస్తకంలో నుంచి ఆ ప్రశ్న ను యథాతథంగా ఇచ్చే అలవాటు ఉపాధ్యాయులందరికీ ఉంటుంది. కానీ, ఈనాడు ప్రశ్నపత్రాన్ని ఎంతో జాగ్రత్తగా ఆలోచనతో రూపొందిస్తున్నారు. అంతమాత్రం చేత గతంలో చదువుకున్నటువంటి జ్ఞానం వృథా అని కాదు. దాన్ని నేటి సమాజానికి అనుకూలంగా మార్చవలసి ఉంది. వెనకటి కాలంలో చిన్నపిల్లలకు 4తి3 గుణిస్తే ఏం వస్తుందని ప్రశ్నించేవారు.

02/01/2017 - 00:31

సోనియా కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీల సంక్షేమం పేరిట జాతి విచ్ఛిన్నకర పథకాలను చేపడుతున్నాయి.

01/31/2017 - 01:18

భారత్ సహా అనేక దేశాల్లో నేడు వీధిబాలల సంరక్షణ ఓ సమస్యలా పరిణమించింది. పలు కారణాల రీత్యా కుటుంబ వ్యవస్థలో సంబంధ బాంధవ్యాలు విచ్ఛిన్నం కావడంతో ఎంతోమంది పిల్లలు అనాథలవుతున్నారు. అనాథ పిల్లల్లో కొద్దిమంది మాత్రమే శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఎవరూ పట్టించుకోనందున నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 28 మిలియన్ల మంది పిల్లలు వీధినపడి సంరక్షణకు దూరమయ్యారు.

01/30/2017 - 01:03

ఆయన వయస్సు సుమారు ‘తొమ్మిదిన్నర దశాబ్దాలు’. అయినప్పటికీ.. ఆయన ఎలాంటి వయోభారం లేకుండానే నవ యువకుడి మాదిరిగా పనిచేస్తారు. తమ ఉత్పత్తులలో నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం తగ్గకుండా చూడటంతోపాటు, నిరంతరం మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేస్తూ డీలర్లను కలుసుకొంటారు. ఆయనకు ఆదివారం, సోమవారం అనే భేదం లేదు. సెలవులతో సంబంధం లేదు.

01/29/2017 - 02:34

కొద్దిరోజుల క్రితం ఓ ఆంగ్లపత్రిక ‘అంతానికిది ఆరంభం’ శీర్షికతో మావోయిస్టులపై ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. భద్రతాదళాల అధికారులతో జరిపిన ఇంటర్వ్యూతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం ఇన్‌చార్జి గాజర్ల రవి వ్యాఖ్యలను ఆ పత్రికలో ప్రచురించారు. ఇకపై గెరిల్లా రణతంత్రం ఉండదని, సంప్రదాయ యుద్ధమే తమ ప్రజావిముక్తి సైన్యం (పిఎల్‌ఏ) చేస్తుందని మావోయిస్టు నేత వెల్లడించారు.

01/28/2017 - 03:39

భారతదేశ 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘బుర్జ్ ఖలీఫా’ భవనం మన జాతీయ పతాకంలోని అశోక్ చక్రం సహా త్రివర్ణాలతో ధగధగాయమానంగా వెలిగిపోవడం అసాధారణ విషయం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని దుబాయ్‌లో 2,722 అడుగుల (829.8 మీటర్ల) ఎత్తున అయిదేళ్ల కాలంలో నిర్మించిన ఈ భవనాన్ని ‘బుర్జ్ దుబాయ్’, ‘ఖలీఫా టవర్స్’ అని కూడా పిలుస్తారు.

01/27/2017 - 02:45

అధిక రక్తపోటుతో బాధపడే రోగుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతోంది. గడచిన 40 ఏళ్లలో హైబీపీ రోగుల సంఖ్య దాదాపు రెట్టింపైందని తేలింది. ప్రస్తుతం వీరి సంఖ్య 113 కోట్లు. ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ శాస్తవ్రేత్తల నేతృత్వంలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 1975-2015 మధ్య వివిధ దేశాలలో రక్తపోటు అంశంలో మార్పులపై ఈ అధ్యయనం కొనసాగింది. ఈ తరహా పరిశోధనల్లో ఇదే అతి విస్తృతమైనది కావడం విశేషం.

01/26/2017 - 07:28

ప్రతి దేశం ‘విజయం’ అనే పదాన్ని రకరకాలుగా అన్వయించుకుంటుంది. అమెరికాలో ఎవడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడో వాడే విజయవంతుడని అర్థం. ఎక్కువ బిజెనెస్‌ను తన చాతుర్యంతో ఏ వ్యక్తి అభివృద్ధి చేసుకుంటాడో ఆ వ్యక్తి విజయవంతుడని అర్థం. అంటే- ఇలా ధనం సంపాదించిన వారందరూ స్వార్థపరులని అనుకోకండి. కూడబెట్టిన ధనమంతా కొన్ని సేవాసంస్థలకు దానధర్మాలు చేసిన వారు కూడా ఉన్నారు.

01/26/2017 - 07:26

పిల్లలకు పసితనంలోనే మాతృభాషపై మమకారం కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ చూపాలి. చిన్నప్పటి నుంచే వారిపై ఆంగ్లభాషను బలవంతంగా రుద్దితే పాఠ్యాంశాలు నేర్చుకుంటారే తప్ప, పిల్లల్లో మానసిక వికాసం, లోకజ్ఞానం వంటివి కనిపించవు. మాతృభాషలోనే బోధన జరిగితే వారి బుద్ధి వికసిస్తుంది. మాతృభాషపై పట్టుసాధించినపుడు ఇతర భాషలను నేర్చుకోవడం ఏమంత కష్టం కాదు.

Pages